ICC ర్యాంకింగ్స్​లో టీమిండియా డామినేషన్.. టాప్​-10లో ముగ్గురు మనోళ్లే!

India Dominate Top 10 Of ICC Test Rankings: ప్రస్తుత క్రికెట్​లో భారత జట్టు హవా నడుస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ డామినేట్ చేస్తున్న టీమిండియా.. ఆ విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. మన ప్లేయర్ల జోరు మామూలుగా లేదు.

India Dominate Top 10 Of ICC Test Rankings: ప్రస్తుత క్రికెట్​లో భారత జట్టు హవా నడుస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ డామినేట్ చేస్తున్న టీమిండియా.. ఆ విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. మన ప్లేయర్ల జోరు మామూలుగా లేదు.

ప్రస్తుత క్రికెట్​లో టీమిండియా హవా నడుస్తోంది. ఫార్మాట్ ఏదైనా మెన్ ఇన్ బ్లూ బరిలోకి దిగనంత వరకే అన్న రేంజ్​లో మనోళ్ల ఆటతీరు ఉంది. వన్డేల్లో గతేడాది వరల్డ్ కప్​లో ఫైనల్​కు వెళ్లింది భారత్. లాంగ్ ఫార్మాట్​లో ఇప్పటివరకు జరిగిన రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్స్​లోనూ ఫైనల్స్​కు దూసుకెళ్లింది. ఈ రెండు ఫార్మాట్లలో కప్పు కొట్టలేదు. కానీ ఈ ఏడాది జరిగిన పొట్టి ప్రపంచ కప్​లో ఛాంపియన్​గా నిలిచింది. అలా అన్నింటా చెలరేగుతున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్​లోనూ హవా నడిపిస్తోంది. అటు వన్డేలతో పాటు ఇటు టెస్టు ర్యాంకింగ్స్​లోనూ మనోళ్లు డామినేషన్ చూపిస్తున్నారు. టాప్​-10లో ముగ్గురు భారత ఆటగాళ్లే ఉన్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

ఐసీసీ తాజాగా టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. ఇందులో టాప్​-10లో ముగ్గురు ఆటగాళ్లు భారత్​ నుంచే ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 6వ ర్యాంక్​లో ఉండగా.. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంతకుముందు వరకు 8వ ర్యాంక్​లో ఉన్న జైస్వాల్ ఒక ర్యాంక్ మెరుగుపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. కోహ్లీ పదో నంబర్ నుంచి రెండు ర్యాంకులు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి జంప్ చేశాడు. టెస్టు బ్యాటర్స్ ర్యాంకింగ్స్​లో ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ (881 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (859 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం ఏకంగా ఆరు స్థానాలు దిగజారి 9వ ర్యాంక్​కు పడిపోయాడు.

ఇక, టెస్ట్ ఆల్​రౌండర్స్ ర్యాంకింగ్స్​లో భారత సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా (444 పాయింట్లు) టాప్​ ప్లేస్​లో కంటిన్యూ అవుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో మరో టీమిండియా వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ (322) కొనసాగుతున్నాడు. అటు టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్​లోనూ అశ్విన్ హవా నడుస్తోంది. 870 పాయింట్లతో అతడు టాప్ ప్లేస్​లో ఉన్నాడు. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా (847 పాయింట్లు) మూడో నంబర్​లో ఉన్నాడు. జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు. ఇలా దాదాపుగా అన్ని ఫార్మాట్ల బ్యాటింగ్, బౌలింగ్, ఆల్​రౌండర్స్ ర్యాంకింగ్స్​లో భారత్ డామినేషన్ నడుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. మన టైమ్ నడుస్తోందని, ఇక టీమిండియాకు ఎదురులేదని అంటున్నారు. భారత్​తో పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందేనని చెబుతున్నారు. మరి.. టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్​లో టాప్​-10లో ముగ్గురు మనోళ్లే ఉండటంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments