SNP
Rohit Sharma, Rishabh Pant, IPL 2024: ఐపీఎల్‌లో ఉన్న పది టీమ్స్‌లో 8 టీమ్స్‌కి టీమిండియా క్రికెటర్లే కెప్టెన్లు వ్యవహరిస్తున్నారు. వీరిలో ఓ ఆరుగురు కెప్టెన్లు చాలా యంగ్. వీరిలో ఒకరికి రోహిత్ శర్మ వారసుడిగా టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఒక్కడు ఎవరో ఇప్పుడు విశ్లేషిద్దాం..
Rohit Sharma, Rishabh Pant, IPL 2024: ఐపీఎల్‌లో ఉన్న పది టీమ్స్‌లో 8 టీమ్స్‌కి టీమిండియా క్రికెటర్లే కెప్టెన్లు వ్యవహరిస్తున్నారు. వీరిలో ఓ ఆరుగురు కెప్టెన్లు చాలా యంగ్. వీరిలో ఒకరికి రోహిత్ శర్మ వారసుడిగా టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఒక్కడు ఎవరో ఇప్పుడు విశ్లేషిద్దాం..
SNP
ఒక వైపు ఐపీఎల్ జోరుగా నడుస్తున్నా.. మరోవైపు క్రికెట్ అభిమానుల మదిలో రాబోయే టీ20 వరల్డ్ కప్ మెదులుతూనే ఉంది. ఐపీఎల్‌లో ఏ టీమ్ ప్రదర్శన ఎలా ఉన్నా.. టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని మాత్రం వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2023 కొద్దిలో మిస్ అయిన విషయం తెలిసిందే. ఆ బాధను తీర్చేందుకు కనీసం టీ20 వరల్డ్ కప్ అయినా నెగ్గాలని అనుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో బిజీగా ఉన్నా.. మరోవైపు టీ20 వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు, బీసీసీఐ అధికారులతో మీటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడు. అయితే.. టీ20 వరల్డ్ కప్‌లో ఎలాంటి ఫలితం వచ్చినా.. రోహిత్ శర్మకు కెప్టెన్‌గా అదే ఆఖరి టీ20 వరల్డ్ కప్ కానుంది. రోహిత్ శర్మ వయసు రిత్యా.. టీ20లకు గుడ్‌బై చెప్పి.. టెస్టులు, వన్డేల్లో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తర్వాత టీమిండియాను నడిపించే వారసుడు ఎవరు? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది.
అయితే.. ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ఈ ఐపీఎల్‌లో 8 జట్లకు టీమిండియా ఆటగాళ్లకే కెప్టెన్లుగా ఉన్నారు. బహుషా వీరిలో ఒకరే టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ అవుతారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్ టీమ్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. వెనుక ధోని కూడా అతనికి సాయం చేస్తున్నాడు. ధోని సీఎస్‌కే టీమ్‌కు పూర్తిగా దూరం అయితే తప్ప కెప్టెన్ రుతురాజ్ సత్తా ఏంటో చెప్పడం కష్టం. లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్‌కు గతంలో మంచి అవకాశం ఉండేది. జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ, ఫామ్ కోల్పోవడం, గాయాలతో జట్టుకు దూరం కావడంతో అతని వైస్ కెప్టెన్సీతో పాటు ఫ్యూచర్ కెప్టెన్ లిస్ట్ నుంచి కూడా రాహుల్ అవుట్ అయ్యాడనే చెప్పాలి.
ఇక ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఐపీఎల్ 2022, 2023 సీజన్స్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ వ్యవహరించిన పాండ్యాకు.. రోహిత్ శర్మ లేని టైమ్‌లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది బీసీసీఐ. దీంతో పాండ్యానే టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ అని ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. వన్డే వరల్డ్ కప్ 2023 నేపథ్యంలో వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు రోహిత్ శర్మ, కోహ్లీ వన్డేలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, టీ20లకు దూరమైన సమయంలో పాండ్యానే టీమిండియాను నడిపించాడు. ఒక విధంగా చెప్పాలంటే.. టీ20 వరల్డ్ కప్ 2024ను పాండ్యా కెప్టెన్సీలోనే టీమిండియా ఆడుతుందని కూడా వార్తలు వచ్చాయి.
