SNP
IPL 2024, KKR, RCB, RR, SRH: ఐపీఎల్ కప్పు ఎవరిది? ఇదే ప్రశ్న ఇప్పుడు కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. మరి ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ఈ అనాలసిస్ చదివేయండి..
IPL 2024, KKR, RCB, RR, SRH: ఐపీఎల్ కప్పు ఎవరిది? ఇదే ప్రశ్న ఇప్పుడు కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. మరి ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ఈ అనాలసిస్ చదివేయండి..
SNP
ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. నేటి(మే 21 మంగళవారం) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ప్లే ఆఫ్స్‌లో తలపడనున్నాయి. మొత్తం మూడు మ్యాచ్‌లు.. క్వాలిఫైయర్ వన్, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ టూ.. ఈ మూడు మ్యాచ్‌ల తర్వాత ఫైనల్‌లో రెండు టీమ్స్ ట్రోఫీ కోసం తలపడతాయి. క్వాలిఫైయర్ వన్‌లో టాప్ టూలో నిలిచిన కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు పోటీ పడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు.. ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్‌తో క్వాలిఫైయర్ టూ ఆడుతుంది. ఎలిమినేటర్‌లో ఆర్‌ఆర్, ఆర్సీబీ జట్లు తలపడతాయి. ఓడిన జట్టు ఇంటికి వెళ్తే.. గెలిచిన టీమ్ క్వాలిఫైయర్ టూ ఆడుతుంది.
కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్.. ఈ రెండింటిలో ఏ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. వాళ్లు కప్పు కొడతారు. క్వాలిఫైయర్ వన్‌లో ఓడినా.. మళ్లీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచినా కప్పు వాళ్లుదే. రాజస్థాన్, ఆర్సీబీ మాత్రం.. కచ్చితంగా వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే కప్పు గెలుస్తాయి. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఈ ఏడాది కూడా నో ట్రోఫీ. ఇలా ప్రతి మ్యాచ్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది. అయితే మరి ఈ నాలుగు టీమ్స్‌లో ఎవరికి కప్పు కొట్టే అవకాశం ఎక్కువగా ఉందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అది తెలియాలంటే.. ఇప్పటి వరకు వారి ప్రదర్శన, మ్యాచ్ జరగబోయే వేదికలు, ఒకరిపై ఒకరికున్న రికార్డులు పరిశీలిస్తే.. ఏ టీమ్‌కు ఎక్కువ ఛాన్స్ ఉందో తెలుసుకోవచ్చు.
లీగ్ దశలో కేకేఆర్ బీభత్సమైన డామినేషన్‌ను కనబర్చింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. 9 విజయాలతో టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే.. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరిగే వేదికలు ఒక సారి గమనిస్తే.. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్.. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. అలాగే క్వాలిఫైయర్-2, ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్నాయి. అహ్మాదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కావచ్చు. తొలి క్వాలిఫైయర్ ఆడే టీమ్స్ కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ రెండు బ్యాటింగ్‌లో సూపర్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ, బౌలింగ్‌లో కేకేఆర్ కాస్త బెటర్‌గా ఉంది. క్వాలిఫైయర్-1లో ఎస్‌ఆర్‌హెచ్ గెలవాలంటే.. బ్యాటింగ్ బలంతోనే గెలవాలి. కానీ, క్వాలిఫైయర్-1లో కేకేఆర్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అలా జరిగితే.. కేకేఆర్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఇక ఎలిమినేటర్ కూడా అహ్మాదాబాద్‌లోనే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్, ఆర్సీబీ పోటీ పడుతున్నాయి. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ మంచి ఊపులో ఉంది. పైగా ఆ టీమ్‌లోని బ్యాటర్లంతా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌ఆర్ టీమ్ బ్యాటింగ్‌లో వీక్‌గా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, చాహల్ మాత్రమే కాస్త ప్రభావం చూపుతున్నారు. వీరిద్దరి కోహ్లీ హ్యాండిల్ చేయగలిగితే.. ఎలిమినేటర్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశం ఉంది. అదే జరిగితే.. క్వాలిఫైయర్-2లో ఎస్‌ఆర్‌హెచ్‌లో ఆర్సీబీ తలపడే ఛాన్స్. క్వాలిఫైయర్-2 చెన్నైలో జరుగనుంది. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్‌లో కాస్త వీక్‌గా ఉంది. మార్కండే, షాబాజ్ ఖాన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా.. వారు అంతగా రాణించడం లేదు. ఇక ఆర్సీబీలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మ్యాక్స్‌వెల్ రూపంలో మంచి స్పిన్ ఎటాక్ ఉంది.
ఆర్సీబీ వద్ద ఉన్న స్పిన్ బలాన్ని తట్టుకుని చెన్నై పిచ్‌పై పరుగులు చేయడం ఎస్‌ఆర్‌హెచ్‌కు కత్తిమీద సామే. బ్యాటింగ్‌లో రెండు టీమ్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నా.. స్పిన్ బౌలింగ్ బలంతో ఆర్సీబీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. మే 26న చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్‌తో ఆర్సీబీ తలపడే ఛాన్స్ ఉంది. రెండు టీమ్స్ బౌలింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. స్పిన్‌లో కూడా బలం ఈక్వల్‌గానే కనిపిస్తోంది. కానీ, కేకేఆర్ వద్ద సునీల్ నరైన్, వరణ్ చక్రవర్తి రూపంలో క్వాలిటీ స్పిన్ ఉంది. చెన్నై పిచ్‌పై వాళ్లిద్దరు చాలా డేంజర్. అందుకే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఒక వేళ ఎలిమినేటర్‌లో ఆర్సీబీపై ఆర్‌ఆర్ గెలిస్తే.. చెన్నై పిచ్‌పై చాహల్, అశ్విన్ చెలరేగి.. క్వాలిఫైయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు గెలిపించి.. రాజస్థాన్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఓవరాల్‌గా.. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు కప్పు కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఆర్సీబీకే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
After 7️⃣0️⃣ matches of hard-fought cricket, a final look at the #TATAIPL 2024 Points Table 🙌
Did your favourite team qualify for the Playoffs? 🤔 pic.twitter.com/s3syDvL6KH
— IndianPremierLeague (@IPL) May 19, 2024