iDreamPost
android-app
ios-app

సచిన్‌ కాదు.. ఇండియన్‌ క్రికెట్‌లో ఇతనే గొప్ప క్రికెటర్‌ అంటున్న సిద్ధూ!

  • Published Jul 09, 2024 | 10:44 AM Updated Updated Jul 09, 2024 | 10:44 AM

Navjot Singh Sidhu, Sachin Tendulkar, Virat Kohli: భారత క్రికెట్‌ చరిత్రలో గొప్ప క్రికెటర్‌ ఇతనే అంటూ భారత మాజీ క్రికెటర్‌ సిద్ధూ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే.. ఆ గొప్ప సచిన్‌ అయితే కాదు.. మరి ఎవరో ఇప్పుడు చూద్దాం..

Navjot Singh Sidhu, Sachin Tendulkar, Virat Kohli: భారత క్రికెట్‌ చరిత్రలో గొప్ప క్రికెటర్‌ ఇతనే అంటూ భారత మాజీ క్రికెటర్‌ సిద్ధూ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే.. ఆ గొప్ప సచిన్‌ అయితే కాదు.. మరి ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 09, 2024 | 10:44 AMUpdated Jul 09, 2024 | 10:44 AM
సచిన్‌ కాదు.. ఇండియన్‌ క్రికెట్‌లో ఇతనే గొప్ప క్రికెటర్‌ అంటున్న సిద్ధూ!

భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత గొప్ప క్రికెటర్‌ ఎవరంటే.. చాలా మంది చెప్పే పేరు సచిన్‌ టెండూల్కర్‌. ఆయనను ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌గా అభివర్ణిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాషించిన క్రికెటర్‌ సచిన్‌. ఇప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్‌ పేరు చెక్కుచెదరకుండా ఉంది. భవిష్యత్తులో మరే క్రికెటర్‌ కూడా అన్ని పరుగులు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. అలాగే సెంచరీల విషయంలో కూడా సచిన్‌ దాటే వారు పెద్దగా కనిపించడంలేదు. వన్డే ఫార్మాట్‌లో విరాట్‌ కోహ్లీ ఒక్కడే సచిన్‌ టెండూల్కర్‌ సెంచరీలను దాటేశాడు. కానీ, ఓవరాల్‌గా ఇంకా చాలా వెనుకబడి ఉన్నాడు. అయినా కూడా భారత క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీనే గొప్ప క్రికెటర్‌ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అంటున్నాడు.

కోహ్లీ గొప్ప క్రికెటర్‌.. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ, ఇండియన్‌ క్రికెటర్‌ కోహ్లీ కంటే గ్రేటెస్ట్‌ క్రికెటర్‌ను ఇప్పటి వరకు చూడలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సిద్ధూ.. కోహ్లీని సచిన్‌తో పోల్చలేదు కానీ… కోహ్లీని ఆకాశానికెత్తేశారు. ఆయన కామెంట్స్‌పై కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ కంటే.. సచిన్‌ గొప్ప క్రికెటర్‌ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. చాలా కాలంగా సచిన్‌ని కోహ్లీని పోల్చుతూ.. చాలా మంది పలు వ్యాఖ్యలు చేశారు.

అయితే.. సచిన్‌తో తనను పోల్చడం సరికాదని స్వయంగా కోహ్లీనే వెల్లడించడంతో ఆ పోలికలకు కాస్త తెరపడింది. సచిన్‌ తన కెరీర్‌లో 200 టెస్టులు ఆడి 15921 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 6 డబుల్‌ సెంచరీలు, 68 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 463 వన్డే మ్యాచ్‌ల్లో 18426 పరుగులు చేశాడు. అందులో 49 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 96 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఒక టీ20 మ్యాచ్‌లో 10 రన్స్‌ చేశాడు. ఇక విరాట్‌ కోహ్లీ స్టాట్స్‌ చేస్తే.. 113 టెస్టుల్లో 8848 పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు, 7 డబుల్‌ సెంచరీలు, 30 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 292 వన్డేల్లో 13848 పరుగులు చేశాడు. అందులో 50 సెంచరీలు, 72 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 125 టీ20 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సచిన్‌ అంత లాంగ్‌ కెరీర్‌ ఉంటే.. కోహ్లీ ఆయన రికార్డులను దాటేస్తాడు కానీ, అంత కాలం కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. సచిన్‌లా 200 టెస్టులు, 463 వన్డేలు ఆడటం అంటే కష్టమే. మరి ఇండియన్‌ క్రికెట్‌లో గ్రేటెస్ట్‌ క్రికెటర్‌ కోహ్లీ అంటూ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.