కానీ, ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పాండ్యా దారుణంగా విఫలం అవుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ జట్టు హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా ప్లానింగ్స్‌తో గుజరాత్‌ను గెలిపించాడని, ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ ప్రదర్శన చూస్తుంటేనే అర్థం అవుతుంది. పైగా పాండ్యా ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు. ప్రస్తుతం పాండ్యా ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. అతనికి టీమిండియాలో చోటు దక్కడం కూడా కష్టంగా మారింది. అందుకే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ లిస్ట్ నుంచి పాండ్యాను పక్కనపెడుతున్నారు క్రికెట్ పండితులు. ఇక పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్‌కు టీమిండియాలో చోటే లేదు. సో అతన్ని టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా ఎవరు కన్సిడర్ చేయడం లేదు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఉన్నా.. అతను టీ20ల్లో పెద్దగా రాణించడం లేదు. పైగా కేకేఆర్‌ను గౌతమ్ గంభీర్ ముందుండి నడిపిస్తున్నాడనే టాక్ బలంగా ఉంది. కెప్టెన్‌గా అయ్యర్ సక్సెస్ అవుతున్న అతనికి పెద్దగా పేరు రావడం లేదు. గంభీర్ షాడో నుంచి బయటపడి, టీ20ల్లో నిలకడగా రాణిస్తేనే అయ్యర్ టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ముందుంటాడు. ఇక మరో సూపర్ టాలెంటెడ్ ఆటగాడు సంజు శాంసన్, టీమిండియాలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన శాంసన్ ఇప్పటి వరకు టీమిండియాలో చోటు పర్మినెంట్ చేసుకోలేకపోయాడు. నిలకడలేని బ్యాటింగ్ దానికి కారణం. ఆ ఒక్క లోపాన్ని శాంసన్ అధిగమిస్తే.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ లిస్ట్‌తో శాంసన్ పేరు కూడా టాప్‌లో ఉండే అవకాశం ఉంది.
ఇక చివరిగా చెప్పుకోవాల్సింది.. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ గురించి. గుజరాత్ టైటాన్స్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్‌గా గిల్ కూడా మంచి మార్కులే కొట్టేశాడు. అయితే.. టీ20ల్లో తన స్ట్రైక్‌రేట్ మెరుగుపర్చుకోవడం, కెప్టెన్‌గా ఇంకా తనని తాను నిరూపించుకోవాల్సి ఉంది. ఇక రిషభ్ పంత్‌కు ఎప్పటి నుంచి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అనే ట్యాగ్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్.. రాబోయే టీ20 వరల్డ్ కప్‌తో తన భవిష్యత్తు డిసైడ్ కానుంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న పంత్.. అదే ఫామ్‌ను టీ20 వరల్డ్‌కప్‌లోనూ కంటిన్యూ చేస్తే.. రోహిత్ వారుసుడిగా టీమిండియాకు టీ20 కెప్టెన్ అయ్యే అవకాశాలు పంత్‌కే ఎక్కువగా ఉన్నాయి.
పైగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడం పంత్‌కు కలిసొచ్చే అంశం. టీమిండియా మరో ధోని అవుతాడని కూడా చాలా మంది నమ్ముతున్నారు. బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో పాటు కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. మంచి మంచి బౌలింగ్ మార్పులతో జీటీని 89 పరుగులకే ఆలౌట్ చేయించాడు. వికెట్ కీపర్‌గా మంచి క్యాచ్‌లు, అద్భుతమైన స్టంపింగ్ చేసి ఔరా అనిపించాడు. ఈ లెక్కన టీమిండియాకు భవిష్యత్తు కెప్టెన్ రిషభ్ పంత్ అనే మాట బలంగా వినిపిస్తోంది. మరి టీమిండియా భవిష్యత్త్ కెప్టెన్ ఎవరు అనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.