iDreamPost

గంగూలీ నా మాట వినకుండా ఆ మ్యాచ్ ఆడించాడు! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 05:18 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Published - 05:18 PM, Fri - 1 September 23
గంగూలీ నా మాట వినకుండా ఆ మ్యాచ్ ఆడించాడు! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ యోధుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అతడు క్రీజ్ లో ఉంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకనే చెప్పాలి. తన డాషింగ్ బ్యాటింగ్ తో వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రను వేశాడు సెహ్వాగ్. ఇక టీమిండియా తరుపున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డును నెలకొల్పాడు వీరేంద్రుడు. సెహ్వాగ్ తర్వాత ఇప్పటి వరకు రికార్డు కరుణ్ నాయర్ ఒక్కడే సాధించాడు. ఇక పాకిస్థాన్ తో జరిగిన ఆ మ్యాచ్ తర్వాత.. నెక్ట్స్ మ్యాచ్ ఆడను అని గంగూలీతో చెప్పాడట వీరేంద్ర సెహ్వాగ్. కానీ గంగూలీ మాత్రం వీరేంద్రుడు మాట వినకుండా.. నువ్వు టీమ్ లో ఉండాల్సిందేనని హుకుం జారీ చేశాడట. తాజాగా వీరూ భాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అది 2004 మార్చి 28 ముల్తాన్ వేదికగా పాక్ తో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 675/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ట్రిపుల్ సెంచరీ బాదాడు డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. 375 బంతులు ఎదుర్కొని, 39 ఫోర్లు, 6 సిక్సర్లతో 309 పరుగులు చేశాడు వీరూ భాయ్. ఈ మ్యాచ్ లో టీమిండియా 52 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సిరీస్ ను 1-1తో సమం చేసింది భారత జట్టు.

కాగా.. కీలకమైన మూడో టెస్ట్ కోసం రావల్సిండి చేరుకుంది టీమిండియా. రేపు మ్యాచ్ అనగా.. వీరేంద్ర సెహ్వాగ్ కు తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చింది. ఇదే విషయాన్ని కెప్టెన్ సౌరవ్ గంగూలీకి వివరించాడు సెహ్వాగ్. కానీ దాదా సెహ్వాగ్ మాట వినకుండా రేపు నువ్వు టీమ్ లో ఉంటున్నావ్ అంతే. నువ్వు జట్టులో ఉంటే చాలు పాక్ బౌలర్లకు వణుకు, ఇక నువ్వు డకౌట్ అయినా పర్లేదు.. రేపు మ్యాచ్ ఆడుతున్నావ్ అని గంగూలీ సెహ్వాగ్ తో చెప్పాడు. ఇక దాదా చెప్పినట్లుగానే ఈ మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు వీరూ భాయ్. షోయబ్ అక్తర్ బౌలింగ్ లో మెుదటి బంతికే ఫ్లిక్ షాట్ కొట్టి.. గల్లీలో ఫీల్డర్ కు దొరికిపోయాడు సెహ్వాగ్. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ ద్రవిడ్ 270 పరుగులు చేయడంతో.. టీమిండియా విజయంతో పాటుగా సిరీస్ ను కైవసం చేసుకుందని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. మరి వీరూ భాయ్ తాజాగా వెల్లడించిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి