టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకుముందు ఏ ఇతర భారత క్రికెటర్ సాధించని ఓ ఫీట్‌ను నమోదు చేశాడు.
టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకుముందు ఏ ఇతర భారత క్రికెటర్ సాధించని ఓ ఫీట్‌ను నమోదు చేశాడు.
బ్యాటింగ్ అనేది టీమిండియాకు ఎప్పుడూ ప్రధాన బలంగానే ఉంది. సునీల్ గవాస్కర్ దగ్గరి నుంచి సచిన్ టెండూల్కర్ వరకు ఎందరో గ్రేట్ బ్యాట్స్‌మెన్‌ను క్రికెట్‌కు అందించింది భారత టీమ్. ప్రస్తుత తరంలోనూ బెస్ట్ బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉండే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారిని జెంటిల్మన్ గేమ్‌కు అందించింది టీమిండియా. బౌలర్లలోనూ కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ లాంటి చాలా మంది దిగ్గజాలు భారత్ నుంచి వచ్చారు. 2011 వరల్డ్ కప్‌లో బౌలింగ్ మన ప్రధాన ఆయుధమని చెప్పొచ్చు. ఈ ప్రపంచ కప్‌లోనూ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ మన స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అయితే ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైమ్ ఫీల్డింగ్‌లోనూ భారత్ సాలిడ్‌గా కనిపిస్తోంది.
ఒకప్పుడు టీమిండియాలో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా లాంటి బెస్ట్ ఫీల్డర్స్ ఉండేవారు. అయితే వీళ్లు తప్ప మిగతా ప్లేయర్స్ అంత గొప్పగా ఫీల్డింగ్ చేసేవారు కాదు. దీంతో క్యాచింగ్ పొజిషన్స్‌లో వీళ్లను మాత్రమే పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోచ్ రాహుల్ ద్రవిడ్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ గైడెన్స్‌తో టీమిండియా క్రికెటర్స్ అందరూ ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లాంటి వారే కాకుండా బౌలర్లైన మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా ఫీల్డింగ్‌లో సత్తా చాటుతున్నారు. గ్రౌండ్ ఫీల్డింగ్‌లో రన్స్ లీక్ చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. క్యాచుల విషయంలో భారత టీమ్‌లో ప్లేయర్లు ఒకరితో మరొకరు పోటీపడుతున్నారు.
బెస్ట్ ఫీల్డర్స్ అవార్డులు ఇస్తుండటంతో భారత టీమ్‌లో ఫీల్డింగ్ స్టాండర్డ్స్ బాగా పెరిగిపోయాయి. ఈ వరల్డ్ కప్‌లో జడేజా, అయ్యర్, కోహ్లీలు గాల్లోకి ఎగురుతూ సూపర్మ్యాన్లా క్యాచులు పట్టడం చూసే ఉంటారు. దీనికి ద్రవిడ్ అండ్ కో స్పెషల్ ట్రైనింగ్, అవార్డులు ఇస్తూ ఎంకరేజ్ చేయడమే కారణమని చెప్పొచ్చు. అయితే ఈ అవార్డుల విషయంలో స్టార్ బ్యాటర్, కీపర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఫీల్డింగ్ మెడల్స్‌ను రెండుసార్లు అందుకున్న ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కీపింగ్ అద్భుతంగా చేయడంతో అతడికి ఈ అవార్డు దక్కింది. మన ప్లేయర్లు ఇదే విధంగా ఫీల్డింగ్ చేస్తే వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి బ్యాటర్స్‌కు చుక్కలే అని నెటిజన్స్ అంటున్నారు. మరి.. కేఎల్ రాహుల్ అరుదైన ఘనతపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రషీద్ ఖాన్ కు రతన్ టాటా 10 కోట్ల నజరానా? క్లారిటీ ఇచ్చిన వ్యాపార దిగ్గజం
KL Rahul becomes the first player to win the best fielder medal twice in World Cup 2023. pic.twitter.com/v55mm5DQdm
— Johns. (@CricCrazyJohns) October 30, 2023