iDreamPost
android-app
ios-app

బంగ్లా సిరీస్​కు ముందు రోహిత్​కు కొత్త తలనొప్పి! ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో?

  • Published Sep 11, 2024 | 8:02 PM Updated Updated Sep 11, 2024 | 8:02 PM

Rohit Sharma, KL Rahul, Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. బంగ్లాదేశ్ సిరీస్​కు ముందే దీన్ని అతడు పరిష్కరించాలి. హిట్​మ్యాన్ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.

Rohit Sharma, KL Rahul, Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. బంగ్లాదేశ్ సిరీస్​కు ముందే దీన్ని అతడు పరిష్కరించాలి. హిట్​మ్యాన్ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.

  • Published Sep 11, 2024 | 8:02 PMUpdated Sep 11, 2024 | 8:02 PM
బంగ్లా సిరీస్​కు ముందు రోహిత్​కు కొత్త తలనొప్పి! ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్ని వారాలు రెస్ట్ తీసుకున్నాడు. నేషనల్ డ్యూటీ లేకపోవడంతో ఫ్యామిలీతో కలసి టైమ్ స్పెండ్ చేశాడు. అయితే బంగ్లాదేశ్ సిరీస్​కు సమయం దగ్గర పడుతుండటంతో హిట్​మ్యాన్​ తన ప్లానింగ్ మొదలుపెట్టేశాడు. ఫిట్​నెస్ ఇంప్రూవ్ చేసుకునేందుకు ఈ టైమ్​ను బాగా యూజ్ చేసుకున్నాడు. బంగ్లా సిరీస్​ 19వ తేదీ నుంచి మొదలవనుంది. కానీ భారత జట్టు 12వ తేదీ నుంచి ప్రాక్టీస్​లో మునిగిపోనుంది. బంగ్లాను లైట్ తీసుకోవడం లేదు హిట్​మ్యాన్. అందుకే గట్టి టీమ్​ కావాలని పట్టుబట్టి సెలెక్ట్ చేయించాడు. నెట్ సెషన్స్ కూడా ముందే మొదలయ్యేలా ప్లాన్ చేశాడు. ఓవరాక్షన్ చేసే బంగ్లాను చిత్తు చిత్తుగా ఓడించేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ తరుణంలో అతడికి ఓ కొత్త తలనొప్పి మొదలైంది.

బంగ్లాదేశ్​తో జరిగే టెస్ట్ సిరీస్​కు జట్టు అన్ని విధాలుగా ప్రిపేర్డ్​గా ఉండేలా చూసుకుంటున్నాడు రోహిత్. అందుకోసం కోచ్ గౌతం గంభీర్​తో కలసి తగిన ప్లానింగ్ చేస్తున్నాడు. ఇటీవల పాకిస్థాన్​ను పాకిస్థాన్​లో వైట్​వాష్ చేసింది బంగ్లా. అందుకే ఆ టీమ్​ను లైట్ తీసుకోకుండా, చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో దూకుడుగా వెళ్తున్నాడు రోహిత్. రెస్ట్ మోడ్​లో ఉన్న స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రాను కూడా ఈ సిరీస్​లో దింపుతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. ఇలా అన్ని విభాగాలు పటిష్టంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అంతా బాగానే ఉన్నా కేఎల్ రాహుల్ విషయంలో హిట్​మ్యాన్​కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. బంగ్లాతో సిరీస్​లో రాహుల్​ను టీమ్​లోకి తీసుకోవాలా? లేదా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్​ను ఆడించాలా? అనేది అర్థం కాకుండా ఉంది.

బంగ్లాతో సిరీస్​లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్​లో దాదాపుగా అన్ని ప్లేసెస్ ఫిక్స్ అయిపోయాయి. అయితే మిడిలార్డర్​లో ఓ స్పాట్ కోసం రాహుల్-సర్ఫరాజ్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో నుంచి రాహుల్​ తప్పుకోవడంతో అతడి ప్లేస్​లో సర్ఫరాజ్​ను ఆడించారు. డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపి కసి మీద ఉన్న అతడు ఇంగ్లండ్ సిరీస్​లో 3 టెస్టుల్లో 200 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్​కు దిగి మంచి ఇన్నింగ్స్​లతో తన బ్యాటింగ్ రేంజ్ ఏంటో అతడు ప్రూవ్ చేశాడు. అటు టెస్ట్ టీమ్​లోకి కమ్​బ్యాక్ ఇచ్చిన రాహుల్ దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్​లో రెండు మంచి నాక్స్ ఆడాడు. క్లిష్ట సమయంలో ఒక హాఫ్ సెంచరీ బాది తనలో పస ఇంకా తగ్గలేదని నిరూపించాడు.

అటు సర్ఫరాజ్, ఇటు రాహుల్ ఇద్దరూ మంచి ఫామ్​లో ఉండటం.. కష్ట సమయాల్లో టీమ్​ను ఆదుకునే ఇన్నింగ్స్​లు ఆడటంలో ఎక్స్​పర్ట్స్ కావడంతో ఉన్న ఒక్క స్పాట్ కోసం ఎవర్ని తీసుకోవాలో రోహిత్​కు అర్థం కావడం లేదు. 50 టెస్టులు ఆడిన రాహుల్​ను తీసుకోకపోతే విమర్శలు తప్పవు. బాగా ఆడుతున్న సర్ఫరాజ్​కు చోటు ఇవ్వకపోయినా కష్టంగానే ఉంది. అందుకే ఏం చేయాలో హిట్​మ్యాన్​కు పాలుపోవడం లేదు. పోనీ ఇద్దర్నీ తీసుకుందామంటే శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్​లో ఎవర్నీ పక్కకు జరిపేందుకు ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లాతో ఫస్ట్ టెస్ట్​లో టీమ్ కాంబినేషన్ విషయంలో డైలమా ఏర్పడింది. దీన్ని రోహిత్, కోచ్ గంభీర్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. మరి.. సర్ఫరాజ్-రాహుల్​లో ఎవర్ని ఆడిస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.