iDreamPost
android-app
ios-app

ఫైనల్​లో భారత్​కు అతడే కీలకం.. ఆసీస్ బౌలర్లను చితగ్గొట్టడం ఖాయం: గంభీర్

  • Author singhj Published - 05:10 PM, Fri - 17 November 23

ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ కప్ ఫైనల్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. మరో ప్లేయర్ భారత్​కు కీలకం అవుతాడని గంభీర్ అన్నాడు. అతడు ఆసీస్ బౌలర్లను చితగ్గొడతాడని చెప్పాడు.

ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ కప్ ఫైనల్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. మరో ప్లేయర్ భారత్​కు కీలకం అవుతాడని గంభీర్ అన్నాడు. అతడు ఆసీస్ బౌలర్లను చితగ్గొడతాడని చెప్పాడు.

  • Author singhj Published - 05:10 PM, Fri - 17 November 23
ఫైనల్​లో భారత్​కు అతడే కీలకం.. ఆసీస్ బౌలర్లను చితగ్గొట్టడం ఖాయం: గంభీర్

అద్భుతంగా ఆడుతూ వరల్డ్ కప్ ఫైనల్​కు చేరుకుంది టీమిండియా. లీగ్ స్టేజ్​లో వరుసగా 9 విజయాలు సాధించడం ఒకెత్తయితే.. నాకౌట్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేయడం మరొకెత్తనే చెప్పాలి. సెమీఫైనల్​ మ్యాచ్​లో కేన్ విలియమ్సన్-డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్న టైమ్​లో తప్పితే మిగతా మొత్తం రోహిత్ సేన డామినేషనే నడిచింది. భారత్ గ్రౌండ్​లోకి దిగితే చాలు.. ప్రత్యర్థి టీమ్స్ ఎలా ఆడాలో తెలియక భయపడిపోతున్నాయి. అన్ని విభాగాల్లో ఫుల్ స్ట్రాంగ్​గా, సూపర్ ఫామ్​లో ఉన్న టీమిండియాను ఫేస్ చేయాలంటేనే గజగజా వణికిపోతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక ఫైనల్​లో మరో లెక్క అనే చెప్పాలి. ఎందుకుంటే అవతల ఉన్నది డేంజరస్ టీమ్ ఆస్ట్రేలియా. వరల్డ్ కప్స్​లో ఆ జట్టుకు ఉన్నంత గొప్ప రికార్డు మరే టీమ్​కు లేదు.

ఈ వరల్డ్ కప్​లో ఆసీస్ టీమ్ ఫైనల్​కు చేరుకున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఆ జట్టుకు విజయాలు కొత్త కాదు. కప్పులు అసలే కొత్త కాదు. ఎప్పుడు ప్రపంచకప్ జరిగినా కంగారూ టీమ్​ మినిమం సెమీస్​కు చేరుకుంటుందనే ఎక్స్​పెక్టేషన్స్ ఉంటాయి. పొరపాటున ఆసీస్ గనుక ఫైనల్​కు వచ్చిందా అవతలి జట్టు కప్పుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ ఏడాది కూడా ఫేవరెట్స్​లో ఒకటిగా మెగాటోర్నీకి వచ్చింది కమిన్స్ సేన. కానీ ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ఓటమే. పాయింట్స్ టేబుల్​లో అందరికంటే లాస్ట్ ప్లేస్. అయితే అద్భుతంగా పుంజుకున్న కంగారూ జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్​లు నెగ్గి ఫైనల్స్​కు దూసుకెళ్లింది. టీమిండియాతో తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటోంది. ప్రత్యర్థులు ఎంత కలవరపెట్టినా లొంగని ఈ టీమ్​ను దాటుకొని ట్రోఫీని చేతబట్టడం ఇప్పుడు రోహిత్ సేన ముందున్న టార్గెట్. ఆసీస్​తో ఫైనల్ ఫైట్​కు భారత టీమ్ రెడీగా ఉంది.

సూపర్ ఫామ్​లో ఉన్న భారత బ్యాటింగ్ ఆర్డర్ కంగారూ బౌలింగ్ అటాక్​ను చిత్తు చేయాలని అనుకుంటోంది. విరాట్ కోహ్లీ (711 రన్స్), రోహిత్ శర్మ (550), శ్రేయస్ అయ్యర్ (526), కేఎల్ రాహుల్ (386), శుబ్​మన్ గిల్ (346) భీకర ఫామ్​లో ఉన్నారు. ఈ మ్యాచ్​లో భారత్ తరఫున ఎవరు హీరో అవుతారో చూడాలి. అయితే ఫైనల్ మ్యాచ్​లో కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాకు అయ్యర్ చాలా కీలకమని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. అతడు ఆసీస్ బౌలర్లను చితగ్గొడతాడని అన్నాడు. ‘ఈ వరల్డ్ కప్​లో శ్రేయస్ అయ్యర్ బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్​గా మారాడు. గాయం బారిన పడి, టీమ్​లో ప్లేస్ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి నుంచి.. నాకౌట్ మ్యాచ్​లో 70 బంతుల్లో సెంచరీ చేయడమంటే మాటలు కాదు. ఫైనల్​లో మిడిల్ ఓవర్లలో మ్యాక్స్​వెల్, జంపా బౌలింగ్ టైమ్​లో భారత్​కు అతడే కీలకం కానున్నాడు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి.. అయ్యర్​పై గౌతీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియా- ఆసీస్ ఫైనల్ మ్యాచ్.. పిచ్ పై స్టార్క్ ఆసక్తికర కామెంట్స్!