iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: మ్యాచ్ ఫిక్సింగ్.. స్టార్ క్రికెటర్ పై 5 ఏళ్ల నిషేధం!

  • Published May 03, 2024 | 8:33 AM Updated Updated May 03, 2024 | 8:33 AM

తాజాగా ఓ స్టార్ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని రుజువు కావడంతో.. అతడిని 5 ఏళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధించింది ICC. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా ఓ స్టార్ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని రుజువు కావడంతో.. అతడిని 5 ఏళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధించింది ICC. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బ్రేకింగ్: మ్యాచ్ ఫిక్సింగ్.. స్టార్ క్రికెటర్ పై 5 ఏళ్ల నిషేధం!

ప్రపంచ క్రికెట్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC). ఇక ప్లేయర్లు ఐసీసీ విధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కొందరిపై ఒకటి, రెండు మ్యాచ్ లు నిషేధం విధిస్తే.. మరికొందరిపై లైఫ్ లాంగ్, కొన్ని సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తుంది. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని రుజువు కావడంతో.. అతడిని 5 ఏళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధించింది. మరి ఆ ఆటగాడు ఎవరు? ఏ టోర్నీలో ఫిక్సింగ్ చేశాడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

ఐసీసీ విధించిన అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ప్లేయర్ డేవన్ థామస్ పై 5 ఏళ్ల నిషేధం విధించింది. శ్రీలంక ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ నిబంధనలను థామస్ ఉల్లంఘించాడని ఐసీసీ స్పష్టం చేసింది. దాంతో అతడు 5 ఏళ్ల పాటు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు లీగుల్లో ఆడకుండా సస్పెండ్ చేసింది.

Star cricketer banned for 5 years!

కాగా.. 2021 శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో థామస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు రుజువైంది. దీంతో ఐసీసీ అతడిపై అప్పట్లోనే తాత్కాలిక నిషేధం విధించింది. అయితే తాజాగా జరిగిన విచారణలో థామస్ కూడా ఫిక్సింగ్ చేసినట్లు తన తప్పును అంగీకరించడంతో.. ఐసీసీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన థామస్, విండీస్ తరఫున ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 2022లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా తన ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.