iDreamPost
android-app
ios-app

రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్టీవ్ స్మిత్.. ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పేశాడు!

  • Published Aug 20, 2024 | 5:01 PM Updated Updated Aug 20, 2024 | 5:01 PM

Steve Smith Reaction On Retirement: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రిటైర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు క్రికెట్​కు గుడ్​బై చెబుతున్నాడంటూ పుకార్లు ఊపందుకున్నాడు. దీనిపై స్వయంగా స్మిత్ క్లారిటీ ఇచ్చాడు.

Steve Smith Reaction On Retirement: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రిటైర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు క్రికెట్​కు గుడ్​బై చెబుతున్నాడంటూ పుకార్లు ఊపందుకున్నాడు. దీనిపై స్వయంగా స్మిత్ క్లారిటీ ఇచ్చాడు.

  • Published Aug 20, 2024 | 5:01 PMUpdated Aug 20, 2024 | 5:01 PM
రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్టీవ్ స్మిత్.. ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పేశాడు!

క్రికెట్​కు ఆస్ట్రేలియా అందించిన గొప్ప బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్పిన్నర్​గా ఇంటర్నేషనల్ కెరీర్​ను ఆరంభించిన స్మిత్​లోని బ్యాటింగ్ టాలెంట్​ను గుర్తించి టీమ్ మేనేజ్​మెంట్ ఎంకరేజ్ చేసింది. దీంతో బంతిని విడిచి ఫుల్ టైమ్ బ్యాటర్​గా అతడు స్థిరపడిపోయాడు. టన్నుల కొద్దీ పరుగులతో టాప్ బ్యాటర్​గా గుర్తింపు సంపాదించాడు. కెప్టెన్​గానూ ఎన్నో బడా టోర్నీల్లో కంగారూలను విజేతగా నిలిపాడు. అలాంటోడు టీ20 వరల్డ్ కప్​-2024లో ఆడలేదు. అతడ్ని టీమ్​లోకి తీసుకోలేదు. దీంతో స్మిత్ రిటైర్మెంట్ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అతడు కెరీర్​కు గుడ్​బై చెబుతున్నట్లు పుకార్లు పెరిగాయి. ఈ విషయంపై స్వయంగా స్మిత్ స్పష్టత ఇచ్చాడు. తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో రివీల్ చేశాడు.

‘ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనలు లేవు. ఇంకా చాన్నాళ్లు గేమ్​లో కంటిన్యూ అవుతా. ఈ ఏడాది ఆఖర్లో భారత్​తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. టీమిండియాతో ఆడటం ఎప్పుడూ బిగ్ ఛాలెంజ్. భారత్ ఓ అద్భుతమైన జట్టు. వాళ్లతో పోటీపడటం అంటే నాకు చాలా ఇష్టం. భారత్, ఆస్ట్రేలియాలు టెస్ట్ క్రికెట్​లో రెండు టాప్ టీమ్స్’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. తనలో ఇంకా చాలా క్రికెట్ బాకీ ఉందన్నాడీ బ్యాటర్.  ఇంకో నాలుగేళ్లు పొట్టి ఫార్మాట్​లో కంటిన్యూ అవుతానని.. తాను ఎక్కువ కాలం ఆడేది టీ20లేనని స్మిత్ పేర్కొన్నాడు. ఒలింపిక్స్​లో క్రికెట్​ను తీసుకురావడం భేష్ అంటూ మెచ్చుకున్నాడు.

steve smith retirement

రిటైర్మెంట్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదన్న స్మిత్.. క్రికెట్​ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపాడు. సమ్మర్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నానని.. భారత్​తో టెస్ట్ సిరీస్ ప్రతిష్టాత్మకం కానుందన్నాడు. ఇది ఐదు టెస్టుల సిరీస్ అని.. బాగా ఆడిన జట్టుదే విజయమన్నాడు. అందుకోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటిని తట్టుకొని నిలబడితే సక్సెస్ అదే వస్తుందన్నాడు స్మిత్. ఇక, ఐపీఎల్​కు దూరంగా ఉంటున్న ఈ ఆసీస్ స్టార్.. క్యాష్ రిచ్ లీగ్​లో కమ్​బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏడాది చివర్లో జరిగే మెగా ఆక్షన్​లో పాల్గొననున్నట్లు తెలిపాడు. మరో ఛాన్స్ వస్తే మాత్రం లీగ్​లో అదరగొడతానని అంటున్నాడు. కాగా, ఐపీఎల్​లో 103 మ్యాచ్​లు ఆడిన ఈ టాప్ బ్యాటర్ 2,485 రన్స్ చేశాడు. మరి.. స్మిత్ ఇంకా క్రికెట్​లో కొనసాగాలని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.