iDreamPost
android-app
ios-app

11 దేశాల్లో ట్రెండింగ్​లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఇది భయ్యా క్రేజ్ అంటే..!

  • Author singhj Published - 04:39 PM, Thu - 16 November 23

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు 11 దేశాల్లో ట్రెండింగ్​లో ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్​లో ఉండటం అంటే మాములు విషయం కాదు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు 11 దేశాల్లో ట్రెండింగ్​లో ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్​లో ఉండటం అంటే మాములు విషయం కాదు.

  • Author singhj Published - 04:39 PM, Thu - 16 November 23
11 దేశాల్లో ట్రెండింగ్​లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఇది భయ్యా క్రేజ్ అంటే..!

పరుగుల వరద పారిస్తుంటే రన్ మెషీన్ అన్నారు. సెంచరీ మీద సెంచరీలు కొట్టి రికార్డులు తిరగరాస్తుంటే అతడి బ్యాట్​కు దూకుడు ఎక్కువని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే ఎలాంటి బ్యాట్స్​మన్​కైనా గడ్డు కాలం వస్తుంది. సెంచరీ కొట్టిన చోటే ఒక్క రన్ తీసేందుకు కూడా ఇబ్బంది పడుతుంటారు. భారీ షాట్లు బాదిన దగ్గరే బౌండరీ కొట్టాలన్నా భయపడతారు. కోల్పోయిన ఫామ్​ను తిరిగి పొందేందుకు ఎంత కాలం పడుతుందో చెప్పలేం. రన్స్ కొట్టకపోతే విమర్శకులు చుట్టుముడతారు. ఎందరో లెజెండ్స్​లాగే ఈ ఫేజ్​ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఎదుర్కొన్నాడు. అయితే పడిలేచిన కెరటంలా.. అగ్నిపర్వతం నుంచి ఉబికివచ్చే లావాలా మళ్లీ ఉవ్వెత్తున ఎగిశాడతను.

సచిన్ టెండూల్కర్ రికార్డులను చేరుకోలేడనే అనుమానాల్ని కోహ్లీ పటాపంచలు చేశాడు. ఏకంగా 50వ వన్డే సెంచరీతో రికార్డు నమోదు చేయడమే గాక.. భారత్​ను వరల్డ్ కప్ ఫైనల్​కు చేర్చాడు. ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత కోహ్లీ పైకి ఎదిగాడే తప్ప ఎన్నడూ కింద పడలేదు. స్వదేశమైనా, విదేశమైనా.. స్పిన్ పిచ్ అయినా, పేస్ వికెట్ అయినా.. అపోజిషన్​లో ఎలాంటి బౌలర్లు ఉన్నా అతడు పట్టించుకోడు. క్రీజులోకి అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించకుండా వదలడు. టన్నుల కొద్దీ రన్స్ చేసినా అలుపు ఉండదు విరాట్​కు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదేయడం.. అందరూ టెన్షన్ పడే ఛేజింగ్​లో మొనగాడిలా నిలబడి టీమ్​ను గెలిపించడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఒకవేళ ఎవరైనా అతడ్ని గెలికితే.. ఆ రోజు అపోజిషన్​ టీమ్​కు మూడినట్లే.

పదిహేనేళ్లుగా అదే ఫామ్​ను కంటిన్యూ చేస్తూ క్రికెట్ హిస్టరీలో అసాధ్యమనుకున్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేసేశాడు కోహ్లీ. ఫ్యూచర్​లో ఇలాంటి మరో క్రికెటర్ వస్తాడో లేదో చెప్పలేని పరిస్థితి. అయితే 2019-2023 మధ్య మాత్రం విరాట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రెండున్నరేళ్ల పాటు ఒక్క సెంచరీ చేయలేదు కోహ్లీ. రన్స్ చేసేందుకు చాలా తంటాలు పడిన విరాట్ నుంచి ఆ టైమ్​లో సెంచరీ ఆశించలేని పరిస్థితి. అయితే దీని నుంచి ఎట్టకేలకు బయటపడిన కింగ్ కోహ్లీ మళ్లీ తన పూర్వపు ఫామ్​ను అందుకున్నాడు. ఆసియా కప్​-2023లో ఆఫ్ఘానిస్థాన్​పై సెంచరీతో జోరందుకున్నాడు. అప్పటి నుంచి బ్రేకుల్లేని బుల్డోజర్​లా హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

వరల్డ్ కప్​లో 10 మ్యాచుల్లో ఏకంగా 711 రన్స్ చేశాడు కోహ్లీ. ఇందులో ​ మూడు సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్​తో మ్యాచ్​లో 50వ సెంచరీని పూర్తి చేసుకొని వన్డేల్లో రికార్డుల రారాజుగా నిలిచాడు. అలాంటి కోహ్లీ ఇప్పుడు 11 దేశాల్లో ట్రెండింగ్​లో ఉన్నాడు. ఇండియా, యూఎస్​ఏ, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక దేశాల్లో టాప్-5లో ట్రెండ్ అవుతున్నాడు కోహ్లీ. ఇది చూసిన నెటిజన్స్.. విరాట్ భయ్యా రియల్ క్రేజ్ ఇదంటున్నారు. అందుకే కోహ్లీని గ్లోబల్ ఐకాన్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారని చెబుతున్నారు. మరి.. 11 దేశాల్లో కోహ్లీ ట్రెండింగ్​లో ఉండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నేను చావడానికైనా సిద్ధం! ఆ తప్పు మాత్రం చేయను: మహ్మద్ షమీ!