Nidhan
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు ఓ కొత్త కుర్రాడు చుక్కలు చూపించాడు. స్మిత్ ఏదో అనుకుంటే ఈ మ్యాచ్‌లో ఇంకేదో అయింది. అసలు స్మిత్‌కు చుక్కలు చూపించిన ఆ యంగ్ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు ఓ కొత్త కుర్రాడు చుక్కలు చూపించాడు. స్మిత్ ఏదో అనుకుంటే ఈ మ్యాచ్‌లో ఇంకేదో అయింది. అసలు స్మిత్‌కు చుక్కలు చూపించిన ఆ యంగ్ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
స్టీవ్ స్మిత్.. ప్రస్తుత తరం క్రికెటర్లలో టాప్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ, జో రూట్‌కు గట్టి పోటీని ఇస్తున్నాడతను. అయితే రూట్, స్మిత్‌తో ఒక సమయంలో పోటీని ఎదుర్కొన్నా వీళ్లిద్దర్నీ కోహ్లీ ఎప్పుడో మించిపోయాడు. ఏకంగా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులే టార్గెట్‌గా దూసుకుపోతున్నాడు. అయితే స్మిత్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్‌గా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇప్పుడు టీమ్‌లో కీలక బ్యాట్స్‌మన్‌గా మారాడు. డేవిడ్ వార్నర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ప్లేసులో స్మిత్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. దీంతో ఈ స్టార్ బ్యాటర్‌పై ఎక్స్పెక్టేషన్స్, రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగాయి. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టులోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు స్మిత్.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తాడు స్టీవ్ స్మిత్. అయితే వార్నర్‌ను తలపిస్తూ దుమ్మురేపుతాడని అనుకుంటే తొలి మ్యాచ్‌లోనే తుస్సుమన్నాడు. విండీస్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 26 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అలాగని ఏ సీనియర్ బౌలర్ బౌలింగ్‌లోనో అతడు ఔట్ కాలేదు. షమార్ జోసెఫ్ అనే కొత్త కుర్రాడి బౌలింగ్‌లో స్మిత్ ఔటయ్యాడు. ఓ అన్ప్లేయబుల్ డెలివరీకి పెవిలియన్‌కు చేరుకున్నాడు. స్టార్ బ్యాటర్‌ను ఔట్ చేసిన షమార్కు ఇదే ఫస్ట్ వికెట్ కావడం గమనార్హం. అందులోనూ వేసిన తొలి బంతికే స్మిత్‌ను వెనక్కి పంపాడు. షమార్ వేసిన బాల్ గుడ్ లెంగ్త్‌లో పడి ఔట్ స్వింగ్ అవ్వడమే గాక కాస్త బౌన్స్ కూడా కావడంతో స్మిత్ బ్యాట్ అడ్డంగా పెట్టి దొరికిపోయాడు. అతడి బ్యాట్‌కు తగిలిన బంతి ఎడ్జ్ తీసుకొని థర్డ్ స్లిప్‌లో ఉన్న జస్టిన్ గ్రీవ్స్ వైపుగా వెళ్లింది. దీంతో ముందుకు దూకిన గ్రీవ్స్ బాల్‌ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు.
ఇంటర్నేషనల్ కెరీర్లో తీసిన ఫస్ట్ వికెటే స్మిత్ లాంటి టాప్ బ్యాటర్‌ది కావడంతో బౌలర్ షమార్ జోసెఫ్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇదే జోష్‌లో మరో ఆసీస్ బ్యాటర్‌ను కూడా అతడు పెవిలియన్‌కు పంపాడు. డేంజరస్ మార్నస్ లబుషేన్ (10)ను ఔట్ చేశాడు. మొత్తంగా 6 ఓవర్లు వేసిన షమార్ జోసెఫ్ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ఆసీస్‌కు ఎంతో కీలకమైన స్మిత్, లబుషేన్‌ను ఔట్ చేశాడు. దీంతో షమార్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు. అదే సమయంలో స్టీవ్ స్మిత్‌ను కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. సీనియర్ అని నమ్మి ఓపెనింగ్ పొజిషన్ అప్పగిస్తే ఇలా కొత్త కుర్రాడి బౌలింగ్‌లో ఔటవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి.. అరంగేట్ర బౌలర్‌కు స్మిత్ దొరికిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: అన్‌స్టాపబుల్ కమిన్స్.. ఒకే బ్యాటర్‌ను టార్గెట్ చేసి మరీ పడగొట్టాడు!
Shamar Joseph dismissed Steven Smith on the first ball of his Test career.
– What a start by Shamar…!!! pic.twitter.com/ScCKm3lVXs
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2024