Nidhan
ఆఖరి మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్‌ను ఇంటికి పంపింది పసికూన యూఎస్ఏ. తమ అభిమాన జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించడంతో దాయాది ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇదంతా స్వయంకృతాపరాధమే అంటూ ఆటగాళ్లను నిందిస్తున్నారు.
ఆఖరి మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్‌ను ఇంటికి పంపింది పసికూన యూఎస్ఏ. తమ అభిమాన జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించడంతో దాయాది ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇదంతా స్వయంకృతాపరాధమే అంటూ ఆటగాళ్లను నిందిస్తున్నారు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో ఎవ్వరూ ఊహించనివి జరుగుతున్నాయి. పసికూన జట్లు అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంటే.. టాప్ టీమ్స్ మాత్రం దారుణ పరాజయాలతో ఇంటిదారి పడుతున్నాయి. స్లో, ట్రిక్కీ పిచ్‌లపై ఎలా ఆడాలో తెలియక మహామహా జట్లు కూడా మట్టికరవడం చూస్తున్నాం. ఇప్పటికే ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్‌తో పాటు క్రికెట్లో ఎంతో ఘన చరిత్ర కలిగిన శ్రీలంక ఇంటిదారి పట్టగా.. ఇప్పుడు దాయాది పాకిస్థాన్ కూడా అదే కోవలో చేరింది. పొట్టి కప్పు నుంచి పాక్ నిష్క్రమించింది. పసికూన అమెరికా సూపర్-8కు క్వాలిఫై అయింది. గ్రూప్-ఏలో భాగంగా ఫ్లోరిడా వేదికగా యూఎస్ఏకు, ఐర్లాండ్‌కు మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు టీమ్స్‌కు ఒక్కో పాయింట్ ఇచ్చారు. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధించింది ఆతిథ్య అమెరికా.
మూడు మ్యాచుల్లో ఒక విక్టరీ మాత్రమే కొట్టిన పాకిస్థాన్ రెండు పాయింట్లతో ఉంది. ఈ నెల 16న ఐర్లాండ్‌తో ఆ టీమ్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ అందులో నెగ్గినా దాయాది ఖాతాలో నాలుగు పాయింట్లే ఉంటాయి. దీంతో ఐర్లాండ్‌తో మ్యాచ్ ఆ జట్టుకు నామమాత్రంగా మారనుంది. యూఎస్ఏ తమ ఆఖరి మ్యాచ్ ఆడకుండానే పాక్‌ను ఇంటికి పంపింది. ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దవడంతో ఆ టీమ్ డబుల్ జాక్‌పాట్ కొట్టింది. టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8 స్టేజ్‌కు క్వాలిఫై అయిన ఏడో అసోసియేట్ టీమ్‌గా అగ్రరాజ్యం చరిత్ర సృష్టించింది. ఇంతకముందు వరల్డ్ కప్-2009లో ఐర్లాండ్, నెదర్లాండ్స్ (2014), ఆఫ్ఘానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021), నెదర్లాండ్స్ (2022) సూపర్-8 స్టేజ్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు వాటి సరసన యూఎస్ఏ చేరింది.
ప్రపంచ కప్-2024లో సూపర్-8కు చేరిన అమెరికా.. మరో ఘనత కూడా సాధించింది. వచ్చే టీ20 వరల్డ్ కప్-2026కు ఆ జట్టు క్వాలిఫై అయింది. ప్రస్తుత పొట్టి కప్పులో సూపర్-8కు చేరిన టీమ్స్ వచ్చే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. నెక్స్ట్ వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో సూపర్-8 దశతో సంబంధం లేకుండా ఆతిథ్య దేశాలుగా ఈ రెండూ క్వాలిఫై అవుతాయి. ప్రస్తుత ప్రపంచ కప్‌లో టీమిండియా ఇప్పటికే సూపర్ పోరుకు అర్హత సాధించింది. కానీ లంక మాత్రం గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టు వచ్చే పొట్టి కప్పు కోసం క్వాలిఫికేషన్ మ్యాచులు ఆడాల్సి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ హోస్టింగ్ నేషన్ కాబట్టి ఆ టీమ్ నేరుగా మెగా టోర్నీలో బరిలో దిగనుంది. మరి.. అమెరికా సూపర్-8కు చేరుకోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
THE USA ARE COMING TO INDIA…!!! 🇮🇳
– USA qualified for the 2026 T20 World Cup in India and Sri Lanka. pic.twitter.com/dfOIuSOQUu
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2024