వరల్డ్ కప్ లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనకు ఫిదా అయిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి యోగి సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనకు ఫిదా అయిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి యోగి సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహ్మద్ షమీ.. ఇప్పుడీ పేరు వరల్డ్ క్రికెట్ లో ట్రెండింగ్. ప్రపంచ కప్ లో తన అద్భుత ప్రదర్శనతో సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ స్టార్ పేసర్. ఓ వైపు ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డులను బద్దలు కొడుతూనే, టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్లు తీసి భారత జట్టుకు అదిరిపోయే గెలుపును కట్టబెట్టాడు. దీంతో ఇతడి బౌలింగ్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలతో పాటుగా, క్రికెట్ ఫ్యాన్స్.. భారత సినీ, రాజకీయ ప్రముఖులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో షమీ అద్భుత ప్రదర్శనకు ఫిదా అయిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి యోగి సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా స్టార్ పేసర్, వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ షమీ ఆటకు ఫిదా అయ్యాడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. దీంతో అతడికి కానుక ఇచ్చేందుకు యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని షమీ సొంత ఊరు అయిన అలీనగర్ అనే మారుమూల గ్రామంలో మినీ క్రికెట్ స్టేడియంతో పాటుగా జిమ్ ను నిర్మించేందుకు యోగి సర్కార్ ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అమ్రోహా జిల్లా కలెక్టర్ రాజేష్ త్యాగి, అధికారుల బృందం శుక్రవారం(నవంబర్ 17)న అలీనగర్ గ్రామంలో పర్యటించారు.
ఈ క్రమంలోనే అక్కడ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. గ్రౌండ్ నిర్మించేందుకు భూమి చాలానే ఉందని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20 స్టేడియాలు నిర్మించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అమ్రోహా జిల్లాలో స్టేడియం నిర్మించేందుకు మహ్మద్ షమీ సొంత ఊరు అలీనగర్ ను ఎంపిక చేశామని కలెక్టర్ రాజేష్ త్యాగి తెలిపారు. దీంతో ఈ విషయం తెలిసిన వారందరూ ఇది కదా అసలు గెలపు అంటూ షమీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఇదిలా ఉండగా.. షమీ తన స్వగ్రామంలో తాను ప్రాక్టీస్ చేసేందుకు తన సొంత డబ్బుతో క్రికెట్ పిచ్ తయ్యారు చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3 రకాల పిచ్ లను సొంత భూమిలో రెడీ చేయించాడు. జట్టుకు దూరంగా ఉన్న టైమ్ లో ఇక్కడే కఠోర సాధన చేసి.. ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఆడిన 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు తీసి.. వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరి పడిలేచిన కెరటంలా విజృంభిస్తున్న షమీ ప్రదర్శనపై,యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
UP CM Yogi Adityanath to make cricket stadium in Mohammed Shami’s village, Massive move by UP govt
Local administration team visited his village today for the inspection of the areapic.twitter.com/1FXoJRK63x
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 17, 2023