Nidhan
Virat Kohli To Partner Babar Azam: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కలసి ఆడితే చూడాలని ఉందా? త్వరలో ఆ రోజు రానుంది. ఇద్దరూ ఒకే టీమ్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Virat Kohli To Partner Babar Azam: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కలసి ఆడితే చూడాలని ఉందా? త్వరలో ఆ రోజు రానుంది. ఇద్దరూ ఒకే టీమ్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Nidhan
క్రికెట్‌కు టీమిండియా అందించిన అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మోడర్న్ గ్రేట్‌గా ప్రశంసలు అందుకుంటున్న కోహ్లీ చూడని విజయం లేదు, సాధించని రికార్డు లేదు. అంతగా ప్రస్తుత క్రికెట్లో అతడి డామినేషన్ నడుస్తోంది. అతడితో కంపారిజన్కు వచ్చే ఆటగాడే లేడు. అయినా దాయాది పాకిస్థాన్ జట్టు అభిమానులు మాత్రం ఆ టీమ్ బ్యాటర్ బాబర్ ఆజం తోపు అని అంటుంటారు. పాక్ సీనియర్లు కూడా కోహ్లీ కంటే బాబర్ గ్రేట్ అంటూ చెత్త వాదనలకు దిగుతుంటారు. భారత ఫ్యాన్స్ వాళ్లకు ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తుంటారు అది వేరే విషయం అనుకోండి. ఇలా అభిమానుల మధ్య ఫైట్స్ జరగడం కామన్. అయితే కోహ్లీ-బాబర్ మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉంది. వీళ్లు గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ ప్రత్యర్థుల్లా తలపడినా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ హుందాగా నడుచుకుంటారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్లు కలసి ఒకే టీమ్ తరఫున బరిలోకి దిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా.. పాకిస్థాన్ స్టార్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదీ, మహ్మద్ రిజ్వాన్ తదితరులు త్వరలో ఒకే టీమ్ తరఫున ఆడే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు మంచి సక్సెస్ అయిన ఆఫ్రో-ఆసియా కప్‌ను పునరుద్ధరించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోందని సమాచారం. 2005, 2007లో నిర్వహించిన ఈ టోర్నమెంట్స్‌కు ఆడియెన్స్, ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. అయితే పలు అనివార్య కారణాల వల్ల దీన్ని నిలిపివేశారు. ఆసియా దేశాల క్రికెటర్స్ ఒక టీమ్‌గా, ఆఫ్రికా ఆటగాళ్లంతా కలసి మరో జట్టుగా ఏర్పడి ఈ టోర్నీలో పోటీపడేవారు. అప్పట్లో భారత్, పాక్ నుంచి చాలా మంది ప్రముఖ ఆటగాళ్లు ఈ టోర్నీలో మెరిశారు.
వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే, ఇంజమామ్ ఉల్ హక్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది ఆసియా టీమ్‌కు కలసి ఆడారు. ఆఫ్రికా టీమ్ తరఫున షాన్ పొలాక్, తతేంద తైబు, జాక్వెస్ కలిస్ లాంటి ప్లేయర్లు ఆడారు. ఈ టోర్నమెంట్‌ను మళ్లీ స్టార్ట్ చేయాలని 2022లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉన్న బీసీసీఐ సెక్రెటరీ జైషా అప్పటి ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ఏసీసీ) ప్రెసిడెంట్ సుమోద్ దామోదర్‌తో చర్చలు జరిపారు. ఏసీసీ డెవలప్మెంట్ హెడ్ మహింద వల్లిపురంతోనూ ఆయన సంప్రదింపులు జరిపారు. అదే మహింద ఐసీసీ బోర్డు మెంబర్‌గా తిరిగి ఎన్నికవడం, షా ఐసీసీ ఛైర్మన్ అవ్వడంతో ఆఫ్రో-ఆసియా కప్ నిర్వహణ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ టోర్నీని నిర్వహించే ఛాన్స్ ఉందని గట్టిగా వినిపిస్తోంది. అదే నిజమైతే బాబర్, కోహ్లీ, రోహిత్, షాహిన్ అఫ్రిదీ లాంటి భారత్-పాక్ స్టార్లు కలసి ఆడటం ఖాయంగా చెప్పొచ్చు. ఇది తెలిసిన నెటిజన్స్.. ఆజామూ నీ లక్ బాగుంది, కోహ్లీతో ఆడే ఛాన్స్ కొట్టేసేలా ఉన్నావని అంటున్నారు. మరి.. కోహ్లీ-బాబర్ ఒకే టీమ్ తరఫున ఆడితే చూడాలని భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.