iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వరల్డ్ కప్​తో ఇండియాకు వస్తున్నాం.. మీరు సిద్ధంగా ఉన్నారా? రోహిత్ మాస్ ట్వీట్!

  • Published Jul 03, 2024 | 6:15 PM Updated Updated Jul 03, 2024 | 6:15 PM

టీ20 వరల్డ్ కప్-2024 గెలిచిన జోష్​లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాస్ ట్వీట్ చేశాడు. మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్-2024 గెలిచిన జోష్​లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాస్ ట్వీట్ చేశాడు. మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.

  • Published Jul 03, 2024 | 6:15 PMUpdated Jul 03, 2024 | 6:15 PM
Rohit Sharma: వరల్డ్ కప్​తో ఇండియాకు వస్తున్నాం.. మీరు సిద్ధంగా ఉన్నారా? రోహిత్ మాస్ ట్వీట్!

టీ20 వరల్డ్ కప్​ను రోహిత్ సేన నెగ్గడంతో ఫుల్ జోష్​లో ఉన్నారు కోట్లాది మంది భారతీయ అభిమానులు. 13 ఏళ్ల కప్పు కల నెరవేరడంతో సంతోషంలో మునిగిపోయారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​పై రివేంజ్ తీర్చుకోవడం, ఫైనల్​లో సౌతాఫ్రికాను ఓడించి కప్పును టీమిండియా కైవసం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇది అసలైన ఆట అంటే.. ఛాంపియన్ టీమ్ ఇలాగే ఆడుతుంది అంటూ మీసం మెలేస్తున్నారు ఫ్యాన్స్. మన జట్టు గెలుపును ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో టీమిండియా కప్పుతో స్వదేశానికి వస్తే చూద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఆలస్యమవుతూ వస్తోంది. కరీబియన్ దీవుల్లో తుఫాను బీభత్సం వల్ల భారత జట్టు అక్కడే ఇరుక్కుపోయింది. వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్నాక బయల్దేరదామని ఫిక్స్ అయింది. అయితే ఇక నో వెయిటింగ్.

పొట్టి కప్పుతో స్వదేశానికి పయనమైంది టీమిండియా. భారత ఆటగాళ్లు ఇవాళ రాత్రి ఢిల్లీలో ల్యాండ్ కానున్నారని సమాచారం. షెడ్యూల్ ప్రకారం జులై 1వ తేదీన వాళ్లు అక్కడి నుంచి బయల్దేరాల్సింది. కానీ బెరిల్ తుఫాను కారణంగా కరీబియన్ దీవుల్లో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు వాళ్ల రాకకు అంతా ఫిక్స్ అయింది. అక్కడి నుంచి బయల్దేరిన మెన్ ఇన్ బ్లూ.. బుధవారం రాత్రి 7.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని తెలుస్తోంది. ఈ తరుణంలో భారత అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. వరల్డ్ కప్​తో ఇండియాకు వస్తున్నాం.. సిద్ధంగా ఉండమని ఫ్యాన్స్​ను కోరాడు. విక్టరీ సెలబ్రేషన్స్ ఎక్కడ జరగనున్నాయో చెప్పేశాడు హిట్​మ్యాన్.

‘ఈ ఆనందకర క్షణాలను అభిమానులతో కలసి ఎంజాయ్ చేయాలని మేం కోరుకుంటున్నాం. కాబట్టి అందరమూ కలసి ఒకేచోట సెలబ్రేట్ చేసుకుందాం. జులై 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు వాంఖడే మైదానానికి అందరూ వచ్చేయండి. అక్కడే సెలబ్రేషన్స్. అదే రోజు మెరైన్ డ్రైవ్​లో విక్టరీ పరేడ్ నిర్వహిస్తున్నాం’ అని రోహిత్ ట్వీట్ చేశాడు. హిట్​మ్యాన్​ మాస్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముంబై వీధుల్లో కప్పుతో రోహిత్ సేన చేసే హంగామాను చూసేందుకు రెడీ అంటూ ఈ ట్వీట్​కు అభిమానులు రిప్లయ్ ఇస్తున్నారు. ఈ క్షణం కోసమే తాము ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రేషన్స్ అదిరిపోవాలని అంటున్నారు. మరి.. భారత జట్టు విక్టరీ పరేడ్ కోసం మీరెంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş