భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని తన పేద రాసుకున్న విరాట్.. మరెన్నో రికార్డుల్ని బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని తన పేద రాసుకున్న విరాట్.. మరెన్నో రికార్డుల్ని బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుత తరం క్రికెటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెస్ట్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీ20లు, వన్డేలు, టెస్టులనే తేడాల్లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు కోహ్లీ. ముఖ్యంగా వన్డేల్లోనైతే పరుగుల వరద పారిస్తున్నాడు. మరో మూడ్నాలుగేళ్లు ఇలాగే ఆడితే భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న దాదాపు అన్ని రికార్డులను కోహ్లీ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫిట్నెస్ కాపాడుకోవడం కీలకం కానుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లోనైతే కోహ్లీ సూపర్బ్ బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. వరుసగా అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇప్పటికే వరల్డ్ కప్ సగం పూర్తయింది. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన కోహ్లీ.. సెకండాఫ్‌లోనూ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అతడితో పాటు రోహిత్ శర్మ కూడా చెలరేగితే భారత్‌కు తిరుగుండదని అంటున్నారు. అయితే బ్యాటింగ్‌లో ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణమేంటో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కోహ్లీ. ప్రతి రోజు, ప్రతి ప్రాక్టీస్ సెషన్, ప్రతి సీజన్, ప్రతి ఏడాది..తనను తాను మెరుగ్గా తీర్చిదిద్దుకోవడం మీదే దృష్టి పెడతానన్నాడు. అదే ఇన్ని సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా తాను రాణించడానికి ఉపయోగపడిందన్నాడు కోహ్లీ.
‘నేనే కాదు.. ఏ ప్లేయర్‌కైనా తనను తాను మెరుగుపర్చుకునే మెంటాలిటీ ఉంటేనే గొప్పగా రాణించగలడు. నేనెప్పుడూ గొప్ప స్థాయికి చేరడంపై ఫోకస్ చేయలేదు. నన్ను నేను బెటర్‌గా తీర్చిద్దుకోవడం మీదే ఎల్లప్పుడూ ఫోకస్ చేస్తా. గ్రేట్ లెవల్‌కు చేరుకోవడం అంటే ఏంటో నాకు నిజంగా తెలియదు. దానికో ఎండ్ అనేది లేదు. ఫలానా సాధిస్తే గొప్ప స్థాయికి చేరుకున్నట్లేననే సెంటిమెంట్ ఏమీ లేదు. అందుకే ప్రతి రోజూ నన్ను నేను మెరుగుపర్చుకుంటూ రాణించడం మీదే ఫోకస్ చేస్తా. అందుకు తగ్గట్లే నా మైండ్‌సెట్‌ను ట్యూన్ చేస్తా. నేనెలా ఆడితే టీమ్ గెలుస్తుందో దాని ప్రకారమే ఆడతా. అందువల్లే నేను రాణిస్తున్నా. ఇదే నా సీక్రెట్’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీ బ్యాటింగ్ సీక్రెట్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.