iDreamPost
android-app
ios-app

భారత జట్టులో అతనే రియల్ లీడర్.. మైండ్​సెట్ మొత్తం మార్చేశాడు: మాజీ బ్యాటింగ్ కోచ్

  • Published Aug 20, 2024 | 7:57 PM Updated Updated Aug 20, 2024 | 7:57 PM

Vikram Rathour On Team India: భారత జట్టుకు బ్యాటింగ్​ కోచ్​గా సేవలు అందించాడు విక్రమ్ రాథోడ్. అలాంటోడు తాజాగా టీమిండియా ఎన్విరాన్​మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Vikram Rathour On Team India: భారత జట్టుకు బ్యాటింగ్​ కోచ్​గా సేవలు అందించాడు విక్రమ్ రాథోడ్. అలాంటోడు తాజాగా టీమిండియా ఎన్విరాన్​మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Aug 20, 2024 | 7:57 PMUpdated Aug 20, 2024 | 7:57 PM
భారత జట్టులో అతనే రియల్ లీడర్.. మైండ్​సెట్ మొత్తం మార్చేశాడు: మాజీ బ్యాటింగ్ కోచ్

టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో జట్టు ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్​ వరకు వెళ్లింది. వన్డే ప్రపంచ కప్-2023లో కూడా ఫైనల్​కు చేరుకుంది. ఈ రెండు టోర్నీల్లో తుదిమెట్టుపై జారిపడినా.. టీ20 వరల్డ్ కప్-2024లో మాత్రం ఛాంపియన్స్​గా నిలిచింది. సారథిగా రోహిత్ సక్సెస్​లో ఓ కీలక ఆటగాడి పాత్ర ఎంతో ఉంది. అతడు ఇచ్చిన సపోర్ట్ వల్లే హిట్​మ్యాన్​ మీద ఉన్న ప్రెజర్ చాలా మటుకు తగ్గింది. ఇటు బ్యాటర్​గా పరుగుల పరంగా కాంట్రిబ్యూషన్ అందిస్తూనే, అటు తన సీనియార్టిని ఉపయోగించి కెప్టెన్సీలోనూ రోహిత్​కు అండగా నిలబడ్డాడో ప్లేయర్. అతడే విరాట్ కోహ్లీ. అందుకే అతడ్ని రియల్ లీడర్ అని అంటున్నాడు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.

టీమిండియాలో కోహ్లీ రోల్ గురించి విక్రమ్ రాథోడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్​కు యాటిట్యూడ్ నేర్పింది కోహ్లీనే అని అన్నాడు. ఆటగాళ్ల మైండ్​సెట్ మార్చేశాడని.. గెలుపే లక్ష్యంగా గ్రౌండ్​లో బెస్ట్ ఇచ్చేలా వాళ్లలో స్ఫూర్తిని నింపాడన్నాడు. ‘కోహ్లీ అసలు సిసలు నాయకుడు. అతడు ఇండియన్ టీమ్​లో నెవర్ గివప్ యాటిట్యూడ్​ను తీసుకొచ్చాడు. ఏ పరిస్థితుల్లో నుంచైనా మ్యాచ్​లు గెలిచేలా ఆటగాళ్ల మానసిక దృక్పథాన్ని మార్చేశాడు. విజయమే లక్ష్యంగా పోరాడేలా ప్లేయర్లను సిద్ధం చేశాడు’ అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. విరాట్ అద్భుత బ్యాటర్ అని మెచ్చుకున్న రాథోడ్.. అతడి మైండ్​సెట్ గురించి ఓ ఎగ్జాంపుల్ ఇచ్చాడు.

team india

ఐపీఎల్​లో 980 పరుగులు చేసిన తర్వాత వెస్టిండీస్​ టూర్​కు వెళ్లి అక్కడ డబుల్ సెంచరీ కొట్టాడని కోహ్లీ గురించి విక్రమ్ రాథోడ్ అన్నాడు. డబుల్ సెంచరీ ఇన్నింగ్స్​లో ఒక్క షాట్​ను కూడా గాల్లోకి కొట్టలేదన్నాడు. ఐపీఎల్​లో 160 స్ట్రైక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తూ ఏకంగా 40 సిక్సులు బాదాడని చెప్పాడు. అయితే ఇంతగా పించ్​ హిట్టింగ్​కు దిగినోడు.. విండీస్​పై మాత్రం ఒక్క షాట్ కూడా గాల్లోకి ఆడకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందన్నాడు. విరాట్ మైండ్​సెట్, కమిట్మెంట్​కు ఇది నిదర్శనమని ప్రశంసల్లో ముంచెత్తాడు. మ్యాచ్ కండీషన్స్, అపోజిషన్ టీమ్​ను బట్టి తన గేమ్​ను అతడు అడ్జస్ట్ చేసుకుంటాడని, ఇది గ్రేట్ క్వాలిటీ అని రాథోడ్ పేర్కొన్నాడు. తన ఫోకస్ మొత్తం టార్గెట్ మీదే పెడతాడన్నాడు. మరి.. కోహ్లీ రియల్ లీడర్ అంటూ విక్రమ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.