న్యూజిలాండ్‌తో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ అనగానే భారత ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ఈసారి భయపడాల్సింది భారత్ కాదు.. కివీస్ అనే చెప్పాలి.
న్యూజిలాండ్‌తో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ అనగానే భారత ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే ఈసారి భయపడాల్సింది భారత్ కాదు.. కివీస్ అనే చెప్పాలి.
వన్డే వరల్డ్ కప్-2023లో ఓటమనేదే లేకుండా సెమీఫైనల్‌కు చేరుకుంది టీమిండియా. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తూ నాకౌట్ పోరుకు దర్జాగా దూసుకొచ్చిన భారత్.. సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. వరుస విజయాలతో ఉన్న రోహిత్ సేనను నాకౌట్ పోరులో ఓడించాలని కివీస్ అనుకుంటోంది. ఆ టీమ్ మొదట్లో వరుసగా నాలుగు గెలుపులతో డేంజరస్‌గా కనిపించినా.. ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. అయితే ఆఖర్లో తేరుకొని ఎలాగోలా సెమీస్‌కు క్వాలిఫై అయింది. అయితే న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ అనగానే టీమిండియా ఫ్యాన్స్ భయపడిపోతున్నారు.
అమ్మో.. మళ్లీ కేన్ మామ టీమ్‌తో సెమీస్ మ్యాచా అని భారత అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మళ్లీ గత వరల్డ్ కప్లోలాగే రిజల్ట్ వస్తుందేమో అని గాభరా పడిపోతున్నారు. 2019 వరల్డ్ కప్ సెమీస్ ఫైట్‌లో కివీస్ చేతుల్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. గెలుపు ఖాయం అనుకున్న మ్యాచ్‌లో ఆఖరి క్షణాల్లో తడబడి విక్టరీని దూరం చేసుకుంది. లెజెండ్ ఎంఎస్ ధోని గనుక రనౌట్ కాకపోయి ఉంటే ఆ మ్యాచ్‌లో ఫలితం వేరేలా ఉండేది. కానీ బ్యాడ్ లక్ కొద్దీ మాహీ ఔటవ్వడంతో ఫైనల్‌కు చేరకుండానే ఆ టోర్నీలో జర్నీని ముగించింది టీమిండియా. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేసుకొని భారత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
సెమీస్ అంటే భయపడాల్సింది రోహిత్ సేన కాదు.. విలియమ్సన్ టీమే. దీనికి కొన్ని కారణాలను ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఈ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ అంత గొప్పగా లేదు. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర ఒక్కడే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. లీగ్ మ్యాచ్‌లో టీమిండియాపై సెంచరీ బాదిన డారిల్ మిచెల్ కూడా బాగానే ఆడుతున్నాడు. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌ను పక్కన పెడితే మిగతా కివీస్ బ్యాటర్లలో ఎవరూ కన్సిస్టెంట్గా రన్స్ చేయడం లేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూపంలో మరో డేంజరస్ బ్యాట్స్‌మన్ ఆ టీమ్‌లో ఉన్నాడు. కానీ మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్లి అవసరమైతే హార్డ్ హిట్టింగ్‌కు దిగే క్యాపబిలిటీస్ కేన్ మామకు తక్కువే. గాయం ఎక్కడ తిరగబెడుతుందోనని అతడు భయపడుతున్నాడు.
న్యూజిలాండ్ జట్టు బౌలర్లలో కూడా మిచెల్ శాంట్నర్ ఒక్కడే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో టాప్-10 బౌలర్ల లిస్టులో కివీస్ నుంచి శాంట్నర్ (16 వికెట్లు) ఒక్కడే ఉన్నాడు. దీన్ని బట్టే ఆ టీమ్ బౌలింగ్ యూనిట్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదని అర్థమైపోతుంది. ఈ వరల్డ్ కప్‌లో టాప్-5లో నిలిచిన టీమ్స్‌లో ఒక్క దాని మీద కూడా న్యూజిలాండ్ నెగ్గలేదు. శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మీద గెలిచి సెమీస్‌కు రీచ్ అయింది కివీస్. సెమీఫైనల్‌కు వచ్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియాతో పాటు టాప్-5లో నిలిచిన పాకిస్థాన్ చేతుల్లో ఆ టీమ్ ఓటమి పాలైంది. ఈ వరల్డ్ కప్‌లో ఒక దశలో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్ పెర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను పక్కనబెడితే కివీస్ ఇప్పటిదాకా ఒక్క ప్రపంచ కప్ కూడా నెగ్గలేదు. ఆ టీమ్ సెమీస్ రికార్డు చెత్తగా ఉంది. 2015కి ముందు న్యూజిలాండ్ ఏడుసార్లు సెమీస్‌కు వస్తే.. ఆ 7 సార్లూ ఓడిపోయింది. ఇక, ఈ వరల్డ్ కప్‌లో భారత టీమ్ సూపర్ ఫామ్‌లో ఉంది. బౌలర్లు, బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఇన్ని సమస్యల మధ్య సూపర్ టచ్‌లో ఉన్న టీమిండియాను.. వాళ్ల సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ భయపడుతోంది. ఆల్రెడీ ఈ టోర్నీ లీగ్ స్టేజ్‌లో భారత్ చేతిలో ఓడిపోవడంతో తీవ్ర ఒత్తిడి మధ్య నాకౌట్ మ్యాచ్‌లో రోహిత్ సేనతో ఆడాలంటే ఆ టీమ్ వణుకుతోంది. మరి.. సెమీస్ అంటే భారతే కాదు కివీస్ కూడా భయపడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రేపే సెమీస్..! గంగూలీ ఆదర్శంగా బరిలోకి కోహ్లీ, రోహిత్!