iDreamPost

Pat Cummins: వీడియో: అన్​స్టాపబుల్ కమిన్స్.. ఒకే బ్యాటర్​ను టార్గెట్ చేసి మరీ పడగొట్టాడు!

  • Published Jan 17, 2024 | 3:30 PMUpdated Jan 17, 2024 | 3:30 PM

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతోంది. సూపర్ ఫామ్​లో ఉన్న అతడు జట్టుకు వరుస విజయాలు, ఐసీసీ ట్రోఫీలు అందిస్తూ దూసుకెళ్తున్నాడు. అలాంటి కమిన్స్ మరోమారు బంతితో మ్యాజిక్ చేశాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతోంది. సూపర్ ఫామ్​లో ఉన్న అతడు జట్టుకు వరుస విజయాలు, ఐసీసీ ట్రోఫీలు అందిస్తూ దూసుకెళ్తున్నాడు. అలాంటి కమిన్స్ మరోమారు బంతితో మ్యాజిక్ చేశాడు.

  • Published Jan 17, 2024 | 3:30 PMUpdated Jan 17, 2024 | 3:30 PM
Pat Cummins: వీడియో: అన్​స్టాపబుల్ కమిన్స్.. ఒకే బ్యాటర్​ను టార్గెట్ చేసి మరీ పడగొట్టాడు!

ఎవరికైనా ఏదైనా కలిసొస్తే, చేసే ప్రతి పని సక్సెస్ అయితే, మంచి పేరు తెచ్చుకుంటే నక్క తోక తొక్కాడంటారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ కూడా నక్క తోక తొక్కినట్లే ఉన్నాడు. 2023 అతడి కెరీర్​లో గోల్డెన్ ఇయర్​గా నిలిచింది. గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​, వన్డే వరల్డ్ కప్​ల్లో కంగారూలను విజేతగా నిలిపాడు కమిన్స్. ఒక క్రికెటర్​గా సాధించాల్సిన చాలా ఘనతల్ని ఒకే ఏడాది అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కమిన్స్. అద్భుతమైన పేస్ బౌలింగ్​తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్న కమిన్స్.. కెప్టెన్​గా పర్ఫెక్ట్ డెసిజన్స్ తీసుకుంటూ టీమ్​కు విక్టరీలు అందిస్తున్నాడు. బౌలింగే కాదు.. అవసరాన్ని బట్టి బ్యాట్​తోనూ విలువైన రన్స్ చేస్తూ ఆల్​రౌండర్​ పాత్ర పోషిస్తున్నాడు. అలాంటి కమిన్స్ మరోమారు తన సత్తా చాటాడు. రెండేళ్ల వ్యవధిలో ఒకే సీన్​ను రిపీట్ చేశాడు.

వెస్టిండీస్​తో జరుగుతున్న తొలి టెస్టులో కంగారూ కెప్టెన్ కమిన్స్​ చెలరేగిపోయాడు. బంతితో విండీస్​ బ్యాటింగ్ ఆర్డర్​ను కకావికలం చేశాడు. అన్​స్టాపబుల్ రేంజ్​లో చెలరేగి ప్రత్యర్థులను హడలెత్తించాడు. కమిన్స్​ (4/41)తో పాటు జోష్ హేజల్​వుడ్ (4/44) కూడా అగ్నికి ఆయువులా తోడవడంతో వెస్టిండీస్ 188 పరుగులకే కుప్పకూలింది. నిప్పులు చెరిగే వేగంతో, స్వింగ్​ చేస్తూ వీళ్లు వేసిన డెలివరీస్​కు ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోయారు. ముఖ్యంగా కమిన్స్ లైన్ అండ్ లెంగ్త్​ను పట్టుకొని బౌలింగ్ చేయడంతో విండీస్ బ్యాట్స్​మెన్​కు ఏం చేయాలో పాలుపోలేదు. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్​వైట్ (13), టి చందర్​పాల్ (6)తో పాటు కీపర్ జోష్వా డసిల్వా (6), అల్జారీ జోసెఫ్ (14)ను కమిన్స్ వెనక్కి పంపాడు. అయితే వీటిల్లో బ్రాత్​వైట్​ను ఔట్ చేసిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి.

కమిన్స్ ఆఫ్​ స్టంప్​కు బయట విసిరిన బంతి కాస్త స్వింగ్ అయి వికెట్ల మీదకు దూసుకొచ్చింది. దాన్ని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు బ్రాత్​వైట్. కానీ బాల్​ అతడి బ్యాట్​ను మిస్సై ఆఫ్​ స్టంప్​ను ముద్దాడింది. సరిగ్గా ఆఫ్ స్టంప్ కొసను గిరాటేసింది. దీంతో బ్రాత్​వైట్ నిరాశతో క్రీజును వీడాడు. అయితే అతడు కమిన్స్ బౌలింగ్​లో రెండేళ్ల కింద ఇలాగే ఔటవ్వడం గమనార్హం. డిసెంబర్ 2, 2022న జరిగిన టెస్ట్ మ్యాచ్​లో కమిన్స్ వేసిన బాల్ బ్రాత్​వైట్ టాప్ ఆఫ్​ ఆఫ్​ స్టంప్​ను తాకింది. ఇప్పుడు కూడా అదే రీతిలో ప్లాన్ చేసి మరీ అతడి వీక్​నెస్ మీద దెబ్బకొట్టాడు కంగారూ కెప్టెన్. ఇన్​స్వింగ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటాన్ని క్యాష్​ చేసుకొని బ్రాత్​వైట్​ను పెవిలియన్​కు పంపాడు. దీంతో అప్పటి వీడియోతో పాటు ఇప్పటి డిస్మిసల్​ను కూడా కలిపి తయారు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కమిన్స్ బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఆసీస్ కెప్టెన్​ను మెచ్చుకుంటున్నారు. అతడు మరో మెక్​గ్రాత్​లా కనిపిస్తున్నాడని చెబుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్, వికెట్లను టార్గెట్ చేస్తూ బౌలింగ్ వేయడం మెక్​గ్రాత్ బలాలని.. కమిన్స్ కూడా అదే శైలిని ఫాలో అవుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కమిన్స్ లాంటి బౌలర్ ఒక్కడు ఉన్నా టీమ్​కు ఢోకా ఉండదని చెబుతున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్​లో 188 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ ఆసీస్ మొదటి రోజు ఆట ముగిసే సరికి 21 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. విండీస్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 129 పరుగుల దూరంలో ఉంది. మరి.. కమిన్స్ బౌలింగ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Yuvraj Singh: ఆశిష్ నెహ్రా మోసం చేశాడు.. యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి