iDreamPost
android-app
ios-app

World Cup 2023: ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్​లో గెలిచేదెవరు?

  • Author singhj Updated - 10:45 AM, Sat - 14 October 23
  • Author singhj Updated - 10:45 AM, Sat - 14 October 23
World Cup 2023: ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్​లో గెలిచేదెవరు?

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ మైదానంలో ప్రతిష్టాత్మక మ్యాచ్​కు అంతా రెడీ అయిపోయింది. దాయాదులు ఇండియా-పాకిస్థాన్​ మధ్య ఫైట్​కు సర్వం సిద్ధమైంది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వన్డే వరల్డ్ కప్​లో అత్యంత కీలక పోరుకు మరికొన్ని గంటల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. పాకిస్థాన్​తో తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా వెయిట్ చేస్తోంది. మ్యాచ్​కు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే దానిపై చాలా ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. అయితే హిస్టరీ చూసుకుంటే భారత్ వైపే అనుకూలంగా ఉంది. ప్రస్తుతం కూడా టీమిండియాదే జోరు. బలాబలాల్లోనూ పాకిస్థాన్​ఫై భారత్​దే పైచేయి.

సొంత గడ్డపై ఆడుతుండటం టీమిండియాకు బిగ్ ప్లస్ కానుంది. ఈ మ్యాచ్​లో నిస్సందేహంగా భారత జట్టే ఫేవరెట్ అని చెప్పొచ్చు​. ఇప్పటిదాకా వన్డే వరల్డ్ కప్స్​లో భారత్-పాక్ ఏడు సార్లు తలపడ్డాయి. ఆ 7 మ్యాచుల్లోనూ టీమిండియానే విజయం వరించింది. దీన్ని బట్టే మెగా టోర్నీలో దాయాదిపై మన టీమ్ డామినేషన్ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఆసియా కప్​లోనూ పాక్​ను చిత్తు చేసింది రోహిత్ సేన. గతం చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా భారత జట్టుదే ఆధిపత్యం కనిపిస్తోంది. పాకిస్థాన్​తో పోల్చుకొని చూస్తే అన్ని విభాగాల్లోనూ టీమిండియా బలంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత భీకర ఫామ్​లో ఉన్నారు భారత ప్లేయర్లు. ఆసియా కప్​ను నెగ్గిన మన జట్టు.. ఆ తర్వాత ఆసీస్​తో సిరీస్​ను నెగ్గింది.

ఒక్క వార్మప్ మ్యాచ్​ ఆడకపోయినా, సరైన ప్రాక్టీస్ లేకపోయినా వరల్డ్ కప్-2023​లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది టీమిండియా. పటిష్టమైన కంగారూ టీమ్​పై ఓడిపోతామేమో అనే మ్యాచ్​లో పోరాడి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. బ్యాటర్లు అందరూ సూపర్ ఫామ్​లో ఉన్నారు. ఆసీస్​తో మ్యాచ్​లో ఫెయిలైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​లు ఆఫ్ఘాన్​తో మ్యాచ్​తో ఫామ్​ అందుకున్నారు. భారీ సెంచరీతో ప్రత్యర్థులకు హిట్​మ్యాన్ హెచ్చరికలు పంపాడు. డెంగ్యూ నుంచి కోలుకున్న ఓపెనర్ శుబ్​మన్ గిల్ తిరిగి టీమ్​లో చేరడంతో భారత్ మరింత బలంగా కనిపిస్తోంది. గత మ్యాచ్​లో ఆడిన శార్దూల్ ఠాకూర్ ప్లేసులో మమ్మద్ షమి లేదా రవిచంద్రన్ అశ్విన్​ను ఆడించొచ్చు. పిచ్ పరిస్థితుల్ని బట్టి ఇద్దరిలో ఎవరో ఒకర్ని తీసుకోవచ్చు. ఎవరు టీమ్​లో చేరినా అదనపు బలం చేకూరుతుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​లో టాప్ ఫామ్​లో ఉండటం.. తాజా ఫామ్, రికార్డులు, సొంత గడ్డపై ఆడటం టీమిండియాకు కలిసొచ్చే అంశాలు.

పాకిస్థాన్​ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ టీమ్​లో హారిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్, షఫీక్, బాబర్ ఆజం లాంటి డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో బాబర్​కు భారత్​ఫై మంచి రికార్డు లేదు. షఫీక్​కు ఎక్స్​పీరియెన్స్ లేదు. బ్యాటింగ్​లో రిజ్వాన్​ను త్వరగా ఔట్ చేయడం కీలకం. బౌలింగ్​లో రౌఫ్​తో పాటు షహీన్ ఆఫ్రిదీని సమర్థంగా ఎదుర్కోవడం ముఖ్యం. అయితే ప్రస్తుత ఫామ్, గత రికార్డులు, బలాబలాలు చూసుకుంటే ఈ మ్యాచ్​లో సొంతగడ్డపై ఆడుతున్న భారత్​దే గెలుపు పక్కా అని చెప్పాలి. ఏ విధంగా చూసినా ఇవాళ్టి మ్యాచ్​లో టీమిండియా నెగ్గడం ఖాయం. మన టీమ్​ స్థాయికి తగ్గట్లు ఆడితే వరల్డ్ కప్​లో ముచ్చటగా మూడో గెలుపు, పాకిస్థాన్​పై 8-0తో అజేయ రికార్డు కంటిన్యూ అవుతుంది. మరి.. ఈ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్​తో మ్యాచ్​కు ముందు రోహిత్​ను ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ టీమ్!