iDreamPost
android-app
ios-app

Hardik-Gambhir: వరల్డ్ కప్ హీరో హార్దిక్​కు అన్యాయం.. అతడికి శాపంగా గంభీర్ నిర్ణయం!

  • Published Jul 17, 2024 | 10:07 AMUpdated Jul 17, 2024 | 10:07 AM

వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా ఇంకా సెలబ్రేషన్ మూడ్​లోనే ఉన్నాడు. పొట్టి కప్పు తర్వాత విక్టరీ పరేడ్​లో పాల్గొన్న స్టార్ ఆల్​రౌండర్.. అనంతరం అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకతో బిజీ అయిపోయాడు.

వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా ఇంకా సెలబ్రేషన్ మూడ్​లోనే ఉన్నాడు. పొట్టి కప్పు తర్వాత విక్టరీ పరేడ్​లో పాల్గొన్న స్టార్ ఆల్​రౌండర్.. అనంతరం అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకతో బిజీ అయిపోయాడు.

  • Published Jul 17, 2024 | 10:07 AMUpdated Jul 17, 2024 | 10:07 AM
Hardik-Gambhir: వరల్డ్ కప్ హీరో హార్దిక్​కు అన్యాయం.. అతడికి శాపంగా గంభీర్ నిర్ణయం!

వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా ఇంకా సెలబ్రేషన్ మూడ్​లోనే ఉన్నాడు. పొట్టి కప్పు తర్వాత విక్టరీ పరేడ్​లో పాల్గొన్న స్టార్ ఆల్​రౌండర్.. అనంతరం అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకతో బిజీ అయిపోయాడు. అనంత్ అంబానీ మ్యారేజ్ ఈవెంట్ ముగిశాక సొంతూరైన వడోదరకు పయనమయ్యాడు పాండ్యా. భారత జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్​కు వడోదర ప్రజలు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు. జాతీయ జెండాలు చేతపట్టి వేలాది మంది అతడికి స్వాగతం పలికారు. ఓపెన్ బస్​లో ఫ్యాన్స్​కు అభివాదం చేస్తూ ముందుకు కలిలాడు పాండ్యా. బ్యాక్ టు బ్యాక్ క్రికెట్ ఆడి అలసిపోయిన అతడు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

వన్డే వరల్డ్ కప్-2023లో గాయపడిన హార్దిక్ పాండ్యా.. ఇంజ్యురీ కారణంగా చాన్నాళ్లు టీమిండియాకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024తో కమ్​బ్యాక్ ఇచ్చాడు. క్యాష్​ రిచ్ లీగ్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్​లో ఆడి అలసిపోయిన అతడు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. శ్రీలంక సిరీస్​తో అతడు మళ్లీ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేయనున్నాడు. అయితే పాండ్యాకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి కప్పు ఫైనల్​తో అతడు ఆ ఫార్మాట్​ నుంచి వైదొలిగాడు. దీంతో టీ20లకు కొత్త సారథిని నియమించే పనిలో ఉంది బీసీసీఐ. లంకతో సిరీస్​ ద్వారా పర్మినెంట్ టీ20 కెప్టెన్​ను అనౌన్స్ చేయాలని చూస్తోంది.

టీ20 కెప్టెన్​గా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్​ను బీసీసీఐ సెలెక్ట్ చేసిందని తెలుస్తోంది. పలు సిరీస్​ల్లో జట్టును సక్సెస్​ఫుల్​గా నడిపిన అనుభవం, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతడి వ్యక్తిత్వం నచ్చి సారథ్య పగ్గాలు ఇచ్చేందుకు బోర్డు రెడీ అయిందట. సెలెక్టర్లతో పాటు కోచ్ గంభీర్​తో డిస్కస్ చేశాకే ఈ నిర్ణయానికి వచ్చారని టాక్ నడుస్తోంది. దీంతో హార్దిక్​కు అన్యాయం చేశారనే విమర్శలు వస్తున్నాయి. పొట్టి ప్రపంచ కప్​లో జట్టుకు వైస్ కెప్టెన్​గా ఉన్న పాండ్యాను కాదని.. సూర్యను కెప్టెన్ చేయడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గంభీర్ తీసుకున్న నిర్ణయమే హార్దిక్​కు శాపంగా మారిందని తెలుస్తోంది.

పాండ్యాను మూడు ఫార్మాట్లలోనూ ఆడించాలని గౌతీ డిసైడ్ అయ్యాడని సమాచారం. అయితే నిత్యం గాయాలతో సావాసం చేసే హార్దిక్​కు ఇంజ్యురీ అయితే మళ్లీ టీ20లకు కొత్త కెప్టెన్​ను నియమించాల్సి ఉంటుందని బోర్డు భయపడుతోందట. అతడి వర్క్​లోడ్ మేనేజ్​మెంట్​ను దృష్టిలో పెట్టుకొని వన్డేలు, టీ20ల్లో మాత్రమే ఆడే సూర్యను సారథ్యానికి బెస్ట్ ఆప్షన్​గా ఎంచుకున్నట్లు వినికిడి. పాండ్యాను వన్డేలు, టీ20లకే పరిమితం చేస్తే అతడే కెప్టెన్ అయ్యేవాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. హార్దిక్​ను కాదని సూర్యను సారథిగా ఎంచుకోవడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి