Raj Mohan Reddy
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో మెడల్ కొట్టాలనేది ఎందరో క్రీడాకారుల కల. అందుకోసం ఏళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమిస్తారు. మ్యాచ్ రోజు కూడా తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఓ ఆటగాడు మాత్రం నీళ్లు తాగినంత సులువుగా పతకం ఎగరేసుకుపోయాడు.
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో మెడల్ కొట్టాలనేది ఎందరో క్రీడాకారుల కల. అందుకోసం ఏళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమిస్తారు. మ్యాచ్ రోజు కూడా తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఓ ఆటగాడు మాత్రం నీళ్లు తాగినంత సులువుగా పతకం ఎగరేసుకుపోయాడు.
Raj Mohan Reddy
విశ్వ క్రీడల సంబురమైన ఒలింపిక్స్ ఘనంగా జరుగుతున్నాయి. ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటికే భారత్ బోణీ కొట్టింది. షూటర్ మనూ బాకర్ రెండు మెడల్స్‌తో త్రివర్ణ పతాక ఖ్యాతిని మరింత పెంచింది. ఒక మెడలే గొప్ప అనుకుంటే ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి కోట్లాది మంది భారతీయులను ఆనందోత్సాహాల్లో మునిగేలా చేసింది. ఈసారి విశ్వ క్రీడల్లో మనకు మరిన్ని పతకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాడ్మింటన్, హాకీ తదిరత గేమ్స్‌లో మెడల్స్ పక్కాగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఒలింపిక్స్‌కు సంబంధించి ఓ ప్లేయర్ బాగా వైరల్ అవుతున్నాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్‌గా అతడు మెడల్ కొట్టడం చర్చనీయాంంగా మారింది.
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో మెడల కొట్టాలనేది ఎందరో క్రీడాకారుల కల. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తారు. మ్యాచ్ రోజు కూడా తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఓ ఆటగాడు మాత్రం నీళ్లు తాగినంత సులువుగా పతకం ఎగరేసుకుపోయాడు. జాతరలో బెలూన్లు కాల్చినంత ఈజీగా మెడల్ కొల్లగొట్టాడు. అతడి పేరు యూసఫ్ డికెక్. టర్కీకి చెందిన ఈ 51 ఏళ్ల షూటర్ సిల్వర్ మెడల్ సాధించాడు. మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో అతడు పతకం గెలుచుకున్నాడు. అయితే షూటింగ్‌లో సాధారణంగా ఆటగాళ్లు స్పెషల్ గ్లాసెస్, స్పెషలైజ్డ్ గేర్, లెన్సులు, ఇయర్ ప్రొటెక్టర్స్ లాంటివి తప్పకుండా వాడతారు. తమ ఫోకస్ మొత్తం టార్గెట్ మీద ఉంచేందుకు బ్లర్ కనిపించకుండా ఉండేందుకు లెన్సులు, ప్రత్యేకమైన కళ్లద్దాలు వాడతారు.
షూటింగ్ వల్ల వచ్చే శబ్దం వినపడకుండా అథ్లెట్లు ప్రత్యేకంగా తయారు చేసిన ఇయర్ ప్రొటెక్టర్స్ యూజ్ చేస్తారు. కానీ టర్కీ వెటరన్ షూటర్ యూసఫ్ మాత్రం ఇవేవీ లేకుండా జేబులో చేయి పెట్టి కూల్‌గా కాల్చి మెడల్ కొట్టేశాడు. తాను రోజూ వాడే కళ్లద్దాలు పెట్టుకొని ఒక చేతిని జేబులో పెట్టుకొని, మరో చేతితో గన్‌ను పట్టుకొని గురి పెట్టి కాల్చి పతకం కొల్లగొట్టాడు. అతడి వాలకం చూసిన నెటిజన్స్.. ఇతనేంటి ఇంత టాలెంటెడ్‌లా ఉన్నాడు.. జాతర్లో బుగ్గల్ని కాల్చినంత ఈజీగా ఒలింపిక్స్‌లో మెడల్ కైవసం చేసుకున్నాడని సరదా కామెంట్స్ చేస్తున్నారు. దేశం తరఫున ఆడే ఏ అథ్లెట్ మీదైనా ఎంతో ప్రెజర్ ఉంటుందని.. కానీ అదేమీ కనిపించకుండా ఇంత కూల్‌గా మెడల్ కొట్టడం ఇతనొక్కడికే సాధ్యమని మెచ్చుకుంటున్నారు.
The name’s Dikeç. Yusuf Dikeç. 🇹🇷#Paris2024 pic.twitter.com/gOxIb26nYO
— Eurosport (@eurosport) July 31, 2024