వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తానని ఒక కంపెనీ సీఈవో ప్రామిస్ చేశారు. టీమిండియా కప్పు కొడితే తమ కస్టమర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు.
వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తానని ఒక కంపెనీ సీఈవో ప్రామిస్ చేశారు. టీమిండియా కప్పు కొడితే తమ కస్టమర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు.
సొంతగడ్డ మీద జరుగుతున్న వరల్డ్ కప్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో అజేయ రికార్డు కంటిన్యూ చేస్తూ ఫైనల్‌కు చేరుకుంది టీమిండియా. ఆదివారం టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో తుదిపోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో అందరి ఫోకస్ ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంపై పడింది. దునియాలోనే అతిపెద్దదైన ఈ క్రికెట్ స్టేడియంలో 1.32 లక్షల మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంది. 1982లో నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియం మొతేరా స్టేడియంగా ప్రసిద్ధికెక్కింది. అయితే పాత స్టేడియం ప్లేసులోనే కొత్త దాని కన్స్ట్రక్షన్ 2015లో మొదలుపెట్టారు.
వరల్డ్‌లోనే అతి పెద్దదిగా మారిన మొతేరా స్టేడియాన్ని 2021లో మళ్లీ ప్రారంభించారు. ఈ గ్రౌండ్లో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. ఈ మైదానంలో భారత్‌కు ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. లెజెండ్ సునీల్ గవాస్కర్ 10 వేల రన్స్ మైల్‌స్టోన్‌ను చేరుకుంది ఇక్కడే. మొతేరా స్టేడియంలో కపిల్‌దేవ్‌కు కూడా గుర్తుండిపోయే మూమెంట్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్లో కపిల్ 432వ వికెట్ తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మైదానంలో 1987, 1996 వరల్డ్ కప్స్‌లో ఒక్కో మ్యాచ్ కూడా జరిగింది. 2011 ప్రపంచ కప్‌లో 3 మ్యాచ్‌లకు ఈ గ్రౌండ్ హోస్ట్‌గా ఉంది. వన్డే క్రికెట్లో 18 వేల రన్స్ చేసిన తొలి క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చరిత్ర సృష్టించిందీ ఇక్కడే. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ డబుల్ సెంచరీని మొతేరాలోనే సాధించాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్‌ను, 30 వేల రన్స్‌ను ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాడు.
మొతేరా స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమిండియా ఇప్పటిదాకా ఓడిపోలేదు. 1987లో జింబాబ్వే మీద 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 2011 ప్రపంచ కప్ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్లు తేడాతో ఇక్కడే చిత్తు చేసింది భారత్. ఇప్పుడూ అదే జోరును కంటిన్యూ చేస్తూ ఆసీస్‌ను ఓడించాలని చూస్తోంది. ఓవరాల్‌గా మొతేరా గ్రౌండ్లో ఇప్పటిదాకా 18 మ్యాచులు ఆడిన భారత్.. పదింట్లో నెగ్గి, ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక, భారత్‌లో క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉంది. మన జట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో ఫ్యాన్స్ పలు ప్రోగ్రామ్స్ మొదలుపెట్టారు. తిరంగాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ కంపెనీ సీఈవో తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించారు.
వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్‌పై భారత్ నెగ్గితే రూ.100 కోట్లు ఇస్తానని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆఖరిసారిగా 2011లో టీమిండియా వరల్డ్ కప్ నెగ్గినప్పుడు తాను కాలేజీలో చదువుకుంటున్నానని తెలిపారు. తన లైఫ్‌లో అత్యంత సంతోషకర క్షణాల్లో అదొకటని.. మ్యాచ్ గెలిచిన తర్వాత గూస్బంప్స్ కలిగాయన్నారు. ఇవాళ తన ఫైనాన్స్ టీమ్‌తో మాట్లాడానని.. ఇండియా కప్పు కొడితే తమ కస్టమర్ల వ్యాలెట్లలో రూ.100 కోట్లు వేస్తానని పునీత్ హామీ ఇచ్చారు. మన టీమ్ గెలుపు కోసం ప్రార్థిద్దామంటూ లింక్డ్ఇన్లో ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. మరి.. భారత్ కప్పు కొడితే రూ.100 కోట్లు ఇస్తానంటూ సీఈవో పునీత్ చేసిన ప్రకటనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. వాళ్లిద్దరూ చెలరేగితే వరల్డ్ కప్ మనదే!
#INDvsAUSfinal: @AstrotalkApp के CEO पुनीत गुप्ता का ऐलान, अगर टीम इंडिया #WorldcupFinal जीतती है तो #Astrotalk App अपने मुनाफे से 100 करोड़+ रुपये अपने यूजर्स में बांटेगा
VC: ©Instagram/astrotalk#100CrorekaCup #INDvAUS #CWC2023Final #CWC23Final #INDvsAUS #WCFINAL #PuneetGupta pic.twitter.com/tqvPFPROTk— GNN News MP/CG (@gnnnewsdigital) November 18, 2023