iDreamPost

Jofra Archer: IPL ఆడతానంటే వద్దన్నాం! మా టార్గెట్‌ అదే..

  • Published Jan 17, 2024 | 6:13 PMUpdated Jan 17, 2024 | 6:13 PM

ఐపీఎల్ నయా సీజన్​ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. దీంతో ఈ లీగ్ కోసం చాలా మంది ఆటగాళ్లు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశారు. అయితే ఇంగ్లండ్ స్టార్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఈసారి క్యాష్​ రిచ్​ లీగ్​కు దూరమయ్యాడు. దీనికి అసలైన కారణం ఏంటో ఇప్పడు బయటపడింది.

ఐపీఎల్ నయా సీజన్​ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. దీంతో ఈ లీగ్ కోసం చాలా మంది ఆటగాళ్లు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశారు. అయితే ఇంగ్లండ్ స్టార్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఈసారి క్యాష్​ రిచ్​ లీగ్​కు దూరమయ్యాడు. దీనికి అసలైన కారణం ఏంటో ఇప్పడు బయటపడింది.

  • Published Jan 17, 2024 | 6:13 PMUpdated Jan 17, 2024 | 6:13 PM
Jofra Archer: IPL ఆడతానంటే వద్దన్నాం! మా టార్గెట్‌ అదే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యేందుకు మరికొన్ని వారాల టైమ్ మాత్రమే ఉంది. మార్చి మూడో వారంలో క్యాష్ రిచ్ లీగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా లీగ్​లో ఆడే క్రికెటర్లు తమ ప్రిపరేషన్స్​ను స్టార్ట్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మళ్లీ బ్యాట్ పట్టి గ్రౌండ్​లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయాల నుంచి కోలుకున్న రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా సన్నాహకాలు మొదలుపెట్టారు. ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికల్లా సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఒక స్టార్ ప్లేయర్ మాత్రం ఫిట్​గా ఉన్నా ఐపీఎల్​ పదిహేడో సీజన్​లో మాత్రం ఆడటం లేదు. ఇటీవల జరిగిన మినీ వేలంలోనూ పాల్గొనలేదు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. జోఫ్రా ఆర్చర్. ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఈసారి క్యాష్ రిచ్​ లీగ్​లో ఆడటం లేదు. అయితే దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు బయటపడింది.

ఆర్చర్​ను కావాలనే ఐపీఎల్​లో ఆడించడం లేదని ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ తెలిపాడు. ఆర్చర్ ఆడతానని చెప్పినా తామే అతడ్ని దూరంగా ఉంచుతున్నామని అన్నాడు. ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో మెగా టోర్నీపై మరింత ఫోకస్ పెట్టే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ‘ఐపీఎల్​లో ఆడాలని అనుకుంటున్నానని ఆర్చర్ అన్నాడు. కానీ ఈ సీజన్​కు ఆడొద్దని మేం చెప్పాం. అతడు మళ్లీ ఆడి గాయపడటం మాకు ఇష్టం లేదు. అతడు ఇప్పటికే చాలా క్రికెట్ మిస్సయ్యాడు. ఇప్పుడు అతడ్ని కాపాడుకుంటే కెరీర్​ను పొడిగించుకోగలడు. అతడో రేర్ టాలెంట్. ఆర్చర్​ను టీ20 వరల్డ్ కప్​లో ఆడించడమే మా ప్లాన్. అందుకోసం మెళ్లిగా అతడ్ని సిద్ధం చేస్తున్నాం’ అని రాబర్ట్ కీ చెప్పుకొచ్చాడు. ఆర్చర్ బౌలింగ్ తాను చూశానని.. మంచి రిథమ్​లో ఉన్నాడని పేర్కొన్నాడు.

కాగా, ఐపీఎల్-2022 సీజన్​కు ముందు జరిగిన మెగా ఆక్షన్​లో ముంబై ఇండియన్స్ ఆర్చర్​ను సొంతం చేసుకుంది. ఇంజ్యురీతో బాధపడుతున్న అతడు ఆడే అవకాశం లేదని తెలిసినా రూ.8 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. జస్​ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ కలసి ఆడితే తమకు ఎదురు ఉండదని భావించింది. అయితే ఎంఐ ప్లాన్స్ తలకిందులయ్యాయి. ఐపీఎల్​-2023కు అందుబాటులో ఉన్నా గాయాల కారణంగా చాలా మ్యాచులకు దూరమయ్యాడు. కేవలం ఐదు మ్యాచులు ఆడిన ఆర్చర్.. 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రన్స్ కూడా ధారాళంగా ఇచ్చుకున్నాడు. దీంతో ఐపీఎల్-2024 మినీ ఆక్షన్​కు ముందు అతడ్ని ముంబై రిలీజ్ చేసింది. అయితే 28 ఏళ్ల ఆర్చర్.. ఈసారి వేలంలో పాల్గొనాలని భావించాడు. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వద్దనడంతో ఆగిపోయాడు. ఈ విషయం మీదే ఈసీబీ ఎండీ రాబర్ట్ కీ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్​ను దృష్టిలో ఉంచుకొనే అతడ్ని దూరం పెట్టామని చెప్పాడు. మరి.. ఐపీఎల్​లో ఆర్చర్​ ఆడాలనుకున్నా ఈసీబీ అడ్డుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: భారీ సిక్స్‌.. ఊహించని ఘటనతో వణికిపోయిన బాబర్‌ అజమ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి