iDreamPost

Virat Kohli: KKRతో మ్యాచ్.. RCB ఓటమికి విరాట్ కోహ్లీ కారణమా?

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 83 పరుగులు చేసి అజేయంగా చివరి వరకూ నిలిచాడు. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి కారణం కోహ్లీనే కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి వారు అలా అనడానికి రీజన్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 83 పరుగులు చేసి అజేయంగా చివరి వరకూ నిలిచాడు. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి కారణం కోహ్లీనే కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి వారు అలా అనడానికి రీజన్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Virat Kohli: KKRతో మ్యాచ్.. RCB ఓటమికి విరాట్ కోహ్లీ కారణమా?

విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, మాక్స్ వెల్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్నాగానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు ఈ ఐపీఎల్ సీజన్ లోనూ కష్టాలు తప్పడం లేదు. ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండిట్లో ఓడిపోయింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. తాజాగా కేకేఆర్ తో హోం గ్రౌండ్ లో జరిగిన పోరులో సైతం ఓడిపోయింది. కోహ్లీ 83 రన్స్ తో అజేయంగా నిలిచినప్పటికీ.. ఆర్సీబీ ఓటమికి అతడే కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి వారు అలా కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ అదరగొట్టింది. ఆర్సీబీ విధించిన 183 పరుగుల టార్గెన్ ను కేకేఆర్ టీమ్ 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ.. పాడుతూ.. ఛేదించింది. బెంగళూరు బౌలర్లు పూర్తిగా విఫలమైయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. 83 రన్స్ చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓటమికి కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి విచిత్రం అని మీకు అనిపించొచ్చు. కానీ దానికి వారు ఓ రీజన్ ఎత్తి చూపిస్తున్నారు.

Is Kohli responsible for RCB's loss

ఈ మ్యాచ్ లో విరాట్ 59 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 రన్స్ చేసి నాటౌట్ గా ఉన్నాడు. 140 స్ట్రైక్ రేట్ తో కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీసింది. వరల్డ్ క్లాస్ బ్యాటర్ గా పేరుగాంచిన రన్ మెషిన్ 10 ఓవర్లు ఎదుర్కొని 83 రన్స్ చేయడం ఏంటి? ఇతర ఆటగాళ్లు అయితే సెంచరీ చేసేవారని చెప్పుకొస్తున్నారు. మెున్నటి మ్యాచ్ లో క్లాసెన్ 34 బంతుల్లో 80 రన్స్ చేశాడని ఎగ్జామ్ పుల్ చూపిస్తున్నారు. దీన్ని కొందరు నెటిజన్లు సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం అంగీకరించడం లేదు. కోహ్లీకి క్లాసెన్ తో పోలికేంటి? అతడెక్కడ? విరాట్ ఎక్కడ? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 17 రన్స్ కే ఆర్సీబీ కెప్టెన్ ఔట్ అయ్యాడు. ఈ తర్వాత వచ్చిన గ్రీన్ తో కలిసి రెండో వికెట్ కు 65 రన్స్ జోడించాడు విరాట్. దీంతో ఇన్నింగ్స్ చక్కబడింది అనేలోపే గ్రీన్ ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన మాక్స్ వెల్ సైతం ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేదు. కేవలం 28 రన్స్ కే పెవిలియన్ చేరాడు మ్యాక్సీ. అనంతరం వెంట వెంటనే రజత్ పాటిదార్(3), అనుజ్ రావత్(3) కూడా ఔట్ అయ్యారు. దీంతో కోహ్లీ బాధ్యతయుతంగా బ్యాటింగ్ చేయడం ప్రారంభించాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ.. స్కోర్ బోర్డును నడిపించాడు. మరోవైపు కోల్ కత్తా బౌలర్లు సైతం కోహ్లీ వీక్ నెస్ ను కనిపెట్టి.. స్లో బాల్స్ తో ఎటాక్ చేశారు. స్లో బాల్స్, స్లో పిచ్ లపై ఆడటంలో విరాట్ విఫలమవుతూ ఉంటాడన్న విషయం తెలియనిది కాదు. ఈ కారణాల చేతనే ఈ మ్యాచ్ లో కోహ్లీ స్లో బ్యాటింగ్ చేశాడని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమికి విరాట్ కోహ్లీ కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Kohli-Gambhir: ఆ అవార్డు KKRకే.. ఇది ఆస్కార్ లెవల్ యాక్టింగ్: దిగ్గజ ప్లేయర్లు సెటైర్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి