iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్.. ఇంగ్లండ్​ను వెనక్కి నెట్టి..!

  • Author singhj Published - 10:07 PM, Sat - 28 October 23

నెదర్లాండ్స్.. ఇక ఈ టీమ్​ను పసికూన అనడానికి ఎవరైనా భయపడాల్సిందే. వరల్డ్ కప్​లో ఈ టీమ్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్​లో ఉంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్​కు షాకిచ్చిన డచ్ టీమ్.. ఇవాళ బంగ్లాదేశ్​ను చిత్తుగా ఓడించింది.

నెదర్లాండ్స్.. ఇక ఈ టీమ్​ను పసికూన అనడానికి ఎవరైనా భయపడాల్సిందే. వరల్డ్ కప్​లో ఈ టీమ్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్​లో ఉంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్​కు షాకిచ్చిన డచ్ టీమ్.. ఇవాళ బంగ్లాదేశ్​ను చిత్తుగా ఓడించింది.

  • Author singhj Published - 10:07 PM, Sat - 28 October 23
చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్.. ఇంగ్లండ్​ను వెనక్కి నెట్టి..!

వన్డే వరల్డ్ కప్-2023లో నెదర్లాండ్స్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్​ లాంటి డేంజరస్ టీమ్​ను పసికూనగా చేసి చిత్తుగా ఓడించింది. ఒక ప్రపంచ కప్​లో డచ్ టీమ్ రెండు విజయాలు సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 రన్స్​కు ఆలౌటైంది. టార్గెట్ పెద్దగా లేకపోయినా దాన్ని ఛేజ్ చేయడంలో ఫెయిలై పరాజయం పాలైంది బంగ్లాదేశ్. ఆ జట్టు లక్ష్య ఛేదనలో 142 రన్స్​కే కుప్పకూలింది. బంగ్లా టీమ్​లో టాప్-6 బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీన్ని బట్టే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహ్దీ హసన్ మిరాజ్ (35) టాప్ స్కోరర్​గా నిలిచాడు. మెయిన్ బ్యాటర్స్ అయిన లిట్టన్ దాస్ (3), నజ్ముల్ హొస్సేన్ శాంటో (9), షకీబల్ హసన్ (5), ముష్ఫికర్ రహీం (1) ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మహ్మదుల్లా (20), తాంజిద్ హసన్ (15) రన్స్ చేశారు. డచ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచాడు. బాస్ డీ లీడే 2 వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్, వాన్ బీక్, అ కెర్మాన్​కు ఒక్కో వికెట్ లభించింది. బంగ్లా ఏ దశలోనూ ఛేజింగ్ చేసేలా కనిపించలేదు. మొదటి నుంచి స్లోగా ఆడిన లిట్టన్ దాస్​ను ఆర్యన్ దత్ నాలుగో ఓవర్​లో వెనక్కి పంపాడు.

వాన్ బీక్ బౌలింగ్​లో తాంజిద్ హసన్ పెవిలియన్ చేరాడు. షకీబ్, నజ్ముల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 70 రన్స్​కే ఆ టీమ్ 6 వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్​లో మహ్మదుల్లా, మెహ్దీ హసన్ నిలకడగా ఆడటంతో స్కోరు 100 దాటింది. ఆ తర్వాత వాళ్లూ ఔటయ్యారు. ఇక నెదర్లాండ్స్ ఇన్నింగ్స్​లో స్కాట్ ఎడ్వర్డ్స్ (68), వెస్లీ బరేసి (41), సిబ్రాండ్ ఎంగెల్​బ్రెచ్ట్ (35) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మెహ్దీ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. షకీబల్​కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​ను వెనక్కి నెట్టి 9వ ప్లేస్​కు చేరుకుంది నెదర్లాండ్స్. మరి.. డచ్ టీమ్ పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్-కివీస్ మ్యాచ్​లో పరుగుల వర్షం.. వరల్డ్ కప్ హిస్టరీలో సరికొత్త రికార్డు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet