Virat Kohli: ఆ విమర్శలు భరించలేకే కోహ్లీ రిటైర్ అయ్యాడు.. పాక్ క్రికెటర్ చెత్త వాగుడు!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​తో ఆ ఫార్మాట్​ నుంచి అతడు తప్పుకున్నాడు. దీనిపై ఓ పాక్ మాజీ క్రికెటర్ చెత్త వాగుడు వాగాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​తో ఆ ఫార్మాట్​ నుంచి అతడు తప్పుకున్నాడు. దీనిపై ఓ పాక్ మాజీ క్రికెటర్ చెత్త వాగుడు వాగాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​తో ఆ ఫార్మాట్​ నుంచి అతడు తప్పుకున్నాడు. ఇక మీదట టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితం కానున్నట్లు వెల్లడించాడు. టీ20లకు గుడ్​బై చెప్పేందుకు ఇంతకంటే మంచి తరుణం ఉండదన్నాడు. ఒకవైపు భారత్ పొట్టి కప్పు గెలిచిందనే సంతోషంలో ఉండగానే మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు బాధ తట్టుకోలేకపోయారు. వీళ్లను టీ20ల్లో ఇక చూడమనే ఆలోచన వారిని బాధకు గురిచేసింది. ఎంతో ఫిట్​గా ఉన్న కోహ్లీ ఇంకో ప్రపంచ కప్ వరకు పొట్టి ఫార్మాట్​లో కొనసాగాలని కోరుకున్నారు. కానీ విరాట్ నిర్ణయంలో మార్పు రాలేదు. కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ రియాక్ట్ అయ్యాడు.

టీ20ల్లో తన స్ట్రైక్ రేట్​పై వస్తున్న విమర్శల్ని తట్టుకోలేకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని బాసిత్ అలీ అన్నాడు. విరాట్ రిటైర్మెంట్ మీద బాసిత్ అలీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. నోరు అదుపులో ఉంచుకోవాలని, కోహ్లీ గురించి ఏది పడితే మాట్లాడితే ఊరుకోబోమని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. చెత్త వాగుడు బంద్ చేయాలని సూచిస్తున్నారు. క్రికెటర్​గా మూడు ఫార్మాట్లలో కోహ్లీ సాధించిన ఘనతలు ఏంటో చూసుకోమని అంటున్నారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్​లో భారత్ గెలుపునకు విరాట్ ఆడిన ఇన్నింగ్సే ముఖ్యమని.. టీమ్ విజయం కంటే కోహ్లీకి ఏదీ ముఖ్యం కాదని చెబుతున్నారు. అయితే భారత బ్యాటర్ రిటైర్మెంట్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ చేసిన బాసిత్ అలీ.. మిగతా విషయాల్లో మాత్రం కోహ్లీని ఆకాశానికెత్తేశాడు.

పొట్టి ఫార్మాట్​లో పవర్ హిట్టర్లు ఎక్కువ కాలం నెగ్గుకురాలేరని చెప్పిన బాసిత్ అలీ.. టెక్నికల్​గా స్ట్రాంగ్​గా ఉన్న కోహ్లీ లాంటి బ్యాటర్లే కెరీర్​ను సుదీర్ఘ కాలం పొడిగించుకోగలరని వ్యాఖ్యానించాడు. విరాట్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమని మెచ్చుకున్నాడు. గేమ్​ మీద అతడికి ఎంతో డెడికేషన్ ఉందని.. ఎంతో హార్డ్ వర్క్ చేశాడు కాబట్టే ఈ స్థాయికి చేరుకున్నాడని ప్రశంసించాడు. ఒకవేళ బ్యాటింగ్ చేస్తూ త్వరగా ఔట్ అయినా ఫీల్డింగ్​లో అతడు బెస్ట్ ఇస్తాడన్నాడు బాసిత్ అలీ. 16 ఏళ్లుగా నిరంతరం శ్రమించడం వల్లే కోహ్లీ రేంజ్​కు చేరుకున్నాడని పేర్కొన్నాడు. అంతా బాగానే ఉన్నా విరాట్ రిటైర్మెంట్ విషయంలో ఈ పాక్ మాజీ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక, బంగ్లాదేశ్​తో సిరీస్​కు ముందు భారీ గ్యాప్ ఉండటంతో కోహ్లీ ఫ్యామిలీతో కలసి లండన్​లో వెకేషన్​ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Show comments