iDreamPost

Shubman Gill: జింబాబ్వేతో తొలి T20.. భారత్​కు కొత్త ఓపెనింగ్ జోడీ! కన్ఫర్మ్ చేసిన గిల్!

  • Published Jul 05, 2024 | 9:39 PMUpdated Jul 05, 2024 | 9:39 PM

భారత జట్టు మరో ఇంట్రెస్టింగ్​ ఫైట్​కు రెడీ అవుతోంది. జింబాబ్వే టూర్​కు వెళ్లిన యంగ్ ఇండియా.. ఆ టీమ్​తో 5 టీ20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్​మన్ గిల్ ఇంట్రెస్టింగ్ అప్​డేట్ ఇచ్చాడు.

భారత జట్టు మరో ఇంట్రెస్టింగ్​ ఫైట్​కు రెడీ అవుతోంది. జింబాబ్వే టూర్​కు వెళ్లిన యంగ్ ఇండియా.. ఆ టీమ్​తో 5 టీ20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్​మన్ గిల్ ఇంట్రెస్టింగ్ అప్​డేట్ ఇచ్చాడు.

  • Published Jul 05, 2024 | 9:39 PMUpdated Jul 05, 2024 | 9:39 PM
Shubman Gill: జింబాబ్వేతో తొలి T20.. భారత్​కు కొత్త ఓపెనింగ్ జోడీ! కన్ఫర్మ్ చేసిన గిల్!

టీ20 ప్రపంచ కప్-2024 సందడి ఇంకా ముగియలేదు. ట్రోఫీతో స్వదేశానికి సగర్వంగా తిరిగొచ్చిన రోహిత్ సేనకు అభిమానులు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు. సొంత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ఆటగాళ్లంతా బిజీ అయిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీని కలవడం, ఆ తర్వాత ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించడం, వాంఖడే స్టేడియాన్ని సందర్శించడం.. ఇలా ఒక్కో ప్రోగ్రామ్​కు అటెండ్ అవుతూ హల్​చల్ చేస్తున్నారు. ఒకవైపు విక్టరీ సెలబ్రేషన్స్ ఇలా కంటిన్యూ అవుతున్న తరుణంలో భారత జట్టు మరో సిరీస్​కు సిద్ధమైపోయింది. శుబ్​మన్ గిల్ నాయకత్వంలోని యంగ్ ఇండియా జింబాబ్వే టూర్​కు వెళ్లింది. ప్రాక్టీస్​లో బిజీగా ఉన్న కుర్రాళ్లు.. రేపటి నుంచి టీ20 సిరీస్​లో జింబాబ్వేను ఢీకొట్టనున్నారు.

భారత్-జింబాబ్వే సిరీస్​లో భాగంగా 5 టీ20ల సిరీస్ శనివారం స్టార్ట్ అవుతుంది. హరారే మైదానంలో జరిగే మొదటి మ్యాచ్​తో సిరీస్​కు తెరలేవనుంది. ఈ మ్యాచ్​ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్​లో మన జట్టు ఎలాంటి ప్లానింగ్​తో ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్లు లేకుండా ఎలా ఆడుతుంది, జింబాబ్వేను క్లీన్​స్వీప్ చేస్తుందా అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అలాగే ఎలాంటి స్క్వాడ్​తో బరిలోకి దిగుతుందనేది కూడా ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ తరుణంలో కెప్టెన్ గిల్ ఓ విషయాన్ని బయటపెట్టాడు. తొలి టీ20లో కొత్త ఓపెనింగ్ జోడీ ఆడుతుందని తెలిపాడు. అరంగేట్ర ఆటగాడు అభిషేక్ శర్మతో కలసి తాను ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేస్తానని గిల్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ మధ్య కాలంలో భారత జట్టులో సీనియర్లు లేని సమయంలో శుబ్​మన్ గిల్​తో కలసి రుతురాజ్ గైక్వాడ్​ ఓపెనర్​గా ఆడుతున్నాడు. జింబాబ్వే సిరీస్​లోనూ కెప్టెన్​తో కలసి అతడే ఇన్నింగ్స్ మొదలుపెడతాడని అంతా భావించారు. అభిషేక్ శర్మను రెండు, మూడు మ్యాచ్​ల తర్వాత టీమ్​లోకి తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అప్పటివరకు గైక్వాడ్​ ఓపెనర్​గా దిగుతాడని కామెంట్లు వచ్చాయి. అయితే గిల్ మాత్రం తొలి మ్యాచ్​కు ముందే ఓపెనింగ్ జోడీపై స్పష్టత ఇచ్చాడు. అభిషేక్​తో కలసి తాను ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేస్తానని చెప్పడంతో రుతురాజ్​ బ్యాటింగ్ ఆర్డర్​లో కిందకు రావడం ఖాయంగా మారింది. అయితే అతడ్ని ఫస్ట్ డౌన్​లో ఆడిస్తారా? లేదా నాలుగో నంబర్​లో ఆడిస్తారా? అనేది చూడాలి. మరి.. టీమిండియా నయా ఓపెనింగ్ జోడీ అద్భుతాలు చేస్తుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి