iDreamPost
android-app
ios-app

బిగ్​బాస్ 8​లోకి టీమిండియా క్రికెటర్.. ఇది మామూలు స్కెచ్ కాదు!

  • Published Jul 11, 2024 | 9:21 PMUpdated Jul 11, 2024 | 9:21 PM

Bigg Boss Telugu 8: బిగ్​బాస్​ రియాలిటీ షో తెలుగులో ఎంత బాగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వస్తోందంటే చాలు.. ఆడియెన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అలాగే షో ముగిశాక నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు.

Bigg Boss Telugu 8: బిగ్​బాస్​ రియాలిటీ షో తెలుగులో ఎంత బాగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వస్తోందంటే చాలు.. ఆడియెన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అలాగే షో ముగిశాక నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు.

  • Published Jul 11, 2024 | 9:21 PMUpdated Jul 11, 2024 | 9:21 PM
బిగ్​బాస్ 8​లోకి టీమిండియా క్రికెటర్.. ఇది మామూలు స్కెచ్ కాదు!

బిగ్​బాస్​ రియాలిటీ షో తెలుగులో ఎంత బాగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వస్తోందంటే చాలు.. ఆడియెన్స్ టీవీలకు అతుక్కుపోతారు. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఎన్నో సంచలనాలతో పాటు పలు వివాదాలకు కూడా ఈ షో వేదికగా నిలిచింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు సినీ రంగం, టెలివిజన్ రంగానికి చెందిన వారు కావడంతో అందరి ఫోకస్ షో మీదే ఉంటోంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లు కూడా పాల్గొనడంతో రేటింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్​బాస్.. త్వరలో ఎనిమిదో సీజన్​లోకి అడుగుపెట్టనుంది. ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ గురించి రోజుకు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.

ఈసారి కంటెస్టెంట్స్​ను బిగ్​బాస్ టీమ్ ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా కాకుండా షో చూసే ఆడియెన్స్​కు ఫుల్ మీల్స్​లా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో ఏకంగా ఓ టీమిండియా క్రికెటర్​ను కంటెస్టెంట్​గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. భారత జట్టు తరఫున అద్భుతంగా ఆడుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడును షోలోకి తీసుకొచ్చేందుకు బిగ్​బాస్ టీమ్ ట్రై చేస్తోందని సమాచారం. గ్రౌండ్​లోనే కాదు బయట కూడా కాస్త దూకుడుగా ఉండే అతడ్ని షోలోకి తీసుకొస్తే కంటెంట్​కు కొరత ఉండదని బిగ్​బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. రాయుడు ఉంటే తెలుగుతో పాటు యూనివర్సల్ అప్పీల్ కూడా ఉంటుందనేది వాళ్ల ఆలోచన అని తెలుస్తోంది.

రాయుడు ఓకే అంటే ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకైనా బిగ్​బాస్ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే డబ్బుల కోసమైతే అతడు షోను ఓకే అనే ఛాన్స్ లేదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. టీమిండియాతో పాటు ఐపీఎల్​లో ఆడుతూ బాగానే సంపాదించిన ఈ మాజీ క్రికెటర్.. ఈ మధ్యే కామెంట్రీ కూడా స్టార్ట్ చేశాడు. అలాగే రిటైర్ అయ్యాడు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్స్​లో ఆడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు రాజకీయాల మీద కూడా అతడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కాదని.. బిగ్​బాస్ షోకు రాయుడు రావడం కష్టమేనని చెబుతున్నారు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప అతడు ఓకే చెప్పకపోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అతడు షోలోకి వస్తే మాత్రం అదిరిపోతుందని అంటున్నారు. మరి.. రాయుడును బిగ్​బాస్ షోలో చూడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి