వన్డే వరల్డ్ కప్-2023లో ఆఫ్ఘానిస్థాన్‌పై భారత్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131) మెరుపు సెంచరీతో టీమిండియా మరో 90 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను రీచ్ అయింది. అయితే, వీటన్నింటి కంటే కూడా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ కలిసిపోవడం ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈ ఇద్దరు ప్లేయర్లు గొడవ పడిన సంగతి తెలిసిందే. ఆ గొడవ తర్వాత కోహ్లీ ఫ్యాన్స్ నవీన్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున ట్రోల్ చేశారు. మ్యాంగ్ మ్యాన్ అంటూ ఈ స్పీడ్‌స్టర్‌ను ఆడేసుకున్నారు. అయితే తాజా మ్యాచ్‌తో ఈ కాంట్రవర్సీకి ఫుల్స్టాప్ పడింది.
ఈ మ్యాచ్‌లో ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్న కోహ్లీ-నవీన్ సరదాగా మాట్లాడుకున్నారు. నవీన్‌ను ఉద్దేశించి ఢిల్లీ స్టేడియంలోని కొందరు ఆడియెన్స్ కామెంట్స్ చేయడాన్ని కోహ్లీ సున్నితంగా మందలించాడు. నవీన్‌కు ఉద్దేశించి కామెంట్స్ చేయొద్దంటూ ప్రేక్షకులకు కోహ్లీ సూచనలు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఘటన మీద టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ రియాక్ట్ అయ్యాడు. ఐపీఎల్లో నవీన్‌తో పాటు గంభీర్‌తోనూ కోహ్లీకి వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇండియా-ఆఫ్ఘాన్ మ్యాచ్‌కు కామెంట్రీ చెప్పిన గంభీర్.. తాజా ఘటనపై ఊహించని రీతిలో కామెంట్స్ చేశాడు.
‘గ్రౌండ్లో పోరాడాలి గానీ బయట కాదు. ప్రతి ఒక్క ప్లేయర్‌కు తమ టీమ్ గెలుపు కోసం పోరాడే హక్కు ఉంటుంది. అలాగే గౌరవం కోసం పోరాడే అధికారం కూడా ఉంటుంది. ఏ దేశమనేది సంబంధం లేదు. నువ్వెంత అద్భుతమైన ప్లేయర్వనేది అనవసరం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ-నవీన్‌ను ఇలా చూడటం చాలా బాగుంది. మొత్తానికి ఐపీఎల్ ఫైట్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే. ఇదే టైమ్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు కూడా ఒక విజ్ఞప్తి. గ్రౌండ్లో గానీ, సోషల్ మీడియా వేదికల్లో గానీ ఏ ఆటగాడినైనా సరదా కోసం ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు. నేషనల్ టీమ్ తరపున ఆడాలనేది ప్రతి క్రికెటర్ డ్రీమ్. అందుకోసం ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వస్తారు. నవీన్ ఉల్ హక్ లాంటి ఆటగాడు ఆఫ్ఘాన్ వంటి దేశం నుంచి ఐపీఎల్లో ఆడటం చాలా గొప్ప విషయం’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: పర్సనల్ రికార్డుల గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Gautam Gambhir is happy to see the patch-up and praises Virat Kohli for his gesture. Also, urges fans to be better ambassadors for the game in upcoming matches.
🎬 :- @jatinsapru pic.twitter.com/KLJV14L101
— Abhishek Ojha (@vicharabhio) October 12, 2023