iDreamPost
android-app
ios-app

నాకౌట్ మ్యాచ్ కోసం మాస్టర్ ప్లాన్.. ద్రవిడ్ స్కెచ్ మామూలుగా లేదుగా!

  • Author singhj Updated - 11:53 AM, Sat - 11 November 23

సెమీఫైనల్ ఫైట్ కోసం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. నాకౌట్ పోరు కోసం ద్రవిడ్ వేస్తున్న ఆ స్కెచ్ ఏంటంటే..!

సెమీఫైనల్ ఫైట్ కోసం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. నాకౌట్ పోరు కోసం ద్రవిడ్ వేస్తున్న ఆ స్కెచ్ ఏంటంటే..!

  • Author singhj Updated - 11:53 AM, Sat - 11 November 23
నాకౌట్ మ్యాచ్ కోసం మాస్టర్ ప్లాన్.. ద్రవిడ్ స్కెచ్ మామూలుగా లేదుగా!

వన్డే వరల్డ్ కప్​లో టీమిండియాకు ఇప్పటిదాకా ఓటమనేదే లేదు. మెగా టోర్నమెంట్​లో ఆడిన 8 మ్యాచుల్లోనూ విజయఢంకా మోగించింది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తూ చేస్తూ ఫేవరెట్స్ నుంచి హాట్ ఫేవరెట్స్​గా మారింది రోహిత్‌ సేన. నెదర్లాండ్స్​తో ఆడాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్​ను పక్కనెబెడితే నెక్స్ట్ సెమీఫైనల్​ మీదే అందరి ఫోకస్ నెలకొంది. టీమిండియా జైత్రయాత్ర ఇలాగే కంటిన్యూ అవ్వాలని.. సెమీస్, ఫైనల్స్​నూ నెగ్గి ముచ్చటగా మూడోసారి కప్పును సొంతం చేసుకోవాలని కోట్లాది మంది భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఆడింది ఒకెత్తు.. నెక్స్ట్ ఆడాల్సిన మ్యాచులు మరొకెత్తు అనే చెప్పాలి. లీగ్ దశలో ఎలా ఉన్నా నాకౌట్​ దగ్గరకు వచ్చేసరికి టీమ్స్ మధ్య పెద్ద తేడా కనిపించదు.

నాకౌట్ మ్యాచుల్లో గెలిచే అవకాశాలు ఇరు జట్లకూ ఉంటాయి. ఒత్తిడిని జయించిన టీమ్ విజేతగా నిలిచే ఛాన్స్ ఉంటుంది. అలాంటి మ్యాచుల్లో తలపడే జట్ల మధ్య పెద్దగా డిఫరెన్స్ లేకపోయినప్పటికీ బలాబలాలు మాత్రం ఎప్పుడూ ముఖ్యమే అని చెప్పాలి. ఒత్తిడిలోనూ రాణించాలంటే స్ట్రెంగ్త్​ను పెంచుకుంటూనే.. వీక్​నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని బెటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోహిత్ సేన అన్ని విభాగాల్లోనూ చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్​లో శుబ్​మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్​లు సూపర్ ఫామ్​లో ఉన్నారు. బౌలింగ్​లో జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు అదరగొడుతున్నారు. మన ప్లేయర్లు ఫీల్డింగ్​లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు.

భారత ప్లేయర్లు గ్రౌండ్​ ఫీల్డింగ్​తో పాటు సూపర్బ్​గా క్యాచులు అందుకుంటున్నారు. దీంతో టీమ్​కు ఎక్కడా వంక పెట్టడానికి లేదన్నట్లుగా కనిపిస్తోంది. మన టీమ్ కాంబినేషన్ బాగానే ఉన్నా హార్దిక్ పాండ్యా లాంటి నిఖార్సయిన పేస్ బౌలింగ్ ఆల్​రౌండర్​ లేకపోవడం బలహీనత అనే చెప్పాలి. అతడు జట్టులో ఉంటే బ్యాట్​తో రన్స్ చేయడమే గాక బాల్​తో వికెట్లూ తీసేవాడు. పాండ్యా లేకపోవడంతో ఐదుగురు బౌలర్లతో దిగాల్సిన పరిస్థితి. దీంతో వాళ్లలో ఏ ఒక్కరు ఫెయిలైనా మరో బౌలర్​తో ఓవర్లు వేయించలేరు. బ్యాటింగ్​లోనూ జడేజా తర్వాత ఎవరూ లేరు. అందుకే నాకౌట్​లో ఈ సమస్య ఏర్పడితే ఎలా అని గ్రహించిన భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ వేశాడు.

బ్యాటర్లు కోహ్లీ, గిల్​తో ద్రవిడ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడని తెలుస్తోంది. అవసరమైతే వారితో రెండు, మూడు ఓవర్లు వేయించాలని అనుకుంటున్నాడట. అదే టైమ్​లో టెయిలెండర్లు షమి, సిరాజ్​, బుమ్రా, కుల్​దీప్​తో బ్యాటింగ్​ సాధన చేయిస్తున్నాడని తెలిసింది. బ్యాటర్లు త్వరగా ఔటైనా లేదా ఆఖరి ఓవర్లలో వికెట్లు పడినా టెయిలెండర్లు సాధ్యమైనన్ని రన్స్ చేసేలా, వికెట్​ను కాపాడుకునేలా ప్రాక్టీస్ చేయిస్తున్నాడని సమాచారం. ఒకవేళ ద్రవిడ్ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం టీమిండియాకు ఉన్న ఆ ఒక్క వీక్​నెస్​ కూడా స్ట్రెంగ్త్​గా మారినట్లేనని చెప్పొచ్చు. మరి.. నాకౌట్​ మ్యాచ్​కు ముందు ద్రవిడ్ వేసిన మాస్టర్ ప్లాన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: షమి జీవితంలోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ తలరాత మార్చేసింది!