iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ పాక్​కు వస్తే ఆ విషయం మర్చిపోయేలా చేస్తాం.. అఫ్రిదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jul 11, 2024 | 10:07 PMUpdated Jul 11, 2024 | 10:07 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి పాకిస్థాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కింగ్​ను తమ దేశానికి ఆహ్వానించిన అఫ్రిదీ.. పాక్​కు వస్తే ఆ విషయం మర్చిపోక తప్పదన్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి పాకిస్థాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కింగ్​ను తమ దేశానికి ఆహ్వానించిన అఫ్రిదీ.. పాక్​కు వస్తే ఆ విషయం మర్చిపోక తప్పదన్నాడు.

  • Published Jul 11, 2024 | 10:07 PMUpdated Jul 11, 2024 | 10:07 PM
Virat Kohli: కోహ్లీ పాక్​కు వస్తే ఆ విషయం మర్చిపోయేలా చేస్తాం.. అఫ్రిదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్​బేస్, క్రేజ్ గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన బ్యాటింగ్, సూపర్బ్ ఫీల్డింగ్, అగ్రెసివ్​ యాటిట్యూడ్​తో కోట్లాది మందికి అతడు ఫేవరెట్ క్రికెటర్ అయిపోయాడు. క్రికెట్ చూసే ఆడియెన్స్​తో పాటు గ్రౌండ్​లోకి దిగి మ్యాచుల్లో ఆడే చాలా మంది ప్లేయర్లకూ అతడు ఆరాధ్య ఆటగాడిగా మారాడు. దాయాది దేశం పాకిస్థాన్​లోనూ కింగ్​కు హ్యూజ్​ ఫ్యాన్​బేస్ ఉంది. ఈ విషయం ఎన్నోమార్లు ప్రూవ్ అయింది. పాక్ జట్టు ఆడే మ్యాచులు, అలాగే పీఎస్​ఎల్ టైమ్​లోనూ అక్కడి స్టేడియాల్లో అభిమానులు కోహ్లీ ఫొటోలు, బ్యానర్లతో హల్​చల్ చేయడం చూసే ఉంటారు. ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీని మించినోడు లేడంటూ ప్రశంసించడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

తాజాగా మరో పాక్ క్రికెటర్ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడ్ని వాళ్ల దేశానికి కూడా ఆహ్వానించాడు. అతడే దిగ్గజ ఆల్​రౌండర్ షాహిద్ అఫ్రిదీ. కోహ్లీ గ్రేట్ బ్యాటర్ అంటూ మెచ్చుకున్నాడతను. విరాట్​కు పాక్​లో సూపర్ ఫ్యాన్​బేస్ ఉందన్నాడు. అతడు తమ దేశానికి కచ్చితంగా రావాలన్నాడు. పాక్​కు వస్తే ఆతిథ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పాడు అఫ్రిదీ. తమ అతిథి మర్యాదలతో భారత్​ ఆతిథ్యాన్ని కూడా కోహ్లీ మర్చిపోవాల్సిందేనని తెలిపాడు. అతడు పాక్​కు ఎప్పుడు వస్తాడా అంటూ అక్కడి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని, అలా వెయిట్ చేస్తున్న వారిలో తానూ ఉన్నానంటూ విరాట్​ గురించి నెక్స్ట్ లెవల్​లో హైప్ ఇచ్చాడు అఫ్రిదీ.

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే సెక్యూరిటీ రీజన్స్​తో పాటు దౌత్యపరమైన కారణాల వల్ల ఆ దేశానికి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. కావాలంటే తమ మ్యాచుల్ని దుబాయ్ లేదా శ్రీలంకలో హైబ్రిడ్ పద్ధతిన నిర్వహించాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎలాగైనా పాక్​కు రప్పించాలని అనుకుంటున్నారు ఆ దేశ మాజీలు. అందుకే తాజాగా కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లందర్నీ అఫ్రిదీ అక్కడికి రమ్మంటూ ఆహ్వానించాడు. రాజకీయాలతో ఆటను ముడిపెట్టొద్దని కోరాడు. భారత జట్టును తాము గౌరవిస్తామన్నాడు. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని.. అతడు టీ20ల నుంచి రిటైర్ అవ్వడం తనకు నచ్చలేదన్నాడు. మరి.. అతిథి మర్యాదలతో కోహ్లీ తన  సొంత దేశాన్ని మర్చిపోయేలా చేస్తామంటూ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి