iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ కు ముందు కోహ్లీ నయా ట్రెండ్! పిక్ వైరల్!

  • Author Soma Sekhar Published - 12:14 PM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 12:14 PM, Mon - 21 August 23
వరల్డ్ కప్ కు ముందు కోహ్లీ నయా ట్రెండ్! పిక్ వైరల్!

వరల్డ్ కప్-2023 మరికొన్ని రోజుల్లో ఈ విశ్వసమరానికి తెరలేవనుంది. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ లో పాల్గొనే అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. టీమిండియా సైతం వరల్డ్ కప్ కు జట్టును సిద్దం చేసే పనిలో పడింది. అందులో భాగంగానే ప్రయోగాల బాటపట్టింది. యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇస్తూ.. వారిని వరల్డ్ కప్ ముందు పరీక్షిస్తోంది. ఇక ఇదంతా కాసేపు పక్కన పెడితే.. వరల్డ్ కప్ ముందు కోహ్లీ సరికొత్త లుక్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కోహ్లీ అభిమానులు నయా ట్రెండ్ అంటూ విరాట్ భాయ్ అంటూ కితాబిస్తున్నారు.

విరాట్ కోహ్లీ.. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. వరల్డ్ క్రికెట్ కే కింగ్ నిపించుకున్నాడు. ఇక విరాట్ ఫిట్ నెస్ గురించి అతడి స్టైలిష్ లుకింగ్ గురించి మనకు తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు స్టైలిష్ గా ఉండటంలో విరాట్ తర్వాతే ఏ ఇండియన్ క్రికెటరైనా అనేంతగా మారుతుంటాడు ఈ రన్ మెషిన్. తాజాగా వరల్డ్ కప్ ముందు కోహ్లీ నయా ట్రెండ్ ను సెట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రపంచ కప్ ముంగిట టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ చెవి పోగు కుట్టించుకున్నాడు. ఆ పిక్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వరల్డ్ కప్ సెంటిమెంట్ లో భాగంగానే విరాట్ ఇలా చెవి పోగు కుట్టించుకున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇది కోహ్లీ భాయ్ నయా ట్రెండ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి కోహ్లీ నయా లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ఇకపై కెప్టెన్సీకి దూరంగా హార్దిక్‌ పాండ్యా! BCCI మాస్టర్‌ ప్లాన్‌