iDreamPost

ఆసీస్-కివీస్ మ్యాచ్​లో పరుగుల వర్షం.. వరల్డ్ కప్ హిస్టరీలో సరికొత్త రికార్డు!

  • Author singhj Published - 09:48 PM, Sat - 28 October 23

వరల్డ్‌ కప్ సెకండాఫ్ మామూలుగా లేదు. ఒకదాని తర్వాత ఇంకోకటి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్​ను ఆడియెన్స్​కు పంచుతున్నాయి. ఆసీస్-కివీస్ మ్యాచ్​ అయితే లాస్ట్ సెకన్ వరకు టెన్షన్ టెన్షన్​గా సాగింది.

వరల్డ్‌ కప్ సెకండాఫ్ మామూలుగా లేదు. ఒకదాని తర్వాత ఇంకోకటి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్​ను ఆడియెన్స్​కు పంచుతున్నాయి. ఆసీస్-కివీస్ మ్యాచ్​ అయితే లాస్ట్ సెకన్ వరకు టెన్షన్ టెన్షన్​గా సాగింది.

  • Author singhj Published - 09:48 PM, Sat - 28 October 23
ఆసీస్-కివీస్ మ్యాచ్​లో పరుగుల వర్షం.. వరల్డ్ కప్ హిస్టరీలో సరికొత్త రికార్డు!

వన్డే వరల్డ్ కప్​-2023లో భారీ స్కోర్లు రాట్లేదు, హైటెన్షన్ మ్యాచ్​లు జరగట్లేదు, స్టేడియాలకు ప్రేక్షకులు రావట్లేదనే విమర్శలు వినిపించాయి. దీనిపై సోషల్ మీడియాలో కొందరు విదేశీ మాజీ క్రికెటర్లు పోస్టులు పెట్టడం చూసే ఉంటారు. అయితే వీటన్నింటికీ రెండ్రోజుల్లో రెండు అద్భుతమైన మ్యాచులతో చెంపపెట్టు లాంటి సమాధానం దొరికింది. సౌతాఫ్రికా-పాకిస్థాన్ టీమ్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకు ఏ టీమ్ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆఖరుకు సఫారీ టీమ్ 1 వికెట్ తేడాతో మ్యాచ్​ నెగ్గింది. ఈ మ్యాచ్​కు దాదాపు 20 వేల మంది ఆడియెన్స్ వచ్చారని తెలుస్తోంది.

ఇవాళ మరో హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. ఫేవరెట్స్ అయిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్​ మధ్య మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వెళ్లింది. మ్యాచ్​లో ఒక టైమ్​లో ఆసీస్ గెలుస్తుందని అనిపించింది. కానీ ఆఖరు వరకు ఫైట్ చేసిన న్యూజిలాండ్ మ్యాచ్​ను చేజిక్కించుకునేలానే కనిపించింది. మొత్తానికి ఈ మ్యాచ్​లో కంగారూలనే విజయం వరించింది. భారీగా వచ్చిన ప్రేక్షకుల నడుమ మధ్య జరిగిన ఈ మ్యాచ్ వరల్డ్ కప్​లో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ అంటే ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది. మెగా టోర్నీలో వరుసగా రెండు రోజుల్లో రెండు థ్రిల్లర్స్ జరగడంతో సెకండాఫ్ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని అందరికీ అర్థమైపోయింది.

ఆసీస్-కివీస్ మ్యాచ్​ చాలా రికార్డులకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కమిన్స్ సేన 388 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లకు 383 రన్స్ చేసి ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​లో ఓవరాల్​గా 771 రన్స్ నమోదయ్యాయి. 48 ఏళ్ల వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఒక మ్యాచ్​లో ఇంత స్కోరు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. కివీస్, ఆసీస్ కలసి ఈ రికార్డును నమోదు చేశాయి. మరి.. ఈ వరల్డ్ కప్​లో ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచెస్ మరిన్ని జరగాలని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: వార్నర్, హెడ్ ఊహకందని విధ్వంసం.. 2 బంతుల్లోనే ఏకంగా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి