iDreamPost
android-app
ios-app

భార్యతో విడాకుల రూమర్స్‌..! మరో అమ్మాయితో హార్ధిక్‌ పాండ్యా ఫొటోలు వైరల్‌!

  • Published Jul 11, 2024 | 1:15 PMUpdated Jul 11, 2024 | 1:15 PM

Hardik Pandya, Prachi Solanki: ఇటీవల వరల్డ్‌ కప్‌ గెలిచి హీరోగా మారిన హార్ధిక్‌ పాండ్యా తాజాగా ఓ అమ్మాయితో దిగిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ పాండ్యాతో ఉన్న ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Prachi Solanki: ఇటీవల వరల్డ్‌ కప్‌ గెలిచి హీరోగా మారిన హార్ధిక్‌ పాండ్యా తాజాగా ఓ అమ్మాయితో దిగిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ పాండ్యాతో ఉన్న ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 11, 2024 | 1:15 PMUpdated Jul 11, 2024 | 1:15 PM
భార్యతో విడాకుల రూమర్స్‌..! మరో అమ్మాయితో హార్ధిక్‌ పాండ్యా ఫొటోలు వైరల్‌!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా ఇటీవలె విలన్‌ నుంచి హీరోగా మారాడు. ఐపీఎల్‌ 2024 ముందు నుంచి.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం ముందు వరకు పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. ప్రపంచ క్రికెట్‌లో సొంత దేశ క్రికెట్‌ అభిమానుల నుంచి ఆ స్థాయిలో ట్రోలింగ్‌ ఎదుర్కొన్న క్రికెటర్‌ మరొకడు లేడంటే అతిశయోక్తి కాదు. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అద్భుత ప్రదర్శనతో కప్పు గెలవడంతో కీలక పాత్ర పోషించడం, ఆల్‌రౌండర్‌గా రాణించడం, సౌతాఫ్రికాతో ఫైనల్‌ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో చివరి ఓవర్‌ వేయడంతో హార్ధిక్‌ పాండ్యాపై ఉన్న కోపం మొత్తం పోయి.. తిరిగి అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు భారత క్రికెట్‌ అభిమానులు. ఇదే కాకుండా.. టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా సంచలన విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

భార్య నటాషాతో హార్ధిక్‌ పాండ్యా విడిపోతున్నాడని, వాళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే హార్ధిక్‌ పాండ్యా తన ఆస్థిలో 70 శాతం తన భార్య పేరిట మార్చినట్లు కూడా పలు కథనాలు వెల్లడయ్యాయి. వాటిని బలపరుస్తూ.. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచినా కూడా హార్ధిక్‌ పాండ్యా భార్య నటాషా ఎలాంటి ట్వీట్‌ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు కానీ చేయకపోవడం గమనార్హం. దీంతో.. వాళ్లిద్దరూ నిజంగానే విడిపోతున్నారనే వార్తలు నిజం అవుతున్నాయని పాండ్యా అభిమానులు ఆందోళన చెందారు. ఒక వైపు విడాకుల రూమర్స్‌ వాయువేగంతో వ్యాప్తి చెందుతూ.. బలపడుతున్న తరుణంలోనే హార్ధిక్‌ పాండ్యా ఓ అందమైన అమ్మాయితో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

భార్య నటాషా తర్వాత.. పాండ్యా జీవితంలోకి వచ్చే అమ్మాయా? అంటూ కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా అనుమానాలు లేవనెత్తారు. దీంతో అసలు ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్లు నెట్లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఆ అమ్మాయి మరెవరో కాదు ప్రముఖ మేకప్‌ ఆర్టిస్టు ప్రాచీ సోలంకి. ఇటీవల ఆమె హార్ధిక్‌ పాండ్యాతో పాటు అతని అన్న కృనాల్‌ పాండ్యా ఫ్యామిలీని కలిసింది. ఆ సమయంలోనే వారితో ఫొటోలు కూడా దిగింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌చేసింది. ‘వరల్డ్‌ కప్‌ హీరోని కలిసినప్పుడు..’ అంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. దారిని ఒక అందమైన హిందీ పాటను కూడా జత చేసింది. అయితే.. భార్యతో పాండ్యా విడాకుల రూమర్స్‌ నేపథ్యంలో అ అమ్మాయి పాండ్యాతో క్లోజ్‌గా ఉంటుండటంతోనే వారి మధ్య ఏమైనా నడుస్తుందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటివి ఏమీ లేవంటూ కొంతమంది పాండ్యా అభిమానులు రూమర్స్‌ను కొట్టిపారేస్తున్నారు. మరి పాండ్యాతో సోలంకి క్లోజ్‌గా ఫొటోలు దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prachi Solanki (@ps_29)

 

View this post on Instagram

 

A post shared by Prachi Solanki (@ps_29)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి