Nidhan
క్రికెట్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలిసిందే. ఏళ్ల పాటు ఆడే ప్లేయర్లకు కూడా నేషనల్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఓ బాడీగార్డ్‌ను ఆ ఛాన్స్ వరించింది.
క్రికెట్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలిసిందే. ఏళ్ల పాటు ఆడే ప్లేయర్లకు కూడా నేషనల్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఓ బాడీగార్డ్‌ను ఆ ఛాన్స్ వరించింది.
Nidhan
క్రికెట్లో ఎంత హై కాంపిటీషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ టీమ్‌లోకి రావడం అంత ఈజీ కాదు. ఏళ్లకు ఏళ్లు లీగ్స్, డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతూ జాతీయ జట్టులోకి రావాలని చాలా మంది క్రికెటర్లు ప్రయత్నిస్తుంటారు. అయినా ఏ కొందరికో మాత్రమే ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి సువర్ణావకాశం ఓ బాడీగార్డ్‌కు దక్కింది. వెస్టిండీస్ క్రికెట్లోకి ఓ కొత్త కుర్రాడు దూసుకొచ్చాడు. అతడే షమర్ జోసెఫ్. ఒకప్పుడు బాడీగార్డ్‌గా పనిచేసిన షమర్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ యంగ్ పేసర్.. తొలి మ్యాచ్‌లోనే స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లాంటి స్టార్ బ్యాటర్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు. వేసిన తొలి బాల్కే స్మిత్‌ను ఔట్ చేసి క్రికెట్లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు.
తొలి మ్యాచ్‌లోనే స్టీవ్ స్మిత్‌కు చుక్కలు చూపించిన షమర్ జోసెఫ్ ఈ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. అతడి జీవితం పూల పాన్పేమీ కాదు. గయానాలోని బారాకారా అనే గ్రామంలో పుట్టిన జోసెఫ్‌కు ఐదుగురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. అతడి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా లేదు. కాంజే అనే నదిలో రెండ్రోజుల పాటు బోటులో ప్రయాణిస్తే గానీ అక్కడికి చేరుకోలేం. ఆ గ్రామంలో టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు. అయితే మారుమూల ఊళ్లో ఉంటున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమే అతడ్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. తన గ్రామంలో ఉన్నప్పుడు టేప్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడతను. వెస్టిండీస్ బౌలింగ్ లెజెండ్స్ కర్ట్లీ ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్‌ను స్ఫూర్తిగా తీసుకొని బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు జోసెఫ్. ఆ తర్వాత తన భార్య, రెండేళ్ల కొడుకును తీసుకొని వేరే చోటుకు మారాడు.
కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు షమర్ జోసెఫ్. చివరికి బాడీగార్డ్‌గా ఉద్యోగం దొరకడంతో దాని ద్వారా వచ్చే సంపాదనతో ఫ్యామిలీని నెట్టుకొచ్చాడు. అయితే ఆట కోసం బాడీగార్డ్‌గా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు జోసెఫ్. జెంటిల్మన్ గేమ్‌ను ఫుల్ టైమ్ కెరీర్‌గా ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెటే శ్వాస, ధ్యాసగా ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. అతడి కష్టం వృథా పోలేదు. కొన్నాళ్లకు గయానా హార్పీ ఈగల్స్ టీమ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడే అవకాశం దక్కింది. గత ఫిబ్రవరిలో డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. తనకు వచ్చిన ఛాన్స్‌ను పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. ఆడింది మూడు మ్యాచులే అయినా 9 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లిన వెస్టిండీస్-ఏ టీమ్‌లో అతడికి ప్లేస్ దక్కింది.
సఫారీ గడ్డపై జరిగిన సిరీస్‌లో విండీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు షమర్ జోసెఫ్. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో గయానా అమేజాన్ వారియర్స్ తరఫున బరిలోకి దిగి రాణించాడు. ఇలా బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న జోసెఫ్‌ను ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. వాళ్ల నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఆడిన మొదటి మ్యాచ్‌లో స్మిత్‌తో పాటు లబుషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇలాంటి యంగ్‌స్టర్స్ అవసరం విండీస్ క్రికెట్‌కు ఎంతో ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటి వాళ్లు మరింత మంది వస్తేనే ఆ టీమ్‌కు పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు. మరి.. విండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్ కథ విన్నాక మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jofra Archer: IPL ఆడతానంటే వద్దన్నాం! మా టార్గెట్ అదే..
Shamar Joseph🔥 pic.twitter.com/DtEA0hYqSi
— CricketGully (@thecricketgully) January 17, 2024
Shamar Joseph dismissed Steven Smith on the first ball of his Test career.
– What a start by Shamar…!!! pic.twitter.com/ScCKm3lVXs
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2024