iDreamPost
android-app
ios-app

వీడియో: ఆస్ట్రేలియా ప్లేయర్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ!

  • Author Soma Sekhar Published - 09:58 PM, Mon - 20 November 23

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆసీస్ స్టార్ ప్లేయర్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? కోహ్లీ ఏం బహుమతి ఇచ్చాడు? ఆ వివరాలు..

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆసీస్ స్టార్ ప్లేయర్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? కోహ్లీ ఏం బహుమతి ఇచ్చాడు? ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 09:58 PM, Mon - 20 November 23
వీడియో: ఆస్ట్రేలియా ప్లేయర్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ!

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు టైటిళ్ల మీద టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ.. టీమిండియాకు మాత్రం వరల్డ్ కప్ ను అందించలేకపోయాడు. వరల్డ్ కప్పే కాదు.. భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీ కరవును తీర్చడంలో విఫలం అవుతూనే ఉన్నాడు. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరినప్పటికీ.. టైటిల్ ను మాత్రం ముద్దాడలేకపోయింది. కీలక పోరులో కంగారూ జట్టును ఓడించలేక చతికిలపడిపోయింది. స్వల్ప స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆసీస్ స్టార్ ప్లేయర్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయన్ని మరింతగా పెంపోందించేందుకు టీమిండియా ప్లేయర్లు ఎప్పుడూ ముందువరుసలో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. ఆసీస్ ప్లేయర్లను గొప్ప మనసుతో అభినందించారు. ఇక ఎప్పటికప్పుడు తన విభిన్న శైలిని చూపిస్తూ ఉండే విరాట్.. మరోసారి తన మంచి మనసును బయటపెట్టుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టిన ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు కింగ్ విరాట్ కోహ్లీ.

మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్లు ఇంటర్వ్యూలు ఇస్తుండగా.. కోహ్లీ తన జెర్సీతో మ్యాక్స్ వెల్ వద్దకు వచ్చి.. ఆ జెర్సీని మ్యాక్సీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో అతడు సంతోషంతో విరాట్ ను కౌగిలించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. కోహ్లీ, మ్యాక్స్ వెల్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఇక రన్ మెషిన్ కింగ్ కోహ్లీ.. ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 11 మ్యాచ్ ల్లో 3 శతకాలతో 765 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. మరి మ్యాక్స్ వెల్ కు కోహ్లీ గిఫ్ట్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.