iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ.. నీ ఆట నువ్వు ఆడుకో! రోహిత్‌లా ఆడలేవ్‌: భారత మాజీ క్రికెటర్‌

  • Published Jan 20, 2024 | 8:39 PM Updated Updated Jan 20, 2024 | 8:39 PM

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ.. రోహిత్‌ శర్మలా ఆడలేడంటూ పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో కోహ్లీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మరి ఆ భారత మాజీ క్రికెటర్‌ అలా ఎందుకున్నారో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ.. రోహిత్‌ శర్మలా ఆడలేడంటూ పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో కోహ్లీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మరి ఆ భారత మాజీ క్రికెటర్‌ అలా ఎందుకున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 20, 2024 | 8:39 PMUpdated Jan 20, 2024 | 8:39 PM
Virat Kohli: కోహ్లీ.. నీ ఆట నువ్వు ఆడుకో! రోహిత్‌లా ఆడలేవ్‌: భారత మాజీ క్రికెటర్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత గొప్ప క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత అంతటోడైన విరాట్‌ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్‌, 1983 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యుడైన కృష్ణమాచారి శ్రీకాంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్‌ కోహ్లీ.. తన సహజమైన ఆటను తాను ఆడుకోవాలని, తనకు రాని హిట్టింగ్‌ను ప్రయత్నించవద్దని, కోహ్లీ.. రోహిత్‌లా ఆడలేడంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీనిపై విరాట్‌ కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ ఎంత అగ్రెసివ్‌గా ఆడతాడో ఆడగలడో కొత్తగా నిరూపించాల్సిన పనిలేదని అంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

టీమిండియాకు కోహ్లీ కెప్టెన్‌గా లేకపోయినా పెద్ద దిక్కుగా ఉన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 తర్వాత కోహ్లీ, రోహిత్‌ పొట్టిఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. వన్డే వరల్డ్ కప్‌ 2023 నేపథ్యంలో వన్డేలపైనే పూర్తి ఫోకస్‌ పెట్టారు. ఎలాగైనా వరల్డ్‌ కప్‌ గెలవాలనే కసితో వేరే ఫార్మాట్స్‌ను పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. మళ్లీ తిరిగి 14 నెలల తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ టీ20 క్రికెట్‌ ఆడారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌ బరిలోకి దిగారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయిన రోహిత్‌ శర్మ మూడు మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఇక కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 29 పరుగులు చేసి.. అగ్రెసివ్‌ ఇంటెంట్‌ చూపించాడు. మూడో మ్యాచ్‌లోనూ తొలి బంతి నుంచే అగ్రెసివ్‌ ఇంటెంట్‌ చూపించి.. భారీ షాట్‌ కోసం ప్రయత్నించి అవుట్‌ అయ్యాడు.

ఇదే విషయంపై శ్రీకాంత్‌ స్పందింస్తూ.. అందరు ఆటగాళ్లు ఒకేలా ఆడలేరు. కొంతమంది నిదానంగా ఆడతారు, మరికొంత మంది దూకుడుగా ఆడతారు. కోహ్లీ తనకు అలవాటైన ఆటనే ఆడాలని బలవంతంగా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయవద్దని, ఇప్పుడు జైస్వాల్‌ లాంటి ఆటగాడిని వేగంగా ఆడొద్దు.. నిదానంగా ఆడాలని అంటే అతను ఆడలేడని, అలాగే రోహిత్‌ సైతం దూకుడుగా ఆడతాడని, కానీ, కోహ్లీ అలా ఆడలేదని శ్రీకాంత్‌ పేర్కొన్నారు. అయితే.. కోహ్లీ వేగంగా ఆడలేడని శ్రీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీకాంత్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.