iDreamPost
android-app
ios-app

Steve Smith: స్మిత్​కు చుక్కలు చూపించిన కొత్త కుర్రాడు.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది!

  • Published Jan 17, 2024 | 7:13 PM Updated Updated Jan 17, 2024 | 7:13 PM

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్​కు ఓ కొత్త కుర్రాడు చుక్కలు చూపించాడు. స్మిత్ ఏదో అనుకుంటే ఈ మ్యాచ్​లో ఇంకేదో అయింది. అసలు స్మిత్​కు చుక్కలు చూపించిన ఆ యంగ్ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్​కు ఓ కొత్త కుర్రాడు చుక్కలు చూపించాడు. స్మిత్ ఏదో అనుకుంటే ఈ మ్యాచ్​లో ఇంకేదో అయింది. అసలు స్మిత్​కు చుక్కలు చూపించిన ఆ యంగ్ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 17, 2024 | 7:13 PMUpdated Jan 17, 2024 | 7:13 PM
Steve Smith: స్మిత్​కు చుక్కలు చూపించిన కొత్త కుర్రాడు.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది!

స్టీవ్ స్మిత్.. ప్రస్తుత తరం క్రికెటర్లలో టాప్ ప్లేయర్​గా పేరు తెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ, జో రూట్​కు గట్టి పోటీని ఇస్తున్నాడతను. అయితే రూట్, స్మిత్​తో ఒక సమయంలో పోటీని ఎదుర్కొన్నా వీళ్లిద్దర్నీ కోహ్లీ ఎప్పుడో మించిపోయాడు. ఏకంగా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులే టార్గెట్​గా దూసుకుపోతున్నాడు. అయితే స్మిత్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్​గా టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇప్పుడు టీమ్​లో కీలక బ్యాట్స్​మన్​గా మారాడు. డేవిడ్ వార్నర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ప్లేసులో స్మిత్ ఓపెనర్​గా ఎంపికయ్యాడు. దీంతో ఈ స్టార్ బ్యాటర్​పై ఎక్స్​పెక్టేషన్స్, రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగాయి. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఓపెనర్​గా ఆడిన తొలి టెస్టులోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు స్మిత్.

వెస్టిండీస్​తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్​లో ఓపెనర్​గా కొత్త అవతారం ఎత్తాడు స్టీవ్ స్మిత్. అయితే వార్నర్​ను తలపిస్తూ దుమ్మురేపుతాడని అనుకుంటే తొలి మ్యాచ్​లోనే తుస్సుమన్నాడు. విండీస్​తో మ్యాచ్​లో ఫస్ట్ ఇన్నింగ్స్​లో 26 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అలాగని ఏ సీనియర్ బౌలర్ బౌలింగ్​లోనో అతడు ఔట్ కాలేదు. షమార్ జోసెఫ్​ అనే కొత్త కుర్రాడి బౌలింగ్​లో స్మిత్ ఔటయ్యాడు. ఓ అన్​ప్లేయబుల్ డెలివరీకి పెవిలియన్​కు చేరుకున్నాడు. స్టార్ బ్యాటర్​ను ఔట్ చేసిన షమార్​కు ఇదే ఫస్ట్ వికెట్ కావడం గమనార్హం. అందులోనూ వేసిన తొలి బంతికే స్మిత్​ను వెనక్కి పంపాడు. షమార్ వేసిన బాల్ గుడ్ లెంగ్త్​లో పడి ఔట్ స్వింగ్ అవ్వడమే గాక కాస్త బౌన్స్ కూడా కావడంతో స్మిత్​ బ్యాట్ అడ్డంగా పెట్టి దొరికిపోయాడు. అతడి బ్యాట్​కు తగిలిన బంతి ఎడ్జ్ తీసుకొని థర్డ్ స్లిప్​లో ఉన్న జస్టిన్ గ్రీవ్స్ వైపుగా వెళ్లింది. దీంతో ముందుకు దూకిన గ్రీవ్స్ బాల్​ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు.

ఇంటర్నేషనల్ కెరీర్​లో తీసిన ఫస్ట్ వికెటే స్మిత్ లాంటి టాప్ బ్యాటర్​ది కావడంతో బౌలర్ షమార్ జోసెఫ్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇదే జోష్​లో మరో ఆసీస్ బ్యాటర్​ను కూడా అతడు పెవిలియన్​కు పంపాడు. డేంజరస్ మార్నస్ లబుషేన్ (10)ను ఔట్ చేశాడు. మొత్తంగా 6 ఓవర్లు వేసిన షమార్ జోసెఫ్​ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ఆసీస్​కు ఎంతో కీలకమైన స్మిత్, లబుషేన్​ను ఔట్ చేశాడు. దీంతో షమార్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు. అదే సమయంలో స్టీవ్ స్మిత్​ను కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. సీనియర్ అని నమ్మి ఓపెనింగ్ పొజిషన్ అప్పగిస్తే ఇలా కొత్త కుర్రాడి బౌలింగ్​లో ఔటవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి.. అరంగేట్ర బౌలర్​కు స్మిత్ దొరికిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: అన్​స్టాపబుల్ కమిన్స్.. ఒకే బ్యాటర్​ను టార్గెట్ చేసి మరీ పడగొట్టాడు!