iDreamPost
android-app
ios-app

మోదీపై అభ్యంతరకర పోస్ట్.. వివాదంలో టీమిండియా స్టార్ ప్లేయర్!

  • Published Mar 30, 2024 | 12:19 PM Updated Updated Mar 30, 2024 | 12:19 PM

ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు బీజేపీ నేతలను ఉద్దేశించి స్టార్ క్రికెటర్ అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది ఆ స్టార్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు బీజేపీ నేతలను ఉద్దేశించి స్టార్ క్రికెటర్ అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది ఆ స్టార్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

మోదీపై అభ్యంతరకర పోస్ట్.. వివాదంలో టీమిండియా స్టార్ ప్లేయర్!

సోషల్ మీడియాను ఎంత మంచిగా వాడుకుంటే.. అంత మంచి పేరు, క్రేజ్ వస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు అదే సోషల్ మీడియా కారణంగా వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుంది ఓ టీమిండియా స్టార్ క్రికెటర్. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు బీజేపీ నేతలను ఉద్దేశించి ఆ స్టార్ క్రికెటర్ అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది ఆ స్టార్ ప్లేయర్. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది? ఆ ప్లేయర్ ఎవరు? వివరాల్లోకి వెళితే..

పూజా వస్త్రాకర్.. టీమిండియా క్రికెట్ మహిళల టీమ్ లో స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. అసలేం జరిగిందంటే? పూజా ఇన్ స్టా స్టోరీలో ‘వసూలీ టైటాన్స్’ పేరిట భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా మరికొందరు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రుల మార్ఫింగ్ ఫొటో ప్రత్యక్షమైంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో.. పెద్ద వివాదానికి దారి తీసింది. ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై పూజా వస్త్రాకర్ స్పందించింది.

“నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై అభ్యంతరకర పోస్ట్ వెళ్లినట్లు నా దృష్టికి వచ్చింది. అయితే ఆ సమయంలో ఫోన్ నా దగ్గర లేదు. ఆ పోస్ట్ ఎలా వెళ్లిందో కూడా తెలీదు. ప్రధాన మంత్రి మోదీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. నా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి నేను బాధపడుతున్నాను. ప్రధానికి నా క్షమాపణలు” సోషల్ మీడియా ద్వారా వివాదంపై క్లారిటీ ఇచ్చింది పూజా వస్త్రాకర్. కాగా.. మధ్యప్రదేశ్ కి చెందిన పూజా టీమిండియా తరఫున 2018లో అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు 4 టెస్టులు, 30 వన్డేలు, 58 టీ20ల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది. స్టార్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Team india women cricketer pooja vastrakar post on modi

ఇదికూడా చదవండి: Virat Kohli: KKRతో మ్యాచ్.. RCB ఓటమికి విరాట్ కోహ్లీ కారణమా?