iDreamPost
android-app
ios-app

సెహ్వాగ్ కు అరుదైన గౌరవం! ఏకంగా లెజెండ్స్ సరసన!

  • Author Soma Sekhar Published - 02:59 PM, Mon - 13 November 23

వీరేంద్ర సెహ్వాగ్ కు ఇన్నాళ్లకు దక్కాల్సిన గౌరవం దక్కింది. ఏకంగా లెజెండ్స్ సరసన చోటు దక్కించుకున్నాడు ఈ డ్యాషింగ్ బ్యాటర్. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వీరేంద్ర సెహ్వాగ్ కు ఇన్నాళ్లకు దక్కాల్సిన గౌరవం దక్కింది. ఏకంగా లెజెండ్స్ సరసన చోటు దక్కించుకున్నాడు ఈ డ్యాషింగ్ బ్యాటర్. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 02:59 PM, Mon - 13 November 23
సెహ్వాగ్ కు అరుదైన గౌరవం! ఏకంగా లెజెండ్స్ సరసన!

వీరేంద్ర సెహ్వాగ్.. వరల్డ్ క్రికెట్ లో ఈపేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర్యతేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈపేరింటే బౌలర్లకు చెమటలు పట్టడం ఖాయం. బాల్ ను బాదడమే పనిగా పెట్టుకున్న ఈ వీరేంద్రుడికి వరల్డ్ వైడ్ గా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో రికార్డులు వీరూ తన పేరిట సువర్ణాక్షరాలతో ప్రపంచ క్రికెట్ లో లిఖించుకున్నాడు. అయితే ఇన్నాళ్లకు ఈ డ్యాషింగ్ బ్యాటర్ కు రావాల్సిన గుర్తింపు, గౌరవం వచ్చింది. తాజాగా సెహ్వాగ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా లెజెండ్స్ సరసన చోటు దక్కించుకున్నాడు ఈ టీమిండియా మాజీ ప్లేయర్. ఇక ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన 8వ మెన్స్ క్రికెటర్ గా నిలిచాడు వీరూ.

వీరేంద్ర సెహ్వాగ్ కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఐసీసీ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో వీరేంద్రుడికి చోటు దక్కింది. దీంతో ఈ డ్యాషింగ్ బ్యాటర్ కు ఇన్నాళ్లకు దక్కాల్సిన గౌరవం దక్కిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సెహ్వాగ్ తో పాటుగా శ్రీలంక మాజీ క్రికెటర్ అరవింద డిసిల్వా, భారత మహిళల టీమ్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలను కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించింది. కాగా.. తనకు ఆల్ ఆఫ్ ఫేమ్ లో ప్లేస్ దక్కడంపై వీరూ స్పందించాడు. “నాకు ఇంతటి గౌరవం ఇచ్చిన ఐసీసీకి, జ్యూరీకి ధన్యవాదాలు. లెజెండ్స్ సరసన నిలవడం చాలా సంతోషం. ఇక బాల్ ను బాదడమే నాకు ఇష్టమైన పని. దీనితోనే నేను చాలా కాలం సంతోషంగా గడిపాను. నా కుటుంబానికి, ఫ్రెండ్స్, నా సహచర ఆటగాళ్లందరికి, అభిమానులకు థ్యాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు వీరూ భాయ్. అరుదైన గౌరవాన్ని అందుకున్న సెహ్వాగ్ కు అభినందనలు తెలిపింది బీసీసీఐ.

ఇక ఈ లిస్ట్ లో సెహ్వాగ్ కు ముందు.. బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, సచిన్, ద్రవిడ్, వినూ మన్కడ్ లు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు. కాగా.. టీమిండియా తరపున టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ గా సెహ్వాగ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక వీరూతో పాటుగా ప్రతిష్టాత్మక లిస్ట్ లో చోటు దక్కించుకున్న తొలి ఇండియన్ వుమెన్ గా చరిత్ర నెలకొల్పింది డయానా ఎడుల్జీ. టీమిండియా వుమెన్స్ జట్టులోకి టాలెంటెడ్ ప్లేయర్లను తీసుకురావడంలో డయానా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. వీరితో పాటుగా శ్రీలంక దిగ్గజ బ్యాటర్ అరవింద డి సిల్వాను కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఆహ్వానించింది ఐసీసీ. డి సిల్వా 1996లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మరి వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియాకు, క్రికెట్ కు అందించిన సేవలకు ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. మరి వీరూ భాయ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.