iDreamPost

రాసిపెట్టుకోండి.. వాళ్లిద్దరూ చెలరేగితే వరల్డ్‌ కప్‌ మనదే!

  • Published Nov 18, 2023 | 6:24 PMUpdated Nov 18, 2023 | 6:24 PM

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ కోసం ఇండియా-ఆస్ట్రేలియా సంసిద్ధంగా ఉన్నాయి. ఎలాగైనా కప్పు కొట్టాలని రెండు జట్లు గట్టి పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి. అయితే.. టీమిండియాకు ఓ ఇద్దరు ఆటగాళ్ల రాణింపు ఎంతో కీలకంగా మారనుంది. వాళ్లు ఎవరు? ఎందుకు వాళ్లిద్దరే అంత కీలకమో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ కోసం ఇండియా-ఆస్ట్రేలియా సంసిద్ధంగా ఉన్నాయి. ఎలాగైనా కప్పు కొట్టాలని రెండు జట్లు గట్టి పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి. అయితే.. టీమిండియాకు ఓ ఇద్దరు ఆటగాళ్ల రాణింపు ఎంతో కీలకంగా మారనుంది. వాళ్లు ఎవరు? ఎందుకు వాళ్లిద్దరే అంత కీలకమో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 18, 2023 | 6:24 PMUpdated Nov 18, 2023 | 6:24 PM
రాసిపెట్టుకోండి.. వాళ్లిద్దరూ చెలరేగితే వరల్డ్‌ కప్‌ మనదే!

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మరికొన్ని గంటల్లోనే మొదలు కానుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లోకం మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఆదివారం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న టీమిండియా.. మరొక్క మ్యాచ్‌ గెలిస్తే.. మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుంది. మరోవైపు ఈ టోర్నీలోనే తొలి మ్యాచ్‌లో మన చేతిలోనే ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలోనూ ఓడినా.. ఫైనల్‌కు చేరింది.

ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి ఆస్ట్రేలియా, రెండు సార్లు వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్ల​ మధ్య హోరాహోరీ ఫైట్‌ మాత్రం గ్యారెంటీ. అయితే.. ఆసీస్‌ ఆరో కప్పు గెలుస్తుందా? టీమిండియా మూడో సారి ఛాంపియన్‌గా నిలుస్తుందా? అన్నది ఇప్పుడు క్రికెట్‌ లోకాన్ని ఊపేస్తున్న ప్రశ్న. దీంతో.. ఫైనల్‌ జరగబోయే నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌ గురించి, అక్కడి వాతావరణ పరిస్థితులకు గురించి క్రికెట్‌ అభిమానులు ఇప్పటికే ఆరాలు తీసేశారు. ఇక జట్ల విషయానికి వస్తే.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియాకు ఓ ఇద్దరు ప్లేయర్‌లు ఎంతో కీలకం కానున్నారు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఈ ఇద్దరు వారిస్థాయికి తగ్గట్లు ఆడితే.. రాసిపెట్టుకోండి కప్పు మనదే. మరి ఆ ఇద్దరు ఎవరు? వారే ఎందుకు అంత కీలకమో ఇప్పుడు చూద్దాం..

ఫైనల్‌ జరగనున్న నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. వీరిద్దరికీ ఇది బాగా అచ్చొచ్చిన గ్రౌండ్‌గా చెప్పొకొవచ్చు. అందుకే వీళ్లిద్దరు తమ ట్రాక్‌ రికార్డుకు తగ్గట్లు చెలరేగితే.. వారిని అడ్డుకోవడం కంగారు టీమ్‌ వల్ల కాదు. నరేంద్ర మోదీ స్టేడియంలో రోహిత్‌ శర్మ అత్యధిక బ్యాటింగ్‌ యావరేజ్‌ కలిగి ఉన్నాడు. మొత్తం 6 మ్యాచ్‌ల్లో 51.16 యావరేజ్‌తో హిట్‌ మ్యాన్‌ 307 పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే.. రోహిత్‌ను ఆస్ట్రేలియా ఆపలేదు. మరోవైపు ఈ వరల్డ్‌ కప్‌లో బాగా రాణిస్తున్నా.. ఇక తన రేంజ్‌ ప్రదర్శన చేయలేదు సిరాజ్‌. కానీ, ఫైనల్‌లో తన నుంచి ఓ అద్భుతం ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చు. అందుకే అతని రికార్డులే కారణంగా నిలుస్తున్నాయి. ఈ గ్రౌండ్‌లో సిరాజ్‌ బౌలింగ్‌ 20.42గా ఉంది. ఇక్కడ సిరాజ్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. అందుకే వీళ్లిద్దరు తమ ఫేవరేట్‌ గ్రౌండ్‌లో చెలరేగితే.. టీమిండియా విశ్వవిజేతగా నిలవడం ఖాయం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి