రచిన్ రవీంద్ర కోసం IPL ఫ్రాంచైజీల క్యూ! వచ్చే సీజన్​లో ఆ టీమ్​లో?

  • Author singhj Published - 03:24 PM, Sat - 7 October 23
  • Author singhj Published - 03:24 PM, Sat - 7 October 23
రచిన్ రవీంద్ర కోసం IPL ఫ్రాంచైజీల క్యూ! వచ్చే సీజన్​లో ఆ టీమ్​లో?

క్రికెట్​లో ఎంత తీవ్ర పోటీ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలంటే డొమెస్టిక్ సీజన్​లో బాగా రాణించాలి. లీగ్స్​ లాంటి వాటిల్లో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోకూడదు. అలా ఎప్పటికప్పుడు తమ పెర్ఫార్మెన్స్​ను, ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. అయినా అవకాశం వస్తుందని చెప్పలేం. కానీ ఛాన్స్ వస్తే పక్కాగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొందరు క్రికెటర్లు ఇలా తమకు వచ్చిన ప్రతి ఛాన్స్​ను యూజ్ చేసుకొని టీమ్స్​లో సెటిలయ్యారు. కొందరైతే ఒకే ఒక్క ఇన్నింగ్స్​తో లేదా అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేసి ఓవర్​నైట్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడా లిస్టులోకి చేరాడు న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.

వరల్డ్ కప్-2023 ఓపెనింగ్ మ్యాచ్​లో ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్టుపై రచిన్ రవీంద్ర ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ సంచలనమనే చెప్పాలి. హాట్ ఫేవరెట్​గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీమ్​ను రచిన్ సెన్సేషన్ బ్యాటింగ్​తో బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్​లో అతడు 96 బంతుల్లో 5 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో 123 రన్స్ చేశాడు. వన్​డౌన్​లో బ్యాటింగ్​కు దిగిన రచిన్.. ఓపెనర్ డెవాన్ కాన్వాయ్​ (121 బంతుల్లో 152 రన్స్)తో కలసి ఏకంగా 273 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పి టీమ్​కు సూపర్బ్ విక్టరీని అందించాడు. ప్రపంచ కప్​ సెమీస్​లోకి తమకు ప్లేస్ కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో ఇంగ్లండ్​పై అద్భుత విజయంతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది కివీస్.

ఇక, పాకిస్థాన్​తో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్​లోనూ రచిన్ రవీంద్ర మంచి ఇన్నింగ్స్ ఆడాడు. క్వాలిటీ పేస్ అటాక్ ఉన్న పాక్​ను ఎదుర్కొని 97 రన్స్ చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్​ఫై ప్రతాపం చూపించాడు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించాడు రచిన్. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఈ స్టార్ బ్యాటర్​పై కన్నేశాయి. అతడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్​ రాయల్స్​తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా క్యూ కడుతోందని వినికిడి. అయితే మెరుగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి ఇష్టపడే గుజరాత్.. రచిన్​ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందంట. ఇప్పటకే ఆ టీమ్​లో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. ఒకవేళ రచిన్​ కూడా ఆ జట్టులో చేరితే ఇక గుజరాత్​ను ఆపడం కష్టమేనని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.

ఇదీ చదవండి: World Cup: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో పాక్‌ చీటింగ్‌! బౌండరీ లైన్‌ వెనక్కి నెట్టి..

Show comments