Nidhan
టీ20 వరల్డ్ కప్-2024ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. అలాంటోడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.
టీ20 వరల్డ్ కప్-2024ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. అలాంటోడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024ను రోహిత్ సేన కైవసం చేసుకోవడంతో భారత అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల తర్వాత కప్పు అందుకోవడంతో వాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను భారత్ ఓడించగానే కోట్లాది మంది సంతోషంతో పరవశించిపోయారు. రోడ్ల మీదకు వచ్చి క్రాకర్స్ కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇంత సెలబ్రేషన్‌కు భారత జట్టులోని ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వకూడదు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర బ్యాటర్లు, బౌలర్లు.. అలాగే కోచింగ్ స్టాఫ్ చేసిన కృషిని, పడిన కష్టాన్ని గుర్తించాలి. వీళ్లందరూ కలసికట్టుగా రాణించడం వల్లే జట్టు కప్పు కలను నెరవేర్చుకుంది.
భారత్ కప్పు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తన క్లాస్ బ్యాటింగ్‌తో అతడు జట్టుకు అండగా నిలిచాడు. ఫైనల్ వరకు సైలెంట్‌గా ఉన్న కింగ్ బ్యాట్.. తుదిపోరులో మాత్రం గర్జించింది. ఫైనల్ వరకు ఆడిన మ్యాచుల్లో కలిపి కేవలం 75 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. టైటిల్ ఫైట్‌లో 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ త్వరగా ఔట్ అవడంతో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి యాంకర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఒకవైపు తాను మెళ్లిగా ఆడుతూ వికెట్లను కాపాడుతూ.. మరోవైపు అక్షర్ పటేల్, శివమ్ దూబె లాంటి వారితో హిట్టింగ్ చేయించాడు. ఫైనల్లో అదిరిపోయే బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు కోహ్లీ. అలాంటోడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.
ఫైనల్ మ్యాచ్ వరకు కోహ్లీ తన బెస్ట్ ఇవ్వలేదని, దాన్ని దాచిపెడుతూ వచ్చాడని రవిశాస్త్రి అన్నాడు. తుదిపోరులో అప్పటివరకు దాచి ఉంచిన దాన్ని బయటకు తీసి ప్రత్యర్థుల పనిపట్టాడని తెలిపాడు. అతడు చేసిన ఈ పనే జట్టుకు కప్పును అందించిందని చెప్పాడు. ‘ఫైనల్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ తన బెస్ట్‌ను దాచాడు. తన పరుగుల దాహాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తుదిపోరులో అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్లే టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సినంత భారీ స్కోరు భారత్ చేయగలిగింది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. కీలక సమయంలో కోహ్లీ తన బెస్ట్‌ను ఇచ్చాడని.. ఆ పనే రోహిత్ సేనను గట్టెక్కించిందన్నాడు. కింగ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని.. అతడిపై అనుమానాలు అనవసరమని స్పష్టం చేశాడు.
Ravi Shastri said – “Virat Kohli save his Best for Final. He held the India’s innings and he took the India’s total where India will win the T20 World Cup Final”. (Star Sports). pic.twitter.com/WaJ3MYvrWy
— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024