Nidhan
టీమిండియాలో చాలా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కోచింగ్ స్టాఫ్ విషయంలో ఫాస్ట్‌గా ఛేంజెస్ జరుగుతున్నాయి. మెన్ ఇన్ బ్లూ కొత్త్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్ వచ్చేశాడు.
టీమిండియాలో చాలా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కోచింగ్ స్టాఫ్ విషయంలో ఫాస్ట్‌గా ఛేంజెస్ జరుగుతున్నాయి. మెన్ ఇన్ బ్లూ కొత్త్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్ వచ్చేశాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 మొదలవడానికి ముందు భారత క్రికెట్‌కు సంబంధించి చాలా విషయాలపై స్పష్టత లేదు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యం, రాహుల్ ద్రవిడ్ ప్లేస్‌లో కొత్త కోచ్‌గా ఎవరు వస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే పొట్టి కప్పు ముగిసిన కొన్ని రోజుల్లోనే టీమిండియాలో చాలా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కోచింగ్ స్టాఫ్ విషయంలో ఫాస్ట్‌గా ఛేంజెస్ జరుగుతున్నాయి. మెన్ ఇన్ బ్లూ కొత్త్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్ వచ్చేశాడు. గంభీర్‌ను జట్టులోకి ఆహ్వానిస్తూ బీసీసీఐ సెక్రెటరీ జైషా అధికారిక ప్రకటన చేశాడు. బోర్డు నుంచి ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపాడు. గౌతీ రాకతో టీమిండియా మేనేజ్మెంట్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.
రాబోయే మూడేళ్ల పాటు కోచ్‌గా టీమిండియాకు మార్గనిర్దేశనం చేయనున్న గంభీర్.. తనకు సాయంగా ఉండేందుకు సపోర్ట్ స్టాఫ్‌ను ఎంచుకునే స్వేచ్ఛను కూడా బీసీసీఐ కల్పించింది. దీంతో తనతో కలసి పని చేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డొషేట్ లాంటి వాళ్లను జట్టులోకి తీసుకొచ్చేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడట. ఈ మేరకు బోర్డు పెద్దలతో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీమిండియాలోకి గంభీర్ రాక ముందే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవమానం జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల నుంచి కొత్త కోచ్ కోసం అన్వేషించిన బీసీసీఐ.. దరఖాస్తులను ఆహ్వానించి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి గంభీర్‌ను ఆ పదవికి ఎంపిక చేసింది. అయితే ఈ విషయంలో కోహ్లీని ఒక్క మాట కూడా అడగకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కోచ్ సెలెక్షన్ టైమ్‌లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో చర్చలు జరిపిందట బీసీసీఐ. గంభీర్ జట్టులోకి వస్తే ఎలా ఉంటుంది? లాంటి విషయాలను అతడితో డిస్కస్ చేసినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. అయితే 15 ఏళ్లకు పైగా జట్టులో ఉంటూ, ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించిన, టీమ్‌కు మాజీ కెప్టెన్ కూడా అయిన కోహ్లీని మాత్రం ఈ విషయంలో సంప్రదించలేదట. ఈ వార్త తెలిసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఓ మాట అడిగితే బాగుండేదని, ఇంకొన్నాళ్లు జట్టుతో ఉండే కోహ్లీని సంప్రదించి అతడి సలహా కూడా తీసుకుంటే గౌరవప్రదంగా ఉండేదని అంటున్నారు. విరాట్‌ను ఇంత చులకనగా చూడటం, మాట మాత్రం అయినా అడగకపోవడం అవమానకరమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీమిండియా లీడర్షిప్ గ్రూప్‌లో కోహ్లీ లేకపోవడం వల్లే అతడ్ని బోర్డు కన్సల్ట్ చేయలేదని వినికిడి. మరి.. కోచ్ ఎంపిక విషయంలో కింగ్‌ను బీసీసీఐ సంప్రదించకపోవడం గురించి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.