iDreamPost
android-app
ios-app

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వార్నర్ ఎంట్రీ? టాలీవుడ్ మూవీతో ఆడియెన్స్ ముందుకు!

  • Published Sep 20, 2024 | 6:57 PM Updated Updated Sep 20, 2024 | 6:57 PM

David Warner Ventures into Film Industry: స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవలే జెంటిల్మన్ గేమ్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రిటైర్మెంట్ తర్వాత అతడు ఏం చేస్తాడు? డేవిడ్ భాయ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అభిమానులు ఆలోచనల్లో పడ్డారు.

David Warner Ventures into Film Industry: స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవలే జెంటిల్మన్ గేమ్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రిటైర్మెంట్ తర్వాత అతడు ఏం చేస్తాడు? డేవిడ్ భాయ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అభిమానులు ఆలోచనల్లో పడ్డారు.

  • Published Sep 20, 2024 | 6:57 PMUpdated Sep 20, 2024 | 6:57 PM
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వార్నర్ ఎంట్రీ? టాలీవుడ్ మూవీతో ఆడియెన్స్ ముందుకు!

డేవిడ్ వార్నర్.. క్రికెట్​కు ఆస్ట్రేలియా అందించిన గొప్ప బ్యాటర్లలో ఒకడు. ఓపెనర్​గా బరిలోకి దిగి తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టేటోడు. టెస్టులు, టీ20, వన్డేలు.. ఇలా ఫార్మాట్ ఏదైనా ఒకే రకంగా ఆడటం వార్నర్ స్టైల్. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడటమే అతడికి తెలుసు. కెరీర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే తరహాలో ఆడుతూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించాడు. సొంత దేశం ఆసీస్​లో కంటే భారత్​లోనే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అతడి ఆటకే కాదు.. యాక్టింగ్​కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇండియన్ మూవీస్ ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్​కు సంబంధించిన రీల్స్​తో అతడు బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అవుతుండటం విశేషం. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రీసెంట్​గా క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు వార్నర్. దీంతో రిటైర్మెంట్ తర్వాత అతడు ఏం చేస్తాడు? డేవిడ్ భాయ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. ఈ తరుణంలో అతడు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడనే వార్త హల్​చల్ చేస్తోంది. అది కూడా ఓ టాలీవుడ్ ఫిల్మ్​తో అనేది మరింత ఇంట్రెస్టింగ్​గా మారింది. దీంతో వార్నర్ డెబ్యూ మూవీ ఏంటా అని అభిమానులు తెలుసుకునే పనిలో పడ్డారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఈ కంగారూ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తనకు బాగా పాపులారిటీ తీసుకొచ్చిన ‘పుష్ప’ సినిమాతో అతడు తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ‘పుష్ప 2’లో డేవిడ్ భాయ్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్​లో వినిపిస్తోంది. అందుకు వార్నర్ తాజా ఫొటో ఒకటి ఊతం ఇస్తోంది. ఈ ఫొటోలో చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్​గా నడుస్తూ కనిపించాడు ఆసీస్ మాజీ ఓపెనర్.

వైట్ కలర్ డ్రెస్​లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్న వార్నర్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అతడి చేతిలో గన్​ ఉంది. తుపాకీ పట్టుకొని అతడు సీరియస్​గా ఇచ్చిన స్టిల్స్ నెట్టింట బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. మూవీ షూటింగ్​లో భాగంగా తీసిన ఫొటోలు ఇవి అని అంటున్నారు. ‘పుష్ప 2’ మేకర్స్ వార్నర్​తో కొన్ని ఫొటోలు తీశారని.. ఇదే లుక్​లో అతడు మూవీలో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. వార్నర్ కూడా వీటిపై స్పందించలేదు. దీంతో బన్నీ చిత్రంలో డేవిడ్ భాయ్​ది సర్​ప్రైజ్​ రోల్​గా ప్లాన్ చేసి ఉంటారని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అప్పట్లో ‘పుష్ప’ సినిమా రీల్స్​తో తన క్రేజ్​ను పెంచుకున్న ఆసీస్ క్రికెటర్.. ఇప్పుడు అదే మూవీ సీక్వెల్​లో కనిపిస్తే ఆడియెన్స్ థ్రిల్​కు గురవ్వడం ఖాయం. మరి.. వార్నర్ ఇండస్ట్రీ డెబ్యూ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş