కోహ్లీ 50 సెంచరీల రికార్డు కూడా బ్రేక్ చేయొచ్చా? అతనికే సాధ్యం?

  • Author singhj Published - 03:22 PM, Thu - 16 November 23

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అరుదైన వన్డే సెంచరీల రికార్డును కింగ్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ వారసుడు ఎవరు? అతడి రికార్డును బ్రేక్ చేసే క్రికెటర్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అరుదైన వన్డే సెంచరీల రికార్డును కింగ్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ వారసుడు ఎవరు? అతడి రికార్డును బ్రేక్ చేసే క్రికెటర్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

  • Author singhj Published - 03:22 PM, Thu - 16 November 23

న్యూజిలాండ్​తో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ అనగానే అందర్నీ భయం పట్టేసింది. మన టీమ్ లీగ్ దశలో వరుసగా 9 విజయాలు సాధించినప్పటికీ కివీస్​తో నాకౌట్ మ్యాచ్ అంత ఈజీ కాదనే కామెంట్లు వినిపించాయి. సెమీస్ అంటే ఉండే సహజమైన ఒత్తిడి, టెన్షన్ మధ్య మ్యాచ్​లో గెలవడం చాలా కష్టమని భారత అభిమానులు ఫిక్స్ అయ్యారు. గత రికార్డులు కూడా ప్రత్యర్థి టీమ్​కే అనుకూలంగా ఉండటంతో ఈ గండాన్ని దాటగలమా అనే అనుమానాలు వచ్చాయి. అందుకు తగ్గట్లే బుధవారం వాంఖడేలో న్యూజిలాండ్ టీమ్ ఆఖరి వరకు ఎడతెగని పోరాటం చేసింది. టీమిండియా దాదాపు నాలుగొందల టార్గెట్ నిలిపినా.. స్టార్టింగ్​లోనే రెండు వికెట్లు పడగొట్టి గట్టి దెబ్బ తీసినా.. అపోజిషన్ టీమ్ అంత తేలిగ్గా లొంగలేదు.

రోహిత్ సేనను ప్రెజర్​లోకి నెడుతూ.. కివీస్ కొండంత లక్ష్యం వైపు కసిగా అడుగులేస్తూ పోయింది. అయితే అప్పుడు బౌలింగ్​కు వచ్చిన మహ్మద్ షమి నిమిషాల్లోనే మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడు. సెమీస్​ పోరులో ఏకంగా 7 వికెట్లు తీసిన షమి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అంతకుముందు బ్యాటింగ్​లోనూ మనోళ్లు దుమ్మురేపారు. రోహిత్ శర్మ (47), శుబ్​మన్ గిల్ (80) అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ అయ్యర్ (105) టీమ్ భారీ స్కోరు సాధించడంలో మెయిన్ రోల్ పోషించారు. ఆఖర్లో కేఎల్ రాహుల్ (39) ధనాధన్ ఇన్నింగ్స్​తో అలరించాడు. 50వ వన్డే సెంచరీతో చరిత్ర సృష్టిస్తూ భారత ఇన్నింగ్స్​కు మూలస్తంభంలా వ్యవహరించాడు కోహ్లీ. అతడు ఒక ఎండ్​లో పాతుకపోవడంతో మరో ఎండ్​లో అయ్యర్ భారీ షాట్లతో న్యూజిలాండ్​పై విరుచుకుపడ్డాడు.

వరల్డ్ కప్ లీగ్ స్టేజ్​లో డామినేషన్ ప్రదర్శించిన టీమ్ సెమీస్ గెలవలేదన్న సెంటిమెంట్​ను ఈ విజయంతో మార్చింది భారత్. ఇక నాకౌట్ మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్ కోహ్లీ బ్యాటింగ్ సమ్​థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. క్రికెట్ ఫ్యాన్స్ దేవుడిగా పిలుచుకునే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డునే బ్రేక్ చేశాడు కోహ్లీ. ఏకంగా 50వ సెంచరీ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఫ్యూచర్​లో ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొడతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే సత్తా ఒక ప్లేయర్​కు ఉందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అతనే భారత యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్. తక్కువ టైమ్​లోనే మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్​గా మారిన గిల్.. టీమ్​లో తన ప్లేస్​ను ఫిక్స్ చేసుకున్నాడు.

సెమీస్ సహా మెగాటోర్నీలోని చాలా మ్యాచుల్లో అద్భుతంగా ఆడుతూ వస్తున్నాడు గిల్. వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకును కూడా సొంతం చేసుకున్న ఈ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును ఎప్పటికైనా బద్దలు కొడతాడని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. చాలా టీమ్స్ వన్డేలు ఆడటం తగ్గించుకుంటున్నప్పటికీ భారత్ మాత్రం టీ20, టెస్టులతో పాటు వన్డే సిరీస్​లు కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. గిల్​ ఇంకా సుదీర్ఘ కాలం ఆడగలడు కాబట్టి ఈ తరం క్రికెటర్లలో అతనొక్కడికే కోహ్లీ 50 సెంచరీల రికార్డును బ్రేక్ చేసే సత్తా ఉందని అంటున్నారు. అయితే విరాట్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. మరో మూడేళ్ల వరకు అతడు వన్డేల్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాబట్టి 60కి పైగా వన్డే సెంచరీలు చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని సెంచరీలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి.. విరాట్ రికార్డును గిల్ బ్రేక్ చేస్తాడనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్’.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Show comments