iDreamPost
android-app
ios-app

టీమిండియా గురించి అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డస్కటే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

  • Published Aug 21, 2024 | 8:53 PM Updated Updated Aug 21, 2024 | 8:53 PM

Ryan Ten Doeschate On Team India: భారత జట్టుకు నయా అసిస్టెంట్ కోచ్​గా వచ్చిన ర్యాన్ టెన్‌ డస్కటే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క సిరీస్​తోనే టీమిండియా ఏంటో పూర్తిగా చెప్పేశాడు.

Ryan Ten Doeschate On Team India: భారత జట్టుకు నయా అసిస్టెంట్ కోచ్​గా వచ్చిన ర్యాన్ టెన్‌ డస్కటే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క సిరీస్​తోనే టీమిండియా ఏంటో పూర్తిగా చెప్పేశాడు.

  • Published Aug 21, 2024 | 8:53 PMUpdated Aug 21, 2024 | 8:53 PM
టీమిండియా గురించి అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డస్కటే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

కోచింగ్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఒక టీమ్ ఎన్విరాన్​మెంట్​ను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు వ్యూహాలు పన్నాలి. జట్టులోని ఆటగాళ్ల బలాబలాలను సరిగ్గా అంచనా వేయాలి. బలాన్ని మరింత పెంచి, బలహీనతను కూడా బలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుండేలా చూసుకోవాలి. కోర్ గ్రూప్​గా ఎందులో బాగా సక్సెస్ అవుతున్నారో అర్థం చేసుకోకపోతే టీమ్​ కోసం స్ట్రాటజీలు సిద్ధం చేయడం చాలా కష్టం. ఈ కిటుకు తెలుసుకున్నట్లున్నాడు టీమిండియా నయా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే. భారత కోచింగ్ బృందంలో చేరి నెల రోజులు కూడా తిరగకముందే టీమిండియాను పూర్తిగా చదివేశాడు.

భారత జట్టు బలం స్పిన్​ను బాగా ఆడటం. పేస్ బౌలింగ్​ను కూడా అంతే ధీటుగా ఎదుర్కోగలరు మన బ్యాటర్లు. కానీ స్పిన్​ను బాగా ఆడటం, స్పిన్ బౌలర్లను చిత్తు చేయడం భారత బ్యాటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో ఏళ్లుగా మనోళ్లు ఆరితేరారు. ఇదే విషయాన్ని బాగా అర్థం చేసుకున్న డస్కటే.. లంకతో వన్డే సిరీస్​లో ఓటమికి కారణం ఏంటో చెప్పేశాడు. స్పిన్​ను బాగా ఆడే టీమిండియా క్రికెటర్లు.. ఈసారి అందులో కాస్త వెనుకంజ వేశారని, అందుకే ఓటమి తప్పలేదన్నాడు. శ్రీలంక సిరీస్​లో టీ20ల్లో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ.. వన్డే సిరీస్​లో మాత్రం సేమ్ రిజల్ట్​ను రిపీట్ చేయలేకపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు శుబ్​మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి స్టార్లు ఉన్నా జట్టును ఓటముల నుంచి కాపాడలేకపోయారు.

లంక సిరీస్ ఓటమిపై నయా అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి తమను బాధకు గురిచేసిందన్నాడు. ‘శ్రీలంక టూర్​ను సక్సెస్​తో ముగించలేకపోయాం. ఓవర్సీస్​లో రాణించాలని భారత క్రికెటర్లు పట్టుదలతో ఉన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​ లాంటి దేశాల్లో అదరగొట్టాలని వాళ్లు కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ఫోకస్ పెడుతున్నారు. భారత జట్టు స్పిన్​ను ఆడటంలో ఆరితేరింది. ఇది టీమిండియాకు ఎప్పుడూ బలంగా ఉంటూ వచ్చింది. కానీ లంక సిరీస్​లో మాత్రం ఇది జరగలేదు. మా బ్యాటర్లు కాస్త తడబడ్డారు’ అని టెన్ డస్కటే చెప్పుకొచ్చాడు. ఇక, లంకతో వన్డే సిరీస్​లో భారత్ 0-2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్​ డ్రా కాగా.. మరుసటి రెండు మ్యాచుల్లో ఆతిథ్య జట్టు గెలిచి సిరీస్​ను సొంతం చేసుకుంది. లంక మీద చాన్నాళ్ల తర్వాత టీమిండియా సిరీస్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంది. పొట్టి వరల్డ్ కప్​లో ఛాంపియన్​గా నిలిచిన టీమ్.. లంక చేతుల్లో ఓడిపోవడం అభిమానుల్ని నిరాశపర్చింది.