iDreamPost
android-app
ios-app

గిల్​ను నమ్మి మోసపోయిన కోహ్లీ.. సాయం చేస్తాడనుకుంటే..!

  • Published Sep 20, 2024 | 7:48 PM Updated Updated Sep 20, 2024 | 7:48 PM

Virat Kohli, Shubman Gill, IND vs BAN: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. తోపు బౌలర్లను కూడా ఉతికిఆరేసే ఈ స్టార్​ను ఎలా ఆపాలా అని ప్రత్యర్థి జట్లు తలలు పట్టుకోవడం చూస్తూనే ఉన్నాం.

Virat Kohli, Shubman Gill, IND vs BAN: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. తోపు బౌలర్లను కూడా ఉతికిఆరేసే ఈ స్టార్​ను ఎలా ఆపాలా అని ప్రత్యర్థి జట్లు తలలు పట్టుకోవడం చూస్తూనే ఉన్నాం.

  • Published Sep 20, 2024 | 7:48 PMUpdated Sep 20, 2024 | 7:48 PM
గిల్​ను నమ్మి మోసపోయిన కోహ్లీ.. సాయం చేస్తాడనుకుంటే..!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. తోపు బౌలర్లను కూడా ఉతికిఆరేసే ఈ స్టార్​ను ఎలా ఆపాలా అని ప్రత్యర్థి జట్లు తలలు పట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. అంత సులువుగా ఎవరికీ వికెట్ అవ్వడు కింగ్. క్రీజులో సెటిల్ అయ్యాడంటే అవతలి జట్లకు చుక్కలు చూపిస్తాడు. బెస్ట్ బాల్స్ వేస్తే తప్ప అతడ్ని ఆపడం ఎవరి వల్లా కాదు. అలాంటోడు ఒకర్ని నమ్మి తన వికెట్ పారేసుకున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడాల్సినోడు.. ఉన్న పళంగా ఔటై పెవిలియన్​కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. క్లియర్​గా నాటౌట్ అయినా రివ్యూ తీసుకోలేదు కోహ్లీ. యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​ను నమ్మి మోసపోయాడు కింగ్. అసలేం జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

చెన్నై టెస్ట్​లో తొలి ఇన్నింగ్స్​లో ఫెయిల్ అయ్యాడు కోహ్లీ. 6 పరుగులే చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్​లో అయినా భారీగా పరుగులు చేస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే రెండో ఇన్నింగ్స్​ను బాగా స్టార్ట్ చేశాడు విరాట్. 37 బంతుల్లో 17 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు కొట్టి మంచి జోష్​లో కనిపించాడు. అతడి ఊపు చూస్తుంటే ఈజీగా సెంచరీ బాదుతాడని అనిపించింది. కానీ బంగ్లా స్పిన్నర్ మెహ్దీ హసన్ మిరాజ్ బౌలింగ్​లో అక్రాస్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఫుల్ లెంగ్త్​లో పడిన బంతి విరాట్ బ్యాట్​ను దాటి ప్యాడ్స్​కు తాకడంతో మిరాజ్ అప్పీల్ చేయగా.. అంపైర్ రిచర్డ్ కెటిల్​బరో వెంటనే ఔట్​గా ప్రకటించాడు. అయితే రివ్యూ కోసం శుబ్​మన్ గిల్​తో డిస్కస్ చేశాడు కింగ్. కానీ అది ఔట్, రివ్యూ వద్దని గిల్ చెప్పడంతో కోహ్లీ డీఆర్ఎస్ తీసుకోలేదు. నిరాశతో అతడు క్రీజును వీడాడు.

కోహ్లీ వెళ్లిపోయిన తర్వాత రీప్లేలో అతడు నాటౌట్ అని తేలింది. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నాకే బాల్ ప్యాడ్స్​కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంతా షాక్ అయ్యారు. విరాట్ రివ్యూ తీసుకోకుండా బయటకు వెళ్లిపోవడం, నాటౌట్ అని తేలడంతో డ్రెస్సింగ్ రూమ్​లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. రిజల్ట్ ఎలా ఉన్నా డీఆర్ఎస్ తీసుకుంటే ఒకవేళ పాజిటివ్​గా వస్తే టీమిండియాకు ప్లస్ పాయింట్ అయ్యేది. కోహ్లీ క్రీజులో ఉంటే భారీ టార్గెట్ సెట్ చేసేది. కానీ గిల్ మాట విని విరాట్ రివ్యూకు వెళ్లలేదు. దీంతో అసహనానికి లోనైన రోహిత్.. కోహ్లీ ఎందుకిలా చేశాడంటూ ఆశ్యర్యంలో మునిగిపోయాడు. మరోవైపు అంపైర్ కెటిల్​బరో నవ్వుల్లో మునిగిపోయాడు. ఇది చూసిన నెటిజన్స్.. గిల్ ఎంత పని చేశావంటూ సీరియస్ అవుతున్నారు. ఇక, రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. గిల్ (33 నాటౌట్), రిషబ్ పంత్ (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. కోహ్లీ ఔట్ విషయంలో గిల్ వ్యవహరించిన తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